చేయాల్సిన పనులపై సీఎం మరింత ఫోకస్
మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అంటూ నినాదమిచ్చి అధికారంలోకి వచ్చింది హస్తం పార్టీ. మరి ఆ మార్పు కోసం జనం ఎదురుచూస్తున్నారు. పాలనలో తొలి ఏడాది వ్యవస్థలను గాడిన పెట్టడానికే సరిపోయింది. ఇందులోనే ప్రధాన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టింది రేవంత్ సర్కార్. అందులో మెజార్టీ హామీలను అమలు చేసింది. అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఫోకస్ సంక్షేమంపైనే కాదు.. అభివృద్ధిపైనా పెట్టాల్సిన పరిస్థితి. అంతే కాదు తమ మార్క్ చూపాలంటే మరిన్ని కొత్త పాలసీలు తీసుకురావాల్సి ఉంది.
పాలనలో మార్క్ చూపించేలా ప్రయత్నం
అటు ఆదాయానికి మించిన ఖర్చు ప్రతి నెలా ఉంది. అలాగని జనంపై పన్నుల భారం వేసే పరిస్థితి లేదు. పకడ్బందీగా వ్యవస్థలు సాగుతున్నాయి. అయితే సీఎం ఒక్కరితో ఇవన్నీ పూర్తికావు. అన్నీ సజావుగా సాగాలంటే గ్రౌండ్ లో పంచాయతీ సెక్రెటరీ దగ్గర్నుంచి సెక్రెటేరియట్ లో సీఎస్ దాకా పాజిటివ్ వే లో పని చేయాల్సి ఉంటుంది. అందరూ కదలాల్సిందే. ఇవన్నీ స్ట్రీమ్ లైన్ అయితేనే నెక్ట్ ఫేజ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది.
గ్రౌండ్ లో ఉద్యోగుల పాత్ర చాలా కీలకం
ఏడాది పాలనలోనే ఎవరికీ అద్భుతాలు జరిగిపోవు. టైమ్ పడుతుంది. గత ప్రభుత్వ వ్యవహారాలు కలిగి నష్టం వీటిని స్టడీ చేసేందుకు, రికవరీ అయ్యేందుకు టైం అవసరం. సో ఇప్పుడు అసలు కథ మొదలైంది. ఇప్పటికే విపక్షాలు ఏం పాలసీలు తెచ్చారు. ఏం చేశారు అని నిలదీయడం మొదలు పెట్టారు. అయితే వారికి ఆ అవకాశం ఇవ్వకుండా వెళ్లాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సింది చాలానే ఉంది. అందుకే సీఎం రేవంత్ వరుసపెట్టి శాఖల వారీగా రివ్యూలు మొదలు పెట్టారు. గేమ్ ఛేంజర్ చేయాలనుకుంటున్నారు. గతం గతః కానీ ఇప్పుడు మాత్రం లెక్క వేరు అని అంటున్నారు.
లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకున్న ప్రభుత్వం
నిజానికి సీఎం రేవంత్ రెడ్డి లాంగ్ టర్మ్ గోల్స్ తో పని చేస్తున్నారు. అవే శాశ్వతంగా నిలిచిపోతాయనుకుంటున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ లో వైఎస్, చంద్రబాబు దూరదృష్టితో చేసిన అభివృద్ధితో దాని దశ తిరిగిపోయింది. సో ఇప్పుడు రేవంత్ కూడా ఫ్యూచర్ లో ఎఫెక్ట్ చూపే వాటిపైనే ఫోకస్డ్ గా ఉన్నారు. ఉదాహరణకు స్కిల్ వర్శిటీ అయినా.. అన్ని హంగులతో నెట్ జీరోగా వస్తున్న ఫ్యూచర్ సిటీ అయినా.. ఏఐ వర్శిటీ అయినా.. స్పోర్ట్స్ కు ఇస్తున్న ప్రాధాన్యం అయినా ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇవి లాంగ్ టర్మ్ గోల్స్. అయితే అవి భవిష్యత్ లో చాలా ఎకానమీ జెనరేట్ చేస్తాయి. కానీ ఇప్పటికిప్పుడు మాత్రం పెద్దగా ఎఫెక్ట్ ఉండదు.
ఫీడ్ బ్యాక్ అనుకున్నంత స్థాయిలో రావట్లేదా?
