BigTV English

High Tax GST India : భారతదేశంలో అత్యధిక పన్ను శాతం ఉన్న వస్తువులు, సేవలు ఇవే..

High Tax GST India : భారతదేశంలో అత్యధిక పన్ను శాతం ఉన్న వస్తువులు, సేవలు ఇవే..

High Tax GST India | దేశంలో పన్నుల అంశం ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. ముఖ్యంగా బడ్జెట్ సమీపిస్తున్నప్పుడు, ప్రజలంతా ప్రధానంగా పన్నుల గురించే మాట్లాడుతుంటారు. ప్రభుత్వం పన్నుల్లో ఉపశమనం కల్పించడం ద్వారా తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వస్తువులు, సేవలపై జీఎస్టీ (గూడ్స్ అండ్స్ సర్వీసెస్ ట్యాక్స్) రూపంలో పన్నులను వసూలు చేస్తోంది.


జీఎస్టీ (GST)
గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) అనేది దేశంలో వస్తువులు, సేవల సరఫరాపై విధించే సమగ్ర పన్ను. గతంలో వివిధ రకాల వస్తువులు, సేవలపై వ్యాట్ (VAT) రూపంలో పన్నులు వసూలు చేసేవారు. అయితే, కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పన్నులు మినహా, దాదాపు అన్ని పరోక్ష పన్నులను తొలగించి, ఒకే ఒక్క పన్నుగా జీఎస్టీని 2017 జూలై 1 నుండి కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది.

వస్తువులు, సేవలపై వివిధ రకాల పన్నులను వసూలు చేయడానికి జీఎస్టీ 5 వేర్వేరు పన్ను శ్లాబ్‌లుగా విభజించబడింది. అవి 0%, 5%, 12%, 18%, 28%. అయితే, పెట్రోలియం ఉత్పత్తులు, మద్యపానీయాలు, విద్యుత్తుపై జీఎస్టీ కింద పన్ను విధించరు. ఈ ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వాలు మునుపటి పన్ను విధానాన్ని అనుసరించి విడివిడిగా పన్నులు విధిస్తాయి.


ఇప్పుడు మనం అత్యధికంగా పన్ను చెల్లిస్తున్న వస్తువులు ఏమిటో పరిశీలిద్దాం.

Also Read: భార్య బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు పంపినా ట్యాక్స్ కట్టాలి!.. ఇన్‌కం ట్యాక్స్ రూల్స్ తెలుసుకోండి

28% పన్ను శ్లాబ్‌లోని వస్తువులు
జీఎస్టీ అమలులోకి వచ్చినప్పుడు 28% పన్ను శ్లాబ్‌లో 226 ఉత్పత్తులు ఉండేవి. కానీ కాలక్రమేణా ఈ సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం కేవలం 35 ఉత్పత్తులు మాత్రమే 28% శ్లాబ్ కిందకు వస్తున్నాయి. వీటిలో విలాసవంతమైన లేదా నిర్మాణ, వాహన ఉత్పత్తులు ఎక్కువగా ఉన్నాయి.

ఈ శ్రేణిలోకి వచ్చే కొన్ని ముఖ్యమైన ఉత్పత్తులు:

సిమెంట్
ఆటోమొబైల్ విడిభాగాలు
టైర్లు
మోటారు వాహనాల పరికరాలు
పొగాకు ఉత్పత్తులు (సిగరెట్లు, పాన్ మసాలా)
విమానాలు
ఖరీదైన యాక్సెసరీస్
సినిమా టిక్కెట్లు
ఫైవ్-స్టార్ హోటళ్లలో ఆహారం, పానీయాలు
గతంలో అధికంగా ఉండి తగ్గిన పన్ను శ్లాబ్‌లు
కొన్ని సంవత్సరాల క్రితం 28% పన్ను శ్లాబ్‌లో ఉండే 15 వస్తువులను 18% శ్లాబ్‌కు తగ్గించారు. వీటిలో 27 అంగుళాల టీవీ, వాషింగ్ మెషీన్, ఫ్రిజ్, వాక్యూమ్ క్లీనర్, పెయింట్ వంటి వస్తువులు ఉన్నాయి. ఈ మార్పుతో సామాన్యులకు కొంత ఊరట లభించింది.

పెట్రోల్, డీజిల్‌పై పన్నులు
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి రావు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిపై వ్యాట్, ఇతర పన్నులు ఇష్టానుసారంగా విధిస్తున్నాయి. కానీ, వీటిని జీఎస్టీలో చేర్చి 28% శ్లాబ్‌లో ఉంచితే, పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. పెట్రోలియం ఉత్పత్తులపై ఉన్న అధిక పన్ను భారం సామాన్య ప్రజలను, పరిశ్రమలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.

పాప్‌కార్న్‌పై వివాదాస్పద జీఎస్టీ నిర్ణయం
చక్కెర లేదా మసాలా కలిపినదానిపై ఆధారపడి పాప్‌కార్న్‌కు మూడు వేర్వేరు జీఎస్టీ శ్లాబ్‌లను అమలు చేయాలన్న కేంద్ర నిర్ణయం పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనివల్ల జీఎస్టీ విధానం అమలు తీరుపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పాప్‌కార్న్‌పై విధించిన జీఎస్టీ శ్లాబ్‌లు:
నాన్-బ్రాండెడ్, పప్పు & సుగంధ ద్రవ్యాలతో కలిపిన పాప్‌కార్న్ – 5% జీఎస్టీ
ప్యాక్‌ చేసిన, బ్రాండెడ్ పాప్‌కార్న్ – 12% జీఎస్టీ
కారామెల్ పాప్‌కార్న్, ఇతర స్వీట్ పాప్‌కార్న్ – 18% జీఎస్టీ
ఈ విధంగా ఒక్క పాప్‌కార్న్‌కే మూడు వేర్వేరు జీఎస్టీ శ్లాబ్‌లు ఎందుకు అవసరం అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పాప్‌కార్న్‌పై వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు రకాల పన్నులు అమలులో ఉండగా.. వాటిని జీఎస్టీ కౌన్సిల్ తొలగించి వాటి స్థానంలో పాప్ కార్న్ తయారీ విధానాన్ని బట్టి 5%, 12%, 18% పన్ను శ్లాబ్‌లుగా విభజించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి రావడంతో మంత్రి సీతారామన్ పై విమర్శలు వెలువెత్తాయి.

వచ్చే బడ్జెట్‌లో ఈ పన్ను రేట్లలో మార్పులు చేసి ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. కానీ ఈసారి జీఎస్టీ విషయంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని నిపుణుల అభిప్రాయం. అయితే, ఆదాయపు పన్ను పరిమితి పెంపు గురించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×