Kollywood:సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే బ్రతికున్నప్పుడే చాలామంది నటులు అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరం అవుతుంటే, మరి కొంతమంది బాగా అవకాశాలు అందుకొని, ఒక స్ధాయికి చేరుకున్న తర్వాత సడన్ గా అవకాశాలు దూరం అయ్యేసరికి, డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. అంతేకాదు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని ఆత్మహత్యలు చేసుకున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఒక నటుడు మాత్రం.. తాను మరణించిన తర్వాత కూడా తాను నటించిన చిత్రాలు విడుదలై అందరినీ ఆశ్చర్యపరిచారు అంటే ఆయన తన నటనతో ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఆయనకు ఇండస్ట్రీలో నటనతో పాటు అదృష్టం కూడా బాగా కలిసి వచ్చిందని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 చిత్రాలు ఆయన మరణించిన తర్వాత విడుదల అయ్యి, సరికొత్త రికార్డు సృష్టించాయి. మరి ఆయన ఎవరు అనే విషయం ఇప్పుడు చూద్దాం..
సినీ ఇండస్ట్రీలో ఎందరో కమెడియన్స్..
సినిమాలలో స్టార్ హీరోలు కాలేకపోయినా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా , కమెడియన్స్ గా ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న నటులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో కొంతమంది మన మధ్య లేకపోవడం బాధాకరం. మరణించిన కమెడియన్లలో తెలుగు , తమిళ్ ఇండస్ట్రీల నుంచి వచ్చిన వారు కూడా చాలామంది ఉన్నారు. వారిలో వేణుమాధవ్, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కొండవలస, రాజబాబు ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగువారు చాలామంది ఉన్నారు. ఇక తమిళంలో కూడా ఎంతోమంది కమెడియన్స్ ప్రేక్షకులను మెప్పించారు. అలాంటి వాళ్లలో వివేక్, మయిల్సామి, ఢిల్లీ గణేష్, మనోబాలా వంటి నటులు లేకపోవడం చాలా బాధ కలిగిస్తుంది. అలాంటి నటులలో ఒకరైన మనోబాలా తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో మంచి పేరు సొంతం చేసుకున్నారు.
మరణం తర్వాత 20 సినిమాలు విడుదల..
దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా కూడా పేరు దక్కించుకున్న ఈయన 1982లో వచ్చిన “ఆకాశగంగా” సినిమాతో దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేశారు. అంతకుముందు భారతీరాజా సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. ఒక తెలుగుతోపాటు తమిళ్, మలయాళం సినిమాల్లో కూడా నటించిన ఈయన 2014లో విడుదలైన ‘సతురంగ వేటై’ అనే సినిమాతో నిర్మాతగా మారారు. ఇక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పేరు దక్కించుకున్న ఈయన 2023 మే 3వ తేదీన చెన్నైలో తుది శ్వాస విడిచారు. అయితే ఆయన మరణం తర్వాత తీరాకాదల్, కాసేతాన్ కడవులడా, రాయల్ పరంపర, అంధగాన్, ఇండియన్ 2 ఇలా మొత్తం 20 సినిమాలు విడుదలయ్యాయి.
కమెడియన్ గానే కాదు దర్శకుడిగా కూడా గుర్తింపు..
ఇకపోతే ఈయన నటించిన చివరి చిత్రం అంధగాన్. తమిళ్ సినిమాలో దాదాపు అందరి నటులతో కలిసి నటించిన భారీ పాపులారిటీ అందుకున్నారు. ఇకపోతే విజయ్ టీవీలో ప్రసారమైన “కుక్ విత్ కోమాలి” షో మూడవ సీజన్లో కొన్ని ఎపిసోడ్స్ లో కుక్ గా పాల్గొని మంచి పాపులారిటీ దక్కించుకున్నారు. ఇక అలా ఎంతోమంది నటులు నేడు మన మధ్య లేకపోయినా వారి నటించిన ఎన్నో చిత్రాలు.. వారిని మనకు గుర్తు చేస్తూనే ఉంటాయి. ఇకపోతే మనోబాలా కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, తన దర్శకత్వం మెలకువలతో చక్కటి సందేశాత్మక సినిమాలను ప్రేక్షకులకు అందించారు.