పేదల విషయంలో మాత్రం సంక్షేమం ఎప్పటికప్పుడు అందాల్సిందే. పాజిటివ్ కోణాన్ని జనంలోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. వస్తున్న డబ్బుల్ని ఆరు గ్యారెంటీలు, సంక్షేమం, అభివృద్ధి కోసం కేటాయించేందుకు సీఎం స్థాయిలో చాలానే శ్రమించాల్సి వస్తోంది. అయితే చేస్తున్న పనులను జనంలోకి తీసుకెళ్లేందుకు ఎగ్జిక్యూట్ చేసేందుకు ఉద్యోగులే కీలకం. స్వయంగా సీఎం రేవంత్ రెగ్యులర్ గా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో శాఖల వారీగా రివ్యూలు చేస్తూనే ఉన్నారు. ఆదేశాలిస్తున్నారు. మరి వాటిని గ్రౌండింగ్ చేయాల్సింది ఆఫీసర్లే. సో ఇంత చేస్తున్నా ఫీడ్ బ్యాక్ అనుకున్నంత స్థాయిలో రాకపోవడానికి ఆరా తీస్తున్నారు. ఫైనల్ గా ఎగ్జిక్యూషన్ లో లోపం ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు.
బీఆర్ఎస్ వర్క్ స్టైల్ కే ట్యూన్ అయ్యారా?
చాలా మంది ఎంప్లాయీస్ బీఆర్ఎస్ వర్క్ స్టైల్ నుంచి ఇంకా బయటపడడం లేదా అన్నది కూడా ఒక యాంగిల్. పదేళ్లుగా ఒకే ప్రభుత్వం ఉండడంతో ఆ లెవెల్ కే పరిమితమయ్యారు. ట్యూన్ మార్చి, గేర్ మార్చి, స్పీడ్ పెంచడంలో వెనకబడుతున్నారా అన్నది కూడా కీలకంగా మారింది. నిజానికి ట్రాన్స్ ఫాం అవ్వాల్సి ఉంది. కానీ అంతా కాలేదంటున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక కొన్ని లక్ష్యాలను నిర్దేశించారు. అయితే ఆ స్థాయిలో ఈ ప్రభుత్వ లక్ష్యాలను టార్గెట్ చేయలేదా? నిర్లిప్తంగా ఉన్నారా.. అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ లక్ష్యాల అమలుపై నిర్లిప్తత ఉందా?
గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఒక స్టైల్ లో పని చేశారు. ఆయన అధికారులకు అప్పుడప్పుడే దర్శనం ఇచ్చేవారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఆ క్రమంలో కేసీఆర్ మూడ్ చూసి పని చేసే వారు. కానీ ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతామంటే కుదురుతుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అధికారులకు పార్టీలు ముఖ్యం కాదు.. ప్రజలు ముఖ్యం. వారికి అందాల్సిన సేవలు ముఖ్యం.
ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఆఫీసర్లే
తాజా ప్రభుత్వం కొన్ని ప్రయారిటీస్ పెట్టుకుంది. పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అమలు చేస్తోంది. ఛాలెంజింగ్ గా తీసుకుని రుణమాఫీ చేసింది. అయినా సరే నిర్లిప్తంగా ఉంటే ఎలా అన్నదే పాయింట్. లెజిస్లేచర్ నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఆఫీసర్లే. సమగ్ర కుటుంబ సర్వే ఉదాహరణ చూద్దాం. సర్వే ఎప్పుడో జరిగినా కంప్యూటరీకరణ మాత్రం చాలా లేట్ అయింది. డేటా అప్లోడ్ చేయలేకపోయారు. అప్లికేషన్లను ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసే వారు కూడా లేకుండా పోయిన పరిస్థితి.
పాత డేటాతోనే రేషన్ కార్డు లిస్ట్ వచ్చిందా?
మరో ఎగ్జాంపుల్. ఇప్పుడు రేషన్ కార్డుల జాబితాలో పేర్లు వచ్చిన వారిలో బీఆర్ఎస్ హయాంలో అప్లై చేసుకుని ఎదురుచూసిన వారి డేటానే తీసుకుని అధికారులు పేర్లు పొందుపరిచారంటున్నారు. సో డేటా సేకరణలో, అర్హులను గుర్తించడంలో మొక్కుబడిగా వ్యవహారం సాగుతోందనడానికి అనర్హుల ఎంపికే నిదర్శనం అన్న వాదనలూ ఉన్నాయి.
