Breaking: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల వరుస మరణాలు జరుగుతున్న విషయం తెలిసిందే.. మొన్న ఓ ప్రముఖ దర్శకుడు మరణించారు. ఇప్పుడు మరొకరు స్వర్గస్తులయ్యారు. ప్రముఖ నిర్మాత సలీమ్ అక్తర్ తుది శ్వాస విడిచారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వయో భారంతో ఆయనను అనేక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టాయి. ప్రస్తుతం ఆయన వయసు 87 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అర్ధరాత్రి మృత్యువు ఒడిలోకి చేరాడు. ముంబైలోని ధీరుబాయ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయారు. విషయాన్ని తన కుటుంబ సభ్యులు ప్రకటించారు. నా సినీ ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేశారు. ఎంతోమంది స్టార్ హీరోయిన్లను ఈయన సినిమాల ద్వారా పరిచయం చేశారు. ఒక మాటలో చెప్పాలంటే బాలీవుడ్ ఇండస్ట్రీకి ఒకప్పుడు లెజెండ్ నిర్మాతనే చెప్పాలి. అలాంటి ఆయన చనిపోవడం ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతూ తన కుటుంబాన్ని ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నారు.
సలీమ్ అక్తర్ సినిమాలు..
ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతల్లో సలీమ్ అక్తర్ ఒకరు. 1970లు, 1980ల లో బాలీవుడ్‌లో తనకు గణనీయమైన ప్రసిద్ధి వచ్చింది. అతను నిర్మించిన చిత్రాలు భారతీయ చలనచిత్ర పరిశ్రమపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. ఎన్నో హిట్ సినిమాలు ఆయన నిర్మాణంలో వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాయి… సలీం అక్తర్ నిర్మించిన ప్రముఖ చిత్రాలు: ఫూల్ ఔర్ అంగారే (1993), ఖయామత్ (1983), ఆద్మీ (1993), రాజా కీ ఆయేగీ బారాత్ (1997) వంటి సినిమాలను నిర్మించి మంచి సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు.
Also Read : నోరు జారాను క్షమించండి.. బాబోయ్ నెటిజన్లు బూ**..
కొత్త హీరోయిన్ల పరిచయం..
రాణి ముఖర్జీకి బాలీవుడ్‌లో మొదటి సినిమా రాజా కీ ఆయేగీ బారాత్ ద్వారా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ఫూల్ ఔర్ అంగారే, ఖయామత్ వంటి చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. రాణి ముఖర్జీ తో పాటు టాలీవుడ్ హీరోయిన్ తమన్నా కూడా ఆయనే ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అమీర్ ఖాన్, బాబి డియోల్ , మిథున్ చక్రవర్తి వంటి స్టార్లతో ఆయన ఎన్నో సినిమాలు నిర్మించారు.. ఆయన ఫ్యామిలీ విషయానికొస్తే.. భార్య పేరు శామా అక్తర్. వీరిద్దరికీ ఒక కొడుకు ఉన్నాడు సమా అక్తర్.. సినీ ఇండస్ట్రీ కి ఎన్నో సేవలు చేసిన నిర్మాత కన్నుమూయడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆయన మరణ వార్త విని సోషల్ మీడియా ద్వారా పోస్ట్లు పెడుతున్నారు. నేడు సాయంత్రం ఆయన భౌతికయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ లోని ప్రముఖ స్టార్లు, నిర్మాతలు హాజరయ్యే అవకాశం ఉందని మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువులు ప్రముఖులు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.