17-11-2024 ఆదివారం ( తమ్ముడికి కన్నీటి వీడ్కోలు)
సీఎం చంద్రబాబునాయుడి సోదరుడు నారా రామ్మూర్తినాయుడి అంత్యక్రియలు జరిగాయి. ప్రభుత్వం లాంచనాలతో నిర్వహించారు. చంద్రబాబు తన సోదరుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. చంద్రబాబు స్వయంగా పాడి మోసారు.
19-11-2024 మంగళవారం ( పారిశ్రామిక రంగంపై తొలి ముద్ర)
చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా త్వరితగతిన గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. మంగళవారం పెద్ద ఎత్తున రాష్ట్ర పారిశ్రామిక రంగంపై కూటమి ప్రభుత్వం తొలి ముద్ర వేసింది. కూటమి అధికారం చేపట్టిన ఐదు నెలల్లోనే.. పరిశ్రమలు, ఇంధన రంగాలకు సంబంధించి 10 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ పరిశ్రమల ద్వారా రాష్ట్రానికి 85వేల 83 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 33వేల 966 మందికి ఉపాధి లభించనుంది. రీసెంట్‌గా ప్రకటించిన పారిశ్రామిక పాలసీల ద్వారా కంపెనీలకు ప్రోత్సహకాలు ఇవ్వనుంది ప్రభుత్వం.
ఆర్సెలార్ మిత్తల్, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్స్ కలిసి అనకాపల్లి జిల్లా బంగారయ్యపేట దగ్గర ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నాయి. దీనికి ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ రెండు కలిసి 61వేల 780 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. వాటి ద్వారా 21 వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఆ తర్వాత భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టం లిమిటెడ్.. రక్షణ రంగానికి అవసరమైన ఫిరంగులు, మందుగుండు సామగ్రి తయారీ పరిశ్రమను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తుంది. దీనికోసం మొదటి దశలో 14 వందల 30 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. వాటి ద్వారా 565 మంది ఉపాధి లభిస్తుంది.
ఎల్జీ పాలిమర్స్ కూడా పెట్టుబడులకు మరోసారి సిద్ధమైంది. 5వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సంస్థ అంగీకరించింది. దీంతో 14వందల 95 మంది ఉపాధి లభించనుంది. ఇలా ఏకంగా 85వేల 83 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
19-11-2024 మంగళవారం ( బనకచర్లకు గోదావరి నీళ్లు)
మంగళవారం శాసనసభలో చంద్రబాబు మరో కీలక ప్రకటన చేశారు. 70 వేల కోట్ల రూపాయలతో గోదావరి- బనకచర్ల ప్రాజెక్టు పూర్తి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని అన్నారు. ఇదే జరిగితే రాయలసీమ సహా రాష్ట్రమంతా సస్యశ్యామలమవుతుందని చంద్రబాబు ఆలోచన. అప్పుడు రైతుల ఆదాయం మూడింతలు పెరుగుతుందని ఆయన అంచనా వేస్తున్నారు.
సీఎం ఆలోచన ప్రకారం పోలవరం కుడి ప్రధాన కాల్వ ద్వారా గోదావరి నీటిని కృష్ణా నదికి తరలిస్తారు. అక్కడి నుంచి వైకుంఠపురం బ్యారేజి ద్వారా బొల్లాపల్లి దగ్గర 150 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించే జలాశయానికి పంపిస్తారు. ఆ తర్వాత ఆ నీటిని ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బనకచర్లకు చేరుసస్తారు. అయితే దీనికి 70 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ప్రభుత్వానికి ఇది తలకు మించిన భారం అవుతుంది కనుక.. దాన్ని ప్రైవేట్, పబ్లిక్ భాగస్వామ్యంతో నిర్మించాలని సీఎం ప్లాన్ చేస్తున్నారు. ప్రైవేటు వాళ్లు ఖర్చు పెడితే.. కేంద్ర, రాష్ట్రాలు కొంత భరిస్తాయి. రాష్ట్రానికే ఇది గేమ్‌ఛేంజర్ అవుతుందని చంద్రబాబు చెప్పారు.
