BigTV English

TDP Shadow: ఇదెందయ్య.. పదవి అన్నది పెత్తనం తమ్ముడిది

TDP Shadow: ఇదెందయ్య.. పదవి అన్నది పెత్తనం తమ్ముడిది

TDP Shadow: ఆయనో సీనియర్ నేత… మంత్రిగా కూడా పనిచేశారు. నియోజకవర్గంపై మంచి పట్టున్న నాయకుడు. కూటమి వేవ్‌లో భారీ మెజార్టీతో ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కుతుందని ఎంతగానో ఆశ పడ్డారు. అయితే రిజర్వేషన్ కోటాలో కూడా మంత్రి పదవి దక్కకపోవడంతో సదరు ఎమ్మెల్యే నైరాశ్యంలోకి వెళ్లారట.. అప్పటి వరకు నియోజకవర్గంలో నిరతరం చెక్కర్లు కొట్టిన ఆయన మంత్రి వర్గ ఏర్పాటు తరువాత నియోజకవర్గం ప్రజలకు ముఖo చాటేస్తున్నారంట. దాంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానంలో తమ్ముడు హుషారైయ్యాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆయన సోదరుడు ఎవరు?


సిక్కోలు జిల్లాలో సొంత ఇమేజ్ ఉన్న కొండ్రు మురళి

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి కొండ్రు మురళీమెహన్ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దళిత నాయకుడు.. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంగా ఉన్న రాజంతో పాటు, గతంలో పోటీ చేసిన ఎచ్చెర్ల నియోజకవర్గంలో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. నిరంతరం యాక్టివ్ పాలిటిక్స్ నడిపించే ఆ లీడర్ ఎందుకనో ఈ మధ్య నైరాశ్యానికి గురౌతున్నారట. కాంగ్రెస్ నుంచి టిడిపిలో చేరిన కొండ్రు మురళి గెలుపు ఓటములతో సంబంధం లేకుండా రాజకీయాలను నడిపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎస్సీ కోటాలో మంత్రిపదవి వస్తుందని కొండ్రు గంపెడు ఆశపెట్టుకున్నారు. కానీ అయన ఆశలు అడిఆశలైయ్యాయి. మంత్రి వర్గంలో చోటుదక్కలేదు దాంతో మాజీమంత్రి తీవ్ర నిరాశకు గురవుతున్నారంట.


రాజాంకు రాకపోకలు తగ్గించేసిన కొండ్రు మురళి

అప్పటి వరకు నియోజకవర్గం లో చురుకుగా ఉన్న కొండ్రు మురళి మంత్రి వర్గం ఏర్పాటు తరువాత నియోజకవర్గానికి రాకపోకలు తగ్గించేశారంట. సీనియర్ ఆయిఉoడి.. భారీ మెజారిటీతో గెలిచినా మంత్రి పదవి రాకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అనుచరగణం ఆఫ్ ద రికార్డ్‌గా చెపుతోంది. కారణం ఏదైనా కొండ్రు తన సొంత నియోజకవర్గానికి రావడం బాగా తగ్గించేశారంట. మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన నియోజకవర్గంలో యాక్టివిటీని తగ్గించారనే టాక్ నడుస్తోంది. అన్న సైలెంట్ అవ్వడంతో తమ్ముడి నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యాడంట

రాజాంలో కొండ్రు అందుబాటులో లేకపోవడంపై విమర్శలు

విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసిన కోండ్రు మురళి మోహన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఎమ్మెల్యే ఆడపాదడపా మాత్రమే నియోజకవర్గంలో కనిపిస్తుండం తీవ్ర విమర్శలపాలు అవుతోంది. ఎక్కువగా విశాఖపట్నంలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారంట. మంత్రి పదవి రాకపోవడంతో సొంత వ్యాపారాలు చూసుకోవడంలో కొండ్రు బిజీ అయ్యారట.

అన్నీ తానై వ్యవహరిస్తున్న మురళి తమ్ముడు జగదీష్

దాంతో ఎమ్మెల్యే కొండ్రు మురళి మెహన్ తమ్ముడు కొండ్రు జగదీష్ రాజాంలో అన్నీ తానే అయి వ్యవహరిస్తున్నారంట. రాజాం నియోజకవర్గంలో ట్రాన్స్‌ఫర్స్ మెదలు, వర్క్స్‌ కేటాయింపు వరకూ అన్నీ కొండ్రు జగదీష్ చేతుల మీదుగా నడుస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది. అధికారులు సైతం అతనికే వంత పాడుతున్నారట. రాజాం ఎమ్మెల్యేగా ఉన్న కొండ్రు మురళీ మెహన్ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా ఉంటే ఇలా వచ్చి అలా వెల్లిపోతుండటంతో టిడిపి నేతలు కూడా జగదీష్ వెంటే నడుస్తున్నారట. ఆ క్రమంలో కొండ్రు జగదీష్‌కు షాడో ఎమ్మెల్యే అన్న ట్యాగ్ తగిలించేస్తున్నారు

ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం షాడో ఎమ్మెల్యే పెత్తనం

అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో రిబ్బన్ కటింగ్లు, కొబ్బరికాయలు కొట్టడంతోపాటు అన్నీ తమ్ముడు జగదీష్ నడిపించేస్తుండటం సెగ్మెంట్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం షాడో ఎమ్మెల్యే పెత్తనమే నడుస్తోందంట. ఆయనే అధికారులతో ఫోన్ మాట్లాడటం, క్యాంప్ ఆఫీస్‌కు పిలుపించుకుని అవసరమై ఆదేశాలు జారీ చేస్తుండటం స్థానికులను విస్తుపోయేలా చేస్తోంది. రాజకీయ వ్యవహారాలు చక్కబెట్టడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో సమీక్షలు నిర్వహించడం, అధికారుల సీట్లో కూర్చుంటూ ఆదేశాలు జారీ చేస్తుండటంతో కొండ్రు జగదీష్‌పై అధికారులు అసహనంతో కనిపిస్తున్నారు.

Also Read: సింగపూర్‌కు పవన్, చిన్న కొడుక్కి ఏం జరిగింది?

ట్రాన్స్ ఫర్ చేయించుకుని వెళ్లిపోవాలని అధికారికి వార్నింగ్

తనకు నచ్చినట్లు జరాగాలని లేకుంటే రాజాం నుంచి ట్రాన్స్‌ఫర్ చేయించుకుని వెళ్లిపోవచ్చని జగదీష్ అధికారులను హెచ్చరిస్తున్నారంట. షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న కొండ్రు మురళీమెహన్ తమ్ముడు జగదీష్ ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలా పాఠశాలలను సందర్శించడం, మధ్యాహ్నం భోజనం అమలు తీరుపై ప్రశ్నించడం, అన్ని వ్యవహారాల్లో పెత్తనం చేస్తుండటం తీవ్ర విమర్శల పాలవుతోంది. రాజాం నియోజకవర్గంలో గోకులం షెడ్ల ప్రారంభోత్సవం, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం , అమ్మవారి జాతర ఏర్పాట్ల అంశంలో జగదీష్ చేసిన హడావిడి అంత ఇంతా కాదట. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో జగదీష్ ప్రాధాన్యత నియెజకవర్గంలో పెరిగిపోతుందట. ఎమ్మెల్యేగా గెలిచిన అన్న అందుబాటులో లేకుండా పోవడం, తమ్ముడి పెత్తనంతో అధికార యంత్రాంగం తలలు పట్టుకోవాల్సి వస్తోందంట.

తమ్ముడి పెత్తానాన్ని అన్న, కాదనలేకపోతున్నారా?

అన్నకు రాజకీయలపై ఆసక్తి తగ్గిపోయిందా?.. లేదంటే తమ్ముడి రాజకీయ పెత్తనం కాదనలేక పోతున్నారా అన్న చర్చ రాజాం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది . షాడో ఎమ్మెల్యేగా మారిన కొండ్రు జగదీష్ అంశం నేడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందంట. ఈ అంశంపై అధిష్టానానికి సైతం ఫిర్యాదులు చేసారంట స్వపక్షంలోని నేతలు . దాంతో అలెర్ట్ అయిన కొండ్రు మురళి వ్యతిరేక వర్గానికి అవకాశం ఇవ్వడం ఎందుకు అనుకున్నారో ఏమో .. కొద్ది రోజులుగా మళ్లీ నియోజకవర్గంలో కనిస్తున్నారు. మొత్తమ్మీద షాడో ఎమ్మెల్యేగా మారిన కొండ్రు జగదీష్‌ తీరు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతోంది. మరి పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దుతారా? లేక ఎవరైతేనేం వాళ్ళింట్లో వాళ్ళేగా అని వదిలేస్తారా అని చూడాలంటున్నారు పరిశీలకులు. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం రాజాంలో మొదటికే మోసం రావడం ఖాయం అని టీడీపీ లోకల్‌ లీడర్‌షిప్‌ అభిప్రాయపడుతోంది.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×