Deva Movie: పాన్ ఇండియా సినిమాలకు నిర్మాతలు ఇష్టం వచ్చినట్టుగా టికెట్ ధరలు పెంచేయడం వల్ల టాలీవుడ్‌లో పెద్ద రచ్చే జరిగింది. ఈ విషయంపై ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రితో మీటింగ్ కూడా జరిగింది. సినిమా టికెట్ ధరలు పెంచేయడం గురించి కొన్నాళ్ల పాటు టాలీవుడ్‌లో చాలా డిస్కషన్స్ నడిచాయి. అలాంటిది బాలీవుడ్ కూడా ఇప్పుడు టాలీవుడ్ తరహాలోనే అధిక టికెట్ ధరలతో ప్రేక్షకులపై అదనపు భారం మోపడానికి సిద్ధమవుతోంది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘దేవ’ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా.. ఇప్పటివరకు షాహిద్ కెరీర్‌లోనే లేనంత రేంజ్‌లో ఈ మూవీకి టికెట్ ధరలను ఫిక్స్ చేశారు మేకర్స్. దీంతో బాలీవుడ్‌లో కూడా సినిమా టికెట్ ధరల పంచాయితీ మొదలయ్యింది.
మరీ ఇంత?
జనవరి 31న షాహిద్ కపూర్ (Shahid Kapoor), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటించిన ‘దేవ’ మూవీ విడుదలయ్యింది. టీజర్, ట్రైలర్, పాటల వల్ల సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. పైగా షాహిద్ కపూర్ కూడా ‘దేవ’ను ప్రమోట్ చేయడానికి రంగంలోకి దిగాడు. దీంతో చాలామంది ప్రేక్షకులు ఈ మూవీని థియేటర్లలో చూడడానికి సిద్ధమయ్యారు. జనవరి 29న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి. చాలామంది ప్రేక్షకులు ఉత్సాహంగా మొదటిరోజే టికెట్లు బుక్ చేసుకోవడం మొదలుపెట్టారు. కానీ ముంబాయ్ లాంటి మెయిన్ ఏరియాల్లో ‘దేవ’ టికెట్ ధరలు చూసి చాలామంది ఆడియన్స్ షాకయ్యి వెనక్కి తగ్గారు.
ఒక్కొక్క షోకు ఒక్కొక్క ధర
ముంబాయ్‌లోని జియో వరల్డ్ ప్లాజాలో ఉన్న మైసన్ ఐనాక్స్‌లో ‘దేవ’కు ఒక్క టికెట్ ధర రూ.1820గా ఫిక్స్ చేశారు మేకర్స్. ఇది సెకండ్ షోకు మాత్రమే. అదే ఫస్ట్ షో అయితే ఈ టికెట్ ధర రూ.1720గా ఫిక్స్ చేశారు. మ్యాట్నీ షో అన్నింటికంటే చీప్. దాని టికెట్ ధర రూ.1070. షాహిద్ కపూర్ సినిమాకు ఈ టికెట్ ధరలు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటివరకు షాహిద్ కపూర్ నటించిన ఏ సినిమాకు కూడా ఈ రేంజ్‌లో టికెట్ ధరలు లేవని ఫీలవుతున్నారు. మొత్తానికి ‘దేవ’ (Deva) మూవీ హిట్ అయితే ఈ టికెట్ ధరల విషయం పెద్దగా హైలెట్ అవ్వదు. పొరపాటున ఈ సినిమాకు మిక్స్‌డ్ లేదా నెగిటివ్ టాక్ వచ్చినా ఈ టికెట్ ధరల విషయం ప్రేక్షకుల్లో చర్చనీయాంశం అవ్వక తప్పదు.
Also Read: ట్రెండ్ ఫాలో అవుతున్న ‘తండేల్’ డైరెక్టర్.. వారే కావాలంటూ ఎదురుచూపులు..
ఐడియా వచ్చేసింది
రోషన్ ఆండ్రూస్ (Rosshan Andrrews) తెరకెక్కించిన ‘దేవ’లో షాహిద్ కపూర్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీలో షాహిద్ పాత్ర ఎలా ఉంటుందో ప్రేక్షకులకు గ్లింప్స్ ఇచ్చేశారు మేకర్స్. ఇందులో పూజా హెగ్డే ఒక జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. మొత్తానికి ఈ సినిమా చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తోంది. షూటింగ్ పూర్తయ్యి గతేడాది సమ్మర్‌లోనే ‘దేవ’ మూవీ విడుదల కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల అప్పటినుండి ఇప్పటివరకు వాయిదా పడిన ‘దేవ’.. జనవరి 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.