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపమా?
ప్రభుత్వం ఎంత పని చేసినా అధికారుల పని తీరు సరిగా లేకుండా చెడ్డపేరు రావడం ఖాయం. నిధులిచ్చుకుంటూ వెళ్తే లాభం లేదు. అవి అసలైన పేద వాళ్లకు చెందాలి. ఇక వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలేమి కూడా కనిపిస్తోందంటున్నారు. గ్రామాల్లో పంచాయతీ సెక్రెటరీలు వర్సెస్ రెవెన్యూ ఉద్యోగులు అన్నట్లుగా మారింది. పని మాది పేరు మాత్రం రెవెన్యూది అని చాలా మంది సెక్రెటరీలు వాపోతున్న పరిస్థితి. ఇక గ్రామాల్లో వీఆర్వోలు, వీఏవోలు, సర్వేయర్లు వస్తారని చెప్పినా అవి వర్కవుట్ కాలేదు. సో ఇటీవలే సీఎం రేవంత్ కూడా ఉద్యోగులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్షాల ఉచ్చులో పడితే చివరకు నష్టపోయేది ఉద్యోగులే అన్నారు.
తెలంగాణ GSDPపై WTC భారీ అంచనాలు
ఆదాయం ఒకలా.. ఖర్చు మరోలా ఉంది. మంచి పవర్ ఫుల్ ఎకానమీ జెనరేట్ అయ్యే రాష్ట్రమే అయినా సంక్షేమం, అభివృద్ధి కోసం చేయాల్సిన ఖర్చు కూడా చాలానే ఉంది. సో ఈ ఆదాయం పెంచడం, మార్గాలు అన్వేషించడం, గ్రౌండ్ లో పని చేయడం ఇవన్నీ ప్రభుత్వ సిబ్బంది జాగ్రత్తగా చూసుకుంటే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అసలైన లబ్దిదారులకు ప్రయోజనం కలిగితే గ్రౌండ్ లెవెల్ లో జనం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి ఏది నిజం?
దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.9%
తెలంగాణ స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి 2036 నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంచనా వేసింది. ప్రస్తుతం జీఎస్‌డీపీ 15 లక్షల కోట్లుగా ఉందని.. వచ్చే 12 ఏళ్లలో అది భారీగా వృద్ధి చెందుతుందని తాజా రిపోర్టుల్లో తేల్చింది. దేశ జీడీపీలో ప్రస్తుతం తెలంగాణ వాటా 4.9% ఉండగా.. అది 2032 నాటికి 7.73 శాతానికి, 2036 నాటికి 9.3 శాతానికి చేరుకుంటుంది. 140 కోట్ల దేశ జనాభాలో కేవలం 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ ప్రోగ్రెస్ ఎంతో ఉంది. తలసరి ఆదాయం జాతీయ సగటుతో పోలిస్తే రెండింతలకు చేరువైంది.
తలసరి ఆదాయం జాతీయ సగటుకు రెట్టింపు
ప్రధానమంత్రి ఎకనమిక్ అడ్వయిజరీ కౌన్సిల్ తాజా అంచనా ప్రకారం తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 3.83 లక్షలుగా నమోదైంది. గోవా, ఢిల్లీ ఈ రెండు రాష్ట్రాలే మన కంటే ముందున్నాయి. జాతీయ సగటుతో పోలిస్తే 193.6 శాతం నమోదైంది. ఇదీ తెలంగాణ రాష్ట్రానికి ఉన్న పవర్. సో దీన్ని ఎలా టర్న్ చేయాలనుకుంటే అలా చేయొచ్చు. అద్భుతమైన పొజిషన్ లో ఉంచాలన్నది సీఎం సంకల్పం. దీనికి ఉద్యోగుల నుంచి జనం దాకా అందరి సపోర్ట్ అవసరం.
ప్రతీ నెల ప్రభుత్వ ఆదాయం రూ.18,500 కోట్లు
ప్రతీ నెల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 18,500 కోట్లు. ఇది సరిపోదు. అన్నీ సక్రమంగా నిర్వహించాలంటే కనీసం నెలకు 30 వేల కోట్లు అవసరం కనిపిస్తోంది. సర్కారుకు వచ్చే ఆదాయంలో ప్రతినెలా 6,500 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అవసరాలకు వాడుతుండగా, మరో 6,500 కోట్లు అప్పులు చెల్లిస్తున్నారు. మిగిలిన 5,500 కోట్లలోనే సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ లెక్కన కనీస అవసరాల వారీగా చూసినా.. ప్రతీ నెలా 22,500 కోట్లు కావాలి.
జీతాలకు 6500 కోట్లు, అప్పులకు 6,500 కోట్లు
వస్తున్న ఆదాయంతో పోలిస్తే ఇది 4 వేల కోట్లు తక్కువగా ఉంది. సో ఆదాయం పెంచుకుందాం అని పై నుంచి ఆదేశాలు వస్తే సరిపోదు. ప్రభుత్వ సిబ్బంది కూడా సరిగా వర్కవుట్ చేయాలి. కొత్త ఐడియాలు తీసుకురావాలి. ఆదాయం పెరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఖజానా బాగుపడుతుంది.
రోజూ రివ్యూలతో సీఎం బిజీ బిజీ
గత పదేళ్లలో పరిపాలన వ్యవస్థలో జరిగిన నష్టం జరిగిపోయింది. ఇక ఆ ట్యూన్ నుంచి బయటకు రావాల్సిన అవసరం కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సీఎం బయట కనిపించడమే గగనంగా ఉండేది. కానీ ఇప్పుడు సీఎం మాత్రం రోజూ రివ్యూలు, పర్యటనలతో బిజీబిజీగా జనం మధ్యే ఉంటున్నారు. జనం మధ్యే తిరుగుతున్నారు. ఆ లెక్కన అధికారులు, సిబ్బందిలోనూ మార్పు రావాల్సిన పరిస్థితి. ప్రభుత్వ ఆదాయం ప్రతీ నెలా మరో 4 వేల కోట్లు పెంచుకోవాలి. సంక్షేమ పథకాలు నిజమైన లబ్దిదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ సాధ్యం కావాలంటే కదలాల్సింది ప్రభుత్వ సిబ్బందే. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు ఉద్యోగుల సహకారం కావాలని.. సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు చేర్చేది ఉద్యోగులేనని సీఎం పదే పదే గుర్తు చేస్తున్నారు కూడా.
ట్రిలియన్ డాలర్ ఎకానమీ సంకల్పం
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రాష్ట్రంలో సామాజిక మార్పు తీసుకొచ్చామని.. ఆర్థికపరమైన మార్పులు తీసుకురావాలంటే ఇంకా కొంత టైం పడుతుందన్నారు సీఎం. నిజానికి ఏ సీఎంకు రాని, లేని సవాళ్లు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉన్నాయి. అయినా సరే ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా తెలంగాణను పరుగులు తీయించేందుకు బలమైన సంకల్పం తీసుకున్నారు. గత పదేళ్ల వ్యవహారం చూశాక తెలంగాణను అంతస్థాయికి తీసుకెళ్లటం ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ, సమర్థత ఉంది. దూరదృష్టి.. భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహన సీఎంకు ఉంది. ఇందుకు అధికారులు, ప్రజల సహకారం కూడా అవసరం. దీర్ఘకాలంలో కలిగే లాభాలు చాలా మేలు చేస్తాయి. ఇన్ స్టంట్ బెనిఫిట్స్ అప్పటికప్పుడు సంతోషం కలిగించినా కొంత వెయిటింగ్ చేస్తేనే బెనిఫిట్ ఎక్కువ.
పాలసీలను ఆవిష్కరిస్తున్న ప్రభుత్వం
నిజానికి దావోస్ లో పెట్టుబడులు కూడా అంత ఈజీగా రాలేదు. చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికే తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025ని ఆవిష్కరించారు. విద్యుత్ కేబుల్స్‌తో పాటు ఇతరత్రా వివిధ రకాల కేబుల్స్ కూడా అండర్ గ్రౌండ్‌లోనే ఉండేలా వివిధ ప్రత్యమ్నాయాలు పరిశీలిస్తున్నారు. ఫిబ్రవరి 10లోగా టూరిజం పాలసీ రెడీ చేయాలని ఆదేశించారు. ఈవీ పాలసీ తెచ్చారు. మెరుగైన పారిశ్రామిక పాలసీ అమలు చేస్తున్నారు. గ్రామీణ రోడ్లకు మహర్దశ కల్పిస్తున్నారు. ఒక్కటేమి ఎన్నెన్నో సమీక్షలు చేస్తున్నారు. లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు.