Kerala Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డులో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏకంగా 35 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. రెండు బస్సులు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంతో ఆ రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మనంతవాడి సమీపంలో ఘోర ప్రమాదం
ఈ ఘోర రోడ్డు ప్రమాదం కేరళలోని వనంతవాడి సమీపంలో జరిగింది. మనంతవాడి నుంచి పయ్యనూరు వెళ్లే ఆర్టీసీ బస్సు, పయ్యనూరు నుంచి మనంతవాడికి వెళ్లే బస్సులు ఎదురు ఎదురుగా ఢీకొన్నాయి. ఘాట్ రోడ మూల మలుపు దగ్గర రెండు బస్సులు అతివేగంగా రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు బస్సులు తీవ్రస్థాయిలో డ్యామేజ్ అయ్యాయి. ఈ బస్సుల్లోని ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు.
ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్ దృశ్యం..
కేరళలో ఢీకొట్టుకున్న రెండు ఆర్టీసీ బస్సులు
35 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు
ఓ బస్సు మనంతవాడి నుంచి పయ్యనూరు, మరో బస్సు మనంతవాడికి వెళ్తుండగా ప్రమాదం
ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన
స్థానికులుఘటనా స్థలానికి చేరుకుని… pic.twitter.com/yjEJ3Cfi63
— BIG TV Breaking News (@bigtvtelugu) December 3, 2024
వెంటనే సహాయక చర్యలు చేపట్టిన స్థానికులు
ఈ రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాదు, స్థానికులంతా కలిసి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని బస్సుల్లో నుంచి కిందికి దించారు. సుమారు అరగంట తర్వాత పోలీసులు, అగ్నిమాపక, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గాయపడిన వారందరినీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మొత్తం 35 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. వారిలో ఓ బస్సు డ్రైవర్ పరిస్థితి కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలిపారు. మరో బస్సు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆయనకు కేవలం చిన్న చిన్నగాయాలు మాత్రమే తగిలాయి.
మనంతవాడి-పయ్యనూరు దారిలో భారీగా ట్రాఫిక్ జామ్
ఈ యాక్సిడెంట్ లో రెండు బస్సులు రోడ్డుకు అడ్డంగా ఇరుక్కుపోయాయి. సుమారు రెండు గంటల పాటు క్షతగాత్రుల తరలింపు ప్రక్రియ కొనసాగింది. ఇరుకు ఘాట్ రోడ్డు కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. చాలా సేపు కష్టపడి అగ్నిమాపక సిబ్బంది రెండు బస్సులను రోడ్డు మీది నుంచి పక్కకు తీసుకెళ్లారు. ఈ ఘటన నేపథ్యంలో మనంతవాడి-పయ్యనూరు రహదారి మీద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొన్ని గంటలు కష్టపడి పోలీసులు ట్రాఫిక్ ను పూర్తి స్థాయిలో కంట్రోల్ చేశారు.
Read Also: అయ్య బాబోయ్.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఇలా ఉంటుందా? నెట్టింట్లో వైరల్ అవుతున్న క్రేజీ వీడియో!
యాక్సిడెంట్ పై కేరళ సీఎం ఆరా
రెండు బస్సులు ఢీకొన్న ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అవసరం అయితే, క్షతగాత్రులకు మెరుగైన వైద్యసాయం కోసం పెద్దహాస్పిటల్స్ కు తరలించాలని సూచించారు. యాక్సిడెంట్ బాధితుల పరిస్థితిపై తనకు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం క్షతగాత్రులకు జరుగుతున్న ట్రీట్మెంట్ ను పర్యవేక్షిస్తున్నారు.
Read Also: 35 మంది పెళ్లి కాని అమ్మాయిలకు ప్రెగ్నెన్సీ, యూపీలో దారుణం!