19-11-2024 మంగళవారం (కొత్త ఆలోచనతో రహదారుల నిర్మాణం)
దీంతో పాటు.. రహదారుల నిర్మాణంపై కూడా సీఎం మరో కీలక ప్రకటన చేశారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో రహదారులన్నీ అవుట్‌సోర్సింగ్ విధానంలో ప్రైవేటుకు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. వీజీఎఫ్ విధానంలో కొంత నిధులిస్తామని చెప్పారు. దీంతో.. ప్రధాన మార్గాలన్నీ జాతీయ రహదారుల స్థాయిలో మారుతాయని అన్నారు. ఈ రెండు జిల్లాల్లో ఇది వర్క్ అవుట్ అయితే తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఇదే పద్దతి అనుసరిస్తామని చంద్రబాబు చెప్పారు.
20-11-2024 బుధవారం (150 రోజుల పాలనపై సీఎం)
150 రోజుల పాలనలో ఊహకందని అభివృద్ధి, సంక్షేమం అనే అంశంపై చంద్రబాబు శాసనసభలో బుధవారం మాట్లాడారు. గత ప్రభుత్వం ఏపీ బ్రాండ్ దెబ్బతిందని ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వం వ్యవస్థల్ని గాడిన పెడుతుందని అన్నారు. కేంద్రం సహకారంతో ఒక్కో ఇటుక పేరుస్తున్నామని చెప్పారు. పెట్టుబడుల రాక మొదలైందని.. ఇప్పటికే 3.78 లక్షల కోట్ల రూపాయలతో 3 లక్షల 73వేల 539 ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. సుపరిపాలన జరిగితే మరింత మంది వస్తారని చంద్రబాబు అభిప్రాయం. దీని కోసం శాంతిభద్రతలను కాపాడుకుంటామని అన్నారు.
పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని సీఎం తెలిపారు. శాసనసభ్యులు కూడా శాంతిభద్రతలను చేతికి తీసుకోవద్దని క్లారిటీ ఇచ్చారు. ఎవరైనా సమాజానికి సవాలుగా తయారైతే తాటతీస్తామని వార్నింగ్ ఇచ్చారు. డిసెంబరు మొదటి వారంలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు. మద్యం, ఇసుకు పాలసీ, నిబంధనలు ప్రతీ ఒకరు ఫాలో అవ్వాల్సిందేనని చెప్పారు. ఎవరైనా నిబంధలను అతిక్రమిస్తే పీడీ చట్టం కింద కేసులు పెడతామని స్పష్టం చేశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమం అమలు చేస్తున్నామని చెప్పారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా 4వేల రూపాయల పింఛన్ ఇస్తున్నామ్నారు చంద్రబాబు. కేంద్రం సాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని మరోసారి చెప్పారు. రాజధాని నిర్మాణానికి 15వేల కోట్లు, పోలవరానికి రూ.12,157 కోట్లు కేంద్రం మంజూరుచేసిందాన్నారు. జాతీయ రహదారులు, రైల్వే లైన్లు పెద్ద ఎత్తు నిర్మాణం జరుగుతుందని లెక్కలు చెప్పారు సీఎం. పంచాయతీలకు పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 999 కోట్ల రూపాయలు విడుదల చేశామని గర్తు చేశారు. త్వరలో మరో 11 వందల కోట్లు రాబోతున్నాయని అన్నారు.
20-11-2024 బుధవారం (కేబినెట్ కీలక నిర్ణయాలు)
చంద్రబాబు అధ్యక్షతన బుధవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీడీ యాక్ట్ లో కీలకమైన మార్పులు చేస్తూ రూపొందించిన చట్ట సవరణ బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం కొత్తగా 10కి పైగా నేరాల్ని పీడీ యాక్ట్ పరిధిలోకి తీసుకురానుంది. ప్రధానంగా సామాజిక మాధ్యమాల్లో అసభ్య, అభ్యంతరకర పోస్టులు పెట్టినవారిని టార్గెట్ చేస్తూ ఈ మార్పులు చేసింది.
