BigTV English

TDP senior leader: యనమలకు బాబు షాక్.. యనమల ప్రస్థానం ముగిసినట్లేనా?

TDP senior leader: యనమలకు బాబు షాక్.. యనమల ప్రస్థానం ముగిసినట్లేనా?

TDP senior leader: టీడీపీలో చంద్రబాబు కంటే సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు(Yanamala Ramakrishnudu). పార్టీ ఆవిర్భావం నుంచి సైకిల్ సవారీ చేస్తూ ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నా ఏదో ఒక పదవి అధిరోహిస్తూ వచ్చిన ఆ సీనియర్ ప్రస్తుతం మాజీ ఎమ్మెల్సీగా మిగిలారు. ఆయన 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పుస్తక ఆవిష్కరణ వేడుక తునిలో జరగనుంది. ఆ కార్యక్రమంలో యనమల తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారా? ఎమ్మెల్సీగా తన పదవీకాలం చివరిరోజున కూడా శాసనమండలికి హాజరు కాని యనమల ఆంతర్యం ఏంటి?


1983లో ఎన్టీఆర్‌పై పోటీకి సిద్దమని ప్రకటించిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌లోనే కొనసాగారు. 1983 ఎన్నికల్లో పార్టీ అదేశిస్తే మామ ఎన్టీఆర్‌పై పోటీకి సిద్దం అంటూ ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు చంద్రగిరి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి చేతిలో పరాజయం పాలయ్యారు. తరువాత రాజకీయ పరిణామాలతో తెలుగు దేశం పార్టీలో చేరిన చంద్రబాబు.. పార్టీలో రాజకీయంగా ఉన్నతస్థాయికి ఎదిగి పలు సంచలనాలకు కేంద్రబిందువయ్యారు.


1983లో తుని నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన యనముల

అదే 1983 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా తునిలో టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన యనమల రామకృష్ణుడు తొలి సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చంద్రబాబు టీడీపీలోకి వచ్చాక యనమల ఆయనకు సన్నిహితుడుగా మారారు. పార్టీలో ఎన్టీఆర్, చంద్రబాబులతో కలిసి టిడిపిలో పనిచేసిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తన 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అనేక పదవులు, అనేక బాధ్యతలను నిర్వహించి ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీగా మిగిలిపోయారు.

1983 నుంచి 2004 వరకు తునిలో విజయపరంపర

టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల నుంచి 2004 ఎన్నికల వరకు వరుసగా అన్ని ఎన్నికల్లోనూ యనమల తుని ఎమ్మెల్యేగా తన విజయపరంపర కొనసాగించారు. 2009 ఎనికల్లో తొలి సారి ఓడిపోయిన యనమల ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేదు. తన తమ్ముడు యనమల కృష్ణుడికి తుని టీడీపీ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించి 2013లో తొలిసారి టీడీపీ నుంచి శాసనమండలిలో అడుగుపెట్టారు. టీడీపీ హయాంలో ఆర్థిక మంత్రిగా, స్పీకర్‌గా, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీఏసీ చైర్మన్‌గా ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించిన యనమల ఎమ్మెల్సీ పదవి కాలం మొన్న మార్చితో ముగిసింది.

చివరి రోజు శాసనమండలికి హాజరుకాని యనమల

అయితే చంద్రబాబు ఆయన పదవిని రెన్యువల్ చేయలేదు. అందుకేనేమో ఆయన చివరి రోజు వీడ్కోలు కార్యక్రమం సందర్భంగా కూడా యనమల రామకృష్ణుడు శాసనమండలికి హాజరు కాలేదు. టీడీపీలో సీఎం మినహా అన్ని పదవులు అనుభవించిన ఆయన ఫార్మాలిటీకి కూడా చంద్రబాబుని కలవలేదు. దాంతో యనమల మదిలో ఏముంది? ఎందుకీ మౌనం? అసలు యనమలను ఎందుకు ఎమ్మెల్సీగా కొనసాగించ లేదు? అని టీడీపీ శ్రేణుల్లో రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు, యనమల ఇద్దరు సైలెంట్ మోడ్‌లో ఉండిపోయారు.

