CM Revanth Reddy: హైదరాబాద్ ను మరో శిఖరానికి చేర్చాలి. ఇది మనకే కాదు.. దేశానికే గ్రోత్ ఇంజిన్. కాబట్టి డెవలప్ మెంట్ ఎంత చేస్తే అంత స్కోప్ ఉన్న సిటీ ఇది. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హైదరాబాద్ ను మరో కోణంలో ఆవిష్కరించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పగ్గాలు చేపట్టిన ఏడాదిలోనే హైదరాబాద్ దశ దిశను మార్చే నిర్ణయాలు తీసుకుంది రేవంత్ ప్రభుత్వం. అవి పట్టాలెక్కి.. అమలు అయితే మాత్రం హైదరాబాద్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లడం ఖాయం.
చిన్న సమస్యల నుంచి పెద్ద వాటి దాకా ఫోకస్
చూశారుగా ఈ సీన్. హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఎంత ఫోకస్డ్ గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మైక్రో లెవెల్ దగ్గర్నుంచి మాక్రో లెవెల్ దాకా అన్నిటినీ జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. ఇది హైదరాబాద్ లేక్‌వ్యూ గెస్ట్ హౌజ్ ఏరియా. ఇక్కడ వరద నియంత్రణ కోసం నిర్మిస్తున్న రెయిన్ వాటర్ సంప్ పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. భారీ వర్షాలు, వరదలు చిన్నపాటి వరదొచ్చినా నగరంలో చాలాచోట్ల రోడ్లు జలమమమై ట్రాఫిక్‌తో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మొత్తం 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వెంటవెంటనే నీరు వెళ్లేలా శాశ్వత పరిష్కారం చూపాలని గతంలో సీఎం ఆదేశించారు. అంతే కాదు పనులను పర్యవేక్షించారు. సో ఈ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చాలు హైదరాబాద్ డెవలప్ మెంట్ గురించి సీఎం ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవడానికి.
హైదరాబాద్ విజన్ 2050కి సీఎం రేవంత్ ప్లాన్
హైదరాబాద్ 2050కి సీఎం రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. అప్పటి వరకు హైదరాబాద్ పూర్తిగా రూపురేఖలు మార్చేలా ఇప్పటి నుంచే పునాదులు వేస్తున్నారు. రోడ్ మ్యాప్ రెడీ చేయించారు. కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఎందుకంటే ముందు చూపు ఉంటేనే ఇలాంటి మహానగరాల దశ మారుతుంది. ఓవైపు పెరిగే జనాభా, పెరిగే ఉపాధి అవకాశాలకు తోడు, రవాణా సౌకర్యాలు కల్పించడం, రోడ్లు వేయడం, మెట్రో విస్తరణ, ఇవన్నీ కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పటి నుంచే క్లారిటీ లేకపోతే భవిష్యత్ కష్టంగా ఉంటుంది. అందుకే సీఎం రేవంత్ హైదరాబాద్ రైజింగ్ కోసం సీరియస్ గా ఫోకస్ పెట్టారు.
ఫోర్త్ సిటీ నిర్మాణం వరల్డ్ క్లాస్ ఐడియా
నిజానికి హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ గా మారిపోయింది. కులీకుతుబ్ షా కాలం నుంచి రకరకాల మార్పులు చెందుతూ చంద్రబాబు, వైఎస్ హయాంలో సైబరాబాద్ అభివృద్ధి జరిగింది. టెక్నాలజీ హబ్ గా ఆ ప్రాంతం మారిపోయింది. ఇక అక్కడితో హైదరాబాద్ డెవలప్ మెంట్ ఆగిపోకూడదు అని సీఎం రేవంత్ గట్టిగా సంకల్పం తీసుకున్నారు. అందుకే ఫోర్త్ సిటీ కోసం అడుగులు వేస్తున్నారు. అది నెక్ట్స్ లెవెల్ డెస్టినేషన్. టెక్నాలజీ మొదలుకొని, స్పోర్ట్స్, ఏఐ, ఐటీ, టూరిజం, హాస్పిటాలిటీ, ఇండస్ట్రియల్ ఒక్కటేమిటి అన్నీ ఫ్యూచర్ సిటీలో రాబోతున్నాయి. అదో అద్భుతమైన ప్రపంచంగా మారుతుంది. ఏ అద్భుతం కూడా రాత్రికి రాత్రి జరగదు. టైం పట్టినా సరే.. ఫోర్త్ సిటీని నిలబెట్టి ప్రపంచానికి చూపాలనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యలో ఎన్ని విమర్శలు వచ్చినా సరే ముందుకు వెళ్లడమే టార్గెట్ గా పెట్టుకున్నారు.
ఫోర్త్ సిటీని ప్రపంచానికి పరిచయం చేసే బాధ్యత
హైదరాబాద్ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి ఏడాది పాలనలోనే ఫోర్త్ సిటీకి పునాదులు పడ్డాయి. ఇదో వరల్డ్ క్లాస్ ఐడియా. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ పూర్తి ప్రణాళికాబద్ధంగా ఫ్యూచర్ సిటీని నిర్మించడం అంటే మాటలు కాదు. ఇది కేవలం సంకల్పబలంతోనే పూర్తవుతుంది. కొత్తగా ఏర్పాటవుతున్న నగరం కావడంతో పారిశ్రామిక, పర్యాటక, ఆతిథ్య రంగాలకు కీలక ప్రాధాన్యం ఇస్తామంటున్నారు. గ్రేటర్ పరిధిలో రోడ్డు, డ్రైనేజీ, ఫుట్‌పాత్‌ల వంటి విషయాల్లో ఇప్పటికే చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఓల్డ్ సిటీ, సహా విస్తరించిన మిగితా హైదరాబాద్ అలాగే కొత్తగా నిర్మితమైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సహా వెస్ట్రన్ సిటీలో సమస్యలు తప్పట్లేదు.
Also Read: ముఖ్యమంత్రిగా ఎవరున్నా ఆయనే నెంబర్ 2- సీఎం రేవంత్
ఇక్కడ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా అప్పటికప్పుడు సమకాలీన అంశాలనే పరిగణనలోకి తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే తాజాగా నిర్మించబోయే ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ రూపొందించి రానున్న 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్లు మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకోబోతున్నారు. సో ఫోర్త్ సిటీతో హైదరాబాద్ ఖ్యాతిని అంతర్జాతీయంగా మరింత పెంచేలా రేవంత్ సర్కార్ తొలి ప్రయత్నంలోనే ప్రాధాన్యంగా తీసుకుంది.
రూ. 1,580 కోట్లతో నాగ్‌పుర్ హైవేబై డబుల్ డెక్కర్ కారిడార్
హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలను తొలగించేందుకు 2,232 కోట్లతో రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్, 1,580 కోట్లతో నాగ్‌పుర్ జాతీయ రహదారిపై డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాలకు సీఎం రేవంత్ ఇప్పటికే భూమిపూజ చేశారు. రాజీవ్ రహదారి ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్ అభివృద్ధి చెందడమే కాకుండా, కరీంనగర్, సిద్ధిపేట, ఆదిలాబాద్ ప్రయాణం సులభతరం అవబోతోంది. పనులు ఫాస్ట్ గా జరుగుతున్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ఈ ప్రాజెక్టు ఆలస్యమైందని సీఎం రేవంత్ ఇప్పటికే ఫైర్ అయ్యారు కూడా. రాజీవ్ రహదారిపై 11.12 కిలోమీటర్ల పొడవుతో 6 లైన్లతో భారీ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తున్నారు. మొత్తం కారిడార్ పొడవు 18 కిలోమీటర్లు ఉండనుండగా.. ఎలివేటెడ్ కారిడార్ పొడవు 11.12 కిలోమీటర్లుగా ఉంది. ఇది పూర్తయితే ORR వరకు ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా వెళ్లొచ్చు.
నాగ్ పూర్ హైవే నెం. 44 పై డబుల్ డెక్కర్ కారిడార్
అటు నాగ్ పూర్ హైవే 44 పైనా డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ కు సీఎం మార్చిలో శంకుస్థాపన చేశారు. ఇప్పటికే నాగ్‌పుర్‌లో వాహనాలు, మెట్రో రైళ్లు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ పై దూసుకుపోతున్నాయి. ఇక్కడ కూడా ఇదే తరహా నిర్మాణం వల్ల ఉత్తర తెలంగాణలోని 5 జిల్లాల ప్రజలు, వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీరబోనున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్‌తోపాటు మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ మీదుగా సాగే ఎన్‌హెచ్-44పైన జంట నగరాల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది.
రక్షణశాఖ అనుమతులు తీసుకొచ్చి మరీ ఈ రోడ్ నిర్మాణం పూర్తి చేస్తున్నారు. అటు మెహిదీపట్నం వద్ద స్కైవాక్ నిర్మాణానికి రక్షణ శాఖ అనుమతి తెప్పించడం కూడా రేవంత్ ప్రభుత్వ విజయమే. ఎందుకంటే ఆ భూములను రక్షణశాఖ నుంచి అనుమతులు తీసుకుని పాదచారులు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేయబోతున్నారు. సో ప్రజా అవసరాలే ప్రాధాన్యంగా ప్రతి నిర్ణయం తీసుకుంటూ వచ్చింది రేవంత్ ప్రభుత్వం.
141 వాటర్ లాగింగ్ పాయింట్స్ కు శాశ్వత పరిష్కారం
వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ లో మరింతగా సదుపాయాలు అవసరం. అందుకే రేవంత్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక హైదరాబాద్ లో మౌలిక సదుపాయాలపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో ఒక దశ వరకే ఆగిపోయిన సందర్భం. మిగితా నగరాలు హైదరాబాద్ ను దాటిపోయేలా విస్తరణ ప్రణాళికలు రెడీ చేసుకున్నాయి. మన దగ్గర మెట్రో విస్తరించకపోతే 9వ స్థానానికి పడిపోయే అవకాశం ఉండడంతో ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి మొదటి అడుగు వేశారు. పెట్టుబడులకైనా, ఉద్యోగ అవకాశాలకైనా, ప్రజలకు మేలైన రవాణా సదుపాయాలు ఉంటే అన్నీ ఆటోమేటిక్ గా జరుగుతుంటాయి. ఇవి ఒక పారామీటర్. అందుకే మెట్రో నెట్ వర్క్ ను సీఎం ప్రాధాన్య అంశంగా తీసుకున్నారు. గత పది నెలల్లో పది సార్లు దీనిపైనే సీఎం రివ్యూ చేశారంటే ఇంపార్టెన్స్ ఎలా ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు.
రెండో దశలో 6 కారిడార్లతో 116 కి.మీ. విస్తరణ
24,237 కోట్ల రూపాయలతో మెట్రో రెండో దశ పనులకు క్యాబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. రెండో దశలో 6 కారిడార్లతో 116 కిలోమీటర్లు విస్తరించబోతున్నారు. ప్రస్తుతం 5 కారిడార్లకు డీపీఆర్ రెడీ చేసి పంపించారు. 4 శాతం నిధులు పీపీపీ నుంచి సేకరించాలని కేంద్రం షరతు పెట్టినా నిధుల విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్పష్టతతో ఉన్నారు. ఇటీవలే హైదరాబాద్ మెట్రో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. ముంబయి, చెన్నైలో లక్షల కోట్లతో మెట్రో విస్తరిస్తున్నారు.
అయితే మన దగ్గర గత ప్రభుత్వం పెద్దగా ఫోకస్ పెట్టలేకపోయింది. మిగితా నగరాలు మెట్రో విస్తరణలో దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ లో పనులు జరగకపోతే 9వ స్థానానికి పడిపోయే పరిస్థితి దగ్గర్లోనే ఉంది. అందుకే దీన్ని ఫస్ట్ టేకప్ చేస్తోంది రేవంత్ ప్రభుత్వం. 3 కారిడార్లు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కలిపేలా రెండో దశ ప్రతిపాదన రూపొందించారు. ఎయిర్ పోర్టుకు ముందు 1.6 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ మెట్రో ఉండబోతోంది. ఓల్డ్ సిటీ మెట్రోకు ఇప్పటికే ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది కూడా.
రూ. 596 కోట్లతో వరదనీటి కాల్వల ఆధునీకరణ
ఇక హైదరాబాద్ చుట్టూ 18 వేల కోట్లతో ఆర్‌ఆర్‌ఆర్ నిర్మించనున్నారు. దీనికి ఎదురవుతున్న సవాళ్లను రేవంత్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది. భూసేకరణకు చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కేంద్రంతో సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇక హెచ్‌సీఐటీఐ ప్రాజెక్టులో భాగంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో రోడ్ల నిర్మాణానికి 8,996 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు రెడీ చేశారు. అటు 596 కోట్ల అంచనాలతో వరదనీటి కాల్వలను, జంక్షన్లలో వర్షఫు నీరు నిలవకుండా అండర్ గ్రౌండ్ వెల్స్ నిర్మిస్తున్నారు. మరోవైపు కేబీఆర్ పార్కు చుట్టూ 826 కోట్లతో ఆరు జంక్షన్లను అభివృద్ధి చేయబోతున్నారు.
దీంతో అక్కడ ట్రాఫిక్ చిక్కులు పూర్తిగా తొలగిపోనున్నాయి. అటు 360 కోట్లతో మీరాలం చెరువు వద్ద 4 లేన్ల బ్రిడ్జి నిర్మిస్తున్నారు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్‌సిటీ వస్తోంది. ఫార్మాసిటీతోపాటు ఏఐ సిటీ, సాఫ్ట్‌వేర్, లైఫ్‌సైన్సెస్, హెల్త్‌కేర్ టెక్నాలజీ వంటి పరిశ్రమల కేంద్రంగా ఉండబోతోంది. యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీకి ఇప్పటికే శంకుస్థాపన చేయగా త్వరలోనే స్పోర్ట్స్ యూనివర్శిటినీ నెలకొల్పబోతున్నారు.
కొత్తగా 39 ఎస్‌టీపీలను నిర్మాణానికి రెడీ
హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రాను ఏర్పాటు చేశారు. ఈ తరహా వ్యవస్థ ఏర్పాటు చేయడం తెలంగాణ చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో చాలా వరకు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. చెరువులను కబ్జాల చెర నుంచి విడిపిస్తున్నారు. అటు హైదరాబాద్ మధ్య నుంచి వెళ్తున్న మూసీనది పునరుజ్జీవంపై సీఎం రేవంత్ సీరియస్ ఫోకస్ పెట్టారు. 5 అంతర్జాతీయంగా పేరొందిన సంస్థలను కన్సార్టియంగా ఏర్పాటు చేసి డీపీఆర్ రెడీ చేయించే పనిలో ఉన్నారు.
మూసీ పునరుజ్జీవంతోపాటు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మూసీలోకి చేరుతున్న మురుగును శుభ్రం చేసేందుకు ఇప్పటికే ఉన్న ఎస్టీపీలకు తోడు కొత్తగా 39 ఎస్‌టీపీలను ఏర్పాటు చేయబోతున్నారు. ఎల్లంపల్లి నుంచి 20 టీఎంసీల నీటిని తరలించి హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చనున్నారు. బాపూఘాట్‌ను తీర్చిదిద్ది, గాంధీ ఐడియాలజీ కేంద్రాన్ని ఏర్పాటుకు ప్రణాళికలు రెడీ చేశారు.
ఆర్‌ఆర్‌ఆర్ దాకా హెచ్‌ఎండీఏ పరిధిలోకి తెచ్చేలా ప్రణాళికలు
ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్ ను మరింతగా డెవలప్ చేసేందుకు భవిష్యత్ అవసరాల కోసం, పరిపాలన కోసం విస్తరించాలని సర్కార్ భావించింది. అందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్‌ఎండీఏలో కొత్త జోన్లు ఏర్పాటు చేశారు. గతంలో నాలుగు జోన్లు ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 6కు చేరుకుంది. ప్రస్తుతం ఏడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న హెచ్‌ఎండీఏలో జోన్లను ఆరుకు పెంచారు. ఆగస్టులో ఉత్తర్వులు జారీ చేశారు కూడా. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ ప్రాంతం 7,200 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండగా.. త్వరలోనే ఆర్‌ఆర్‌ఆర్ మొత్తం హెచ్‌ఎండీఏ పరిధిలోకి తెచ్చేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. సో ఏడాదిలోనే హైదరాబాద్ పై ప్రభుత్వం ఈ స్థాయి ఫోకస్ పెడితే… వచ్చే నాలుగేళ్లలో సిటీ దశ దిశ ఎలా మారుతాయో అర్థం చేసుకోవచ్చంటున్నారు.