పర్యాటక, క్రీడా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించి పలు నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఏపీ టూరిజం పాలసీకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించే ప్రతిపాదనను ఆమోదించింది. దీంతో.. టూరిజంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. టూరిజం డిపార్ట్‌మెంట్‌లో పెట్టుబడులు పట్టిన వారికి పారిశ్రామిక రాయితీలు లభిస్తాయి.
ఆ తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో స్థానిక సంస్థల్లోని ఛైర్మన్లపై అవిశ్వాసం పెట్టే అంశంలో కీలక మార్పులు చేసింది. అవిశ్వాసం పెట్టే గడువును నాలుగేళ్ల నుంచి రెండేళ్లకి తగ్గించాలని తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి మండలి ఆమోదించింది. 2024- 25 కొత్త క్రీడా పాలసీ కూడా క్యాబినెట్లో ఆమోదం లభించింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి ఈ మంత్రివర్గ సమావేశంలో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించింది.
ఇక.. రాష్ట్రంలో 85వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రీసెంట్‌గా అమరావతిలోని నిర్మాణాలకు సంబంధించి సాంకేతిక కమిటీ ఓ రిపోర్టు ఇచ్చింది. పాత టెండర్లకు గడువు ముగియడంతో.. కొత్తగా టెండర్లు పిలవడానికి పలు ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదలకు కూడా కేబినెట్ ఆమోదం లభించింది.
VO: (21-11-2024 గురువారం – ఆల్ఫా వాయిస్ అంతా ఉండాలి) ( కీలక బిల్లులపై చర్చ)
గురువారం శాసనసభలో ప్రమాదకర అసాంఘిక కార్యకలాపాల నిరోధక సవరణ బిల్లు, ఏపీ భూ దురాక్రమణ నిరోధక బిల్లు-2024 లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని రాష్ట్రాల్లో అధ్యయనం చేశాక యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చామని అన్నారు. ఎక్కడ భూమి కబ్జాకు ప్రయత్నించినా, బెదిరించినా ఈ చట్టం ప్రకారం శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
తల్లి, చెల్లిపై అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టిన వారిని కూడా జగన్ ప్రోత్సహించారని చంద్రబాబు అన్నారు. షర్మిల రాజశేఖర్‌రెడ్డి బిడ్డ కాదు.. విజయమ్మ బిడ్డ మాత్రమే అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని జగన్ సమర్థించారని అన్నారు. వర్రా రవీందర్‌రెడ్డి పోస్టుల వెనక అవినాష్‌రెడ్డి, అతని పీఏ ఉన్నారని, అరెస్టు చేయాలని షర్మిల కోరిన విషయాన్ని గుర్తు చేశారు. హోం మంత్రి అనిత, పవన్ కల్యాణ్‌పైనా నీచంగా పోస్టులు పెట్టారని అన్నారు. ఇకపై ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే ఏం చేయాలో చేసి, చూపిస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ప్రశాంత వాతావరణం ఉంటేనే పరిశ్రమలు వస్తాయన్నారు చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో విద్వేషాలు, మత కలహాలు, రాయలసీమలో ఫ్యాక్షన్, విజయవాడలో రౌడీయిజం ఉండేవని గర్తు చేశారు. అన్నిటింటి కంట్రోల్ చేశాం కాబట్టే.. హైదరాబాద్ మహానగరంగా ఎదిగిందన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం కావాలన్నా శాంతిభద్రతలు ఉండాలని సీఎం పిలుపునిచ్చారు. పోలీస్ వ్యవస్థకు ప్రక్షాళన చేస్తామన్నారు. త్వరలోనే 6,100 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు.