10న 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పుస్తకావిష్కరణ

ఇక ఈ నెల పదో తేదీన 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పేరుతో యనమల రామకృష్ణుడు ఒక పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. అంటే దాని అర్థం ఆయన రాజకీయ ప్రస్థానం ముగిసినట్లేనా? లేకపోతే ఆయన ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నారా? అన్న చర్చ మొదలైంది. తెలుగుదేశం కీలక నేతలలో ఒకరిగా వెలుగొందిన యనమల రామకృష్ణుడు… సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పార్టీకి, ప్రభుత్వానికి కీలక సేవలు అందించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ సేవలతో.. ఒకానొక సమయంలో పార్టీలో నెంబర్ టూగా ఫోకస్ అయ్యారు.

రాష్ట్ర విభజన తర్వాత బడ్జెట్ రూపొందించడంలో కీలకపాత్ర

న్యాయ, రవాణా, ఆర్థికశాఖల మంత్రిగా, శాసనసభాపతిగా పనిచేసిన యనమల.. ముఖ్యంగా 2014లో రాష్ట్ర విభజన తర్వాత బడ్జెట్‌లు రూపొందించడంలో కీలకపాత్ర వహించారు. బడ్జెట్ పరిజ్ఞానం ఉన్న లీడర్‌గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే శాసనమండలిలో టీడీపీ పక్ష నేతగా, మండలి ఛైర్మన్‌గా కూడా పార్టీకి పనిచేశారు. టీడీపీలో సాధారణ కార్యకర్త నుంచి పార్టీ పాలసీ మేకర్ స్థాయి వరకు ఎదిగిన వ్యక్తిగా టిడిపిలో గొప్ప గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో ఈనెల 10వ తేదీన తుని లో 42వ వసంతాల రాజకీయ ప్రస్థానం పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్య అతిధిగా శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు.

Also Read: ఇదెందయ్య.. పదవి అన్నది పెత్తనం తమ్ముడిది

చంద్రబాబుని ఉద్దేశించి ఏం మాట్లాడతారో అని ఆసక్తి

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యనమల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబును ఉద్దేశించి ఏం మాట్లాడతారు అనేది ఉత్కంఠ రేపుతోంది. చంద్రబాబు నాయుడుతో అత్యంత సన్నిహితంగా ఉండే యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ పదవి కాలం ముగిసిన సమయంలో కూడా చంద్రబాబుని కలవకపోవడం, ఎమ్మెల్సీగా యనమలను తిరిగి కొనసాగించకపోవడం, కొంతకాలంగా యనమల రామకృష్ణుడు రాజకీయాలకు దూరంగా సైలెంట్‌గా ఉండడంతో ఆయన పుస్తకావిష్కరణలో ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది.

తుని మున్సిపార్టీని టీడీపీ ఖాతాలో వేసిన యనమల

ఇటీవల తుని మున్సిపాల్టీని టిడిపి ఖాతాలో వేయడానికి యనమల గీసిన స్కెచ్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది . యనమల రాజకీయ వ్యూహాల ముందు వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, తుని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కూడా చేతులెత్తేశారు . అలాంటి రాజకీయ అనుభవం ఉన్న యనమల రామకృష్ణుడు ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీగా మిగిలిపోవడంతో.. అసలు చంద్రబాబు మనస్సులో ఏముంది? ఆయన యనమలను ఎలా సముదాయిస్తారు అనే ప్రశ్నలు పార్టీ శ్రేణుల్లో చర్చల్లో నలుగుగున్నాయి.

తుని ఎమ్మెల్యేగా ఉన్న యనమల కుమార్తె దివ్య

ప్రస్తుతం తుని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా యనమల రామకృష్ణుడి కుమార్తె యనమల దివ్య వ్యవహరిస్తున్నారు. కుమార్తె దివ్య రాజకీయంగా ఎదగడానికి ఆమె వెనుక ఉండి రాజకీయం నడిపిస్తా, ఇక తనకు పదవులు నిర్వహించే ఓపిక లేదని యనమల తన సన్నిహితులతో అంటున్నారంట. అయితే తన మంచి మిత్రుడు అయిన యనమల రామక‌ృష్ణుడి విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలుగుతమ్ముళ్లలో ఉత్కంఠ రేపుతోంది. మరి పుస్తకావిష్కరణలో యనమల మౌనం వీడి చంద్రబాబుకు ఏదైనా చెప్పబోతున్నారా?.. లేకా రాజకీయాలు ఇంతటితో చాలు? తన కుమార్తె యనమల దివ్యపై పార్టీతో పాటు తుని ప్రజల ప్రేమాభిమానులు ఉండాలని కోరతారా? అనేది చూడాలి

Related News

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

Big Stories

×