OTT Movie : ఫ్యామిలీ డ్రామా సినిమాలను కుటుంబ సభ్యులంతా కలిసి చూసి ఆనందిస్తుంటారు. ఈ ఎమోషన్స్ చూడటానికి కూడా చాలా బాగుంటాయి. వీటికి లవ్ స్టోరీ తోడైతే ఆ మూవీ మరో లెవెల్ లో ఉంటుంది. బాలీవుడ్ నుంచి వచ్చిన ఒక ఫ్యామిలీ డ్రామా మూవీ ప్రేక్షకులను బాగా అలరించింది. ఈ మూవీ మంచి వసూళ్లను కూడా సాధించింది. థియేటర్లలో విజయడంకా మోగించి, ప్రస్తుతం ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే….
జి ఫైవ్ (Zee 5) లో
ఈ బాలీవుడ్ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ‘షాదీ మే జరూర్ ఆనా’ (Shaadi mein jaroor aana). 2017లో విడుదలైన ఈ మూవీకి రత్న సిన్హా దర్శకత్వం వహించారు. దీనిని వినోద్, మంజు బచ్చన్ నిర్మించారు. ఇందులో రాజ్‌కుమార్ రావ్, కృతి ఖర్బందా, కె. కె. రైనా, అల్కా అమీన్, విపిన్ శర్మ, గోవింద్ నామ్‌దేవ్, నవ్ని పరిహార్, నాయని దీక్షిత్, మనోజ్ పహ్వా తదితరులు నటించారు. సత్యేంద్ర, ఆర్తి పెళ్ళిచూపులనుంచి ప్రేమించుకోవడం మొదలు పెడతారు. అయితే విధి వారిని వేర్వేరు దిశల్లోకి తీసుకువెళుతుంది. ‘షాదీ మే జరూర్ ఆనా’ 10 నవంబర్ 2017న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీ మొదటి వారంలో ₹87 మిలియన్లు సంపాదించింది. చివరికి ప్రపంచవ్యాప్తంగా ₹194 మిలియన్ల గ్రాస్‌ను వసూలు చేసింది. స్టార్‌డస్ట్ అవార్డ్స్‌లో ‘షాదీ మే జరూర్ ఆనా’ ఉత్తమ చిత్రం నామినేషన్‌ను అందుకుంది. జీ సినీ అవార్డ్స్‌లో, జ్యోతికా టాంగ్రీ ఉత్తమ మహిళా నేపథ్య గాయని అవార్డును గెలుచుకుంది. ప్రస్తుతం ఈ మూవీ జి ఫైవ్ (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
సత్యేంద్ర ఒక గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్ గా పని చేస్తుంటాడు. ఇతనికి ఆర్తి అనే అమ్మాయి తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. ఆర్తిని చూడగానే సత్యేంద్ర కు బాగా నచ్చుతుంది. తొందర్లోనే పెళ్లి కూడా ఫిక్స్ చేస్తారు. అయితే ఆర్తి పెళ్లి తర్వాత జాబ్ చేయాలని అనుకుంటుంది. ఈ విషయం సత్యేంద్రకి చెప్తే అతను కూడా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత కట్నం కూడా వద్దనుకుంటాడు సత్యేంద్ర. అయితే అతని తల్లి మాత్రం వాళ్ళ దగ్గర కట్నం వసూలు చేస్తుంది. ఆర్తితో జాబ్ కూడా చేయద్దని చెప్తుంది. ఇంతలోనే ఆర్తి కి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఈ విషయం ఎవరికి చెప్పాలో తెలీక భయపడి పెళ్లిరోజే ఇంట్లో నుంచి పారిపోతుంది. ఆ తర్వాత సత్యేంద్ర ఫ్యామిలీ కూడా కొన్ని అవమానాలు పడాల్సి వస్తుంది. కొద్దిరోజుల తర్వాత ఆర్తి సబ్ రిజిస్టర్ అవుతుంది. అయితే మూడు కోట్లు అవినీతికి పాల్పడిందని ఆమెపై కేసు ఫైల్ అవుతుంది. ఈ కేసును ఒక కలెక్టర్ కి అప్పచెప్తారు. అతను ఎవరో చూసి షాక్ అవుతుంది ఆర్తి. అతను మరెవరో కాదు సత్యేంద్ర. ఆర్తి మీద కోపంతో బాగా కష్టపడి కలెక్టర్ అవుతాడు. ఇప్పుడు ఆమె మీద కోపంతో, టార్చర్ చేయాలనుకుంటాడు. చివరికి వీళ్లిద్దరి పెళ్లి జరుగుతుందా? సత్యేంద్ర టార్చర్ చేయడానికే అక్కడికి వస్తాడా? ఆర్తి అవినీతి కేసులో ఎలా చిక్కుకుంటుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ‘షాదీ మే జరూర్ ఆనా’ (Shaadi mein jaroor aana) అనే ఈ మూవీని చూడండి.