21-11-2024 గురువారం(కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై చర్చ)
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించి శాసనసభలో గురువారం తీర్మానం పెట్టారు. దీనిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇప్పటికే కేబినెట్ ఈ నిర్ణయాన్ని ఆమోదించిందని అన్నారు. త్వరలో కేంద్రానికి పంపుతామని.. వీలైనంత త్వరగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వికేంద్రీకరణకు తాము అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర రాయలసీమను సమానంగా అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు.
21-11-2024 గురువారం (ఎన్టీపీసీ రూ.1.87 కోట్ల పెట్టుబడులు)
ఏపీలో లక్షా 87 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ముందుకొచ్చింది. దీని ద్వారా రాష్ట్రంలో దాదాపు లక్షా 6 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వానికి రానున్న 25 ఏళ్లలో 20 వేల 620 కోట్ల రూపాయలు ఆదాయం రానుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఈ ఒప్పందం కుదుర్చుకుంది.
22-11-2024 శుక్రవారం (స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలపై చర్చ)
రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషమే స్వర్ణాంధ్ర 2047 లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఉద్యోగ, ఉపాధి కల్పనతోపాటు రైతుల ఆదాయాన్ని పెంచుతామని.. మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రవాణా రంగంలో సౌకర్యాల కల్పన, గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
శాసనసభలో శుక్రవారం చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. నాయకత్వం, నాయకుడు, ప్రభుత్వంపై నమ్మకం ఉంటే పెట్టుబడులు వస్తాయని అన్నారాయన. ఇప్పటికే వరద మొదలైందని.. 2047 నాటికి తలసరి ఆదాయంలో దేశంలోనే ఏపీ నంబరు 1 కావాలని టార్గెట్ పెట్టుకున్నట్టు చెప్పారు. ప్రజలు కూడా తమ కుటుంబం 2047 నాటికి ఎలా ఉండాలో ఒక ఆలోచన చేయాలని, విజన్ తయారు చేసుకోవాలని కోరారు.
కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలైందన్న సీఎం.. పలు పాలసీలు తెచ్చామని తెలిపారు. డిసెంబరు 1 నుంచి గేరు మార్చి.. పాలన వేగవంతం చేస్తానని అన్నారు. స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమాన్ని సమర్థంగా అమలుచేస్తే మరోసారి అధికారంలోకి వస్తామని చెప్పారు. ఐదోసారీ తాను సీఎం అవుతానని.. సభలో ఉన్నవాళ్లు కూడా ఎమ్మెల్యేలుగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
22-11-2024 శుక్రవారం (జమిలిపై సీఎం క్లారిటీ)
అసెంబ్లీలో చంద్రబాబు తన కార్యాలయం దగ్గర విలేకరులతో మాట్లాడారు. దేశంలో జమిలి వచ్చినా రాష్ట్రంలో మాత్రం షెడ్యూలు ప్రకారం 2029లోనే సాధారణ ఎన్నికలు ఉంటాయని అన్నారు. ముందస్తు ఎన్నికలేవీ ఉండవని ఆయన చెప్పారు. గత కొన్ని నెలలుగా జమిలిపై జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాలకు చెక్ పెట్టేందుకు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
22-11-2024 శుక్రవారం ( ఎంపీలకు దిశానిర్దేశం)
ఈనెల 25 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. దీంతో సభలో ప్రస్తావించాల్సిన అంశాలపై చంద్రబాబు పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. కేంద్రప్రభుత్వం నుంచి రాష్ట్రానికి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు ఎంపీలంతా కృషిచేయాలని ఆదేశించారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్‌లోని అంశాలు సాకారం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం పొందేలా పనిచేయాలని సూచించారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రైల్వే, జాతీయ రహదారులు, విద్య, వైద్యం, నదీ అనుసంధాన ప్రాజెక్టులపై సభలో ప్రస్తావించాలని చెప్పారు.
23-11-2024 శుక్రవారం( మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం)
అనంతపురం జిల్లాలో శనివారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఎనిమిది మంది మృతి చెందగా, మరో అయిదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చంద్రబాబు దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబసభ్యుల్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.