E-Paper
Advertisement

T Congress DCC Post: డీసీసీల ఎంపికపై కాంగ్రెస్‌లో గందరగోళం.. హైకమాండ్ నిర్ణయం ఇదేనా!

T Congress DCC Post: డీసీసీల ఎంపికపై కాంగ్రెస్‌లో గందరగోళం.. హైకమాండ్ నిర్ణయం ఇదేనా!
Advertisement

T Congress DCC Post: అసంతృప్తులకు చెక్ పెడుతూ.. ఆశావాహుల ఆశలను తీరుతాయనుకుంటే.. కథ మొత్తం రివర్సైనట్టు కనిపిస్తోంది ఇప్పుడు తెలంగాణ డీసీసీల వ్యవహారం. ఇప్పటికే నియమాకాలు జరిగిపోయాయి.. బాధ్యతల స్వీకరణ కూడా జరిగింది.. కానీ అసంతృప్తులు తగ్గలేదు సరికదా.. మరింత పెరిగినట్టు తెలుస్తోంది. ఇంతకీ డీసీసీల ఎంపిక ఎందుకు వివాదస్పదమైంది? అసంతృప్తులు లెవనెత్తుతున్న ప్రశ్నలేంటి?

కనీసం ముఖ పరిచయం లేని వారికి పోస్టులు!
జిల్లా కాంగ్రెస్ కమిటీల ఎంపిక వ్యవహారం బూమారాంగ్‌ అయినట్టు కనిపిస్తోంది. చాలా చోట్ల ఎంపికైన నేతలంతా కూడా ఎవరో ఒకరి సిఫారసుతోనో.. లేక ఇప్పటికే ఒక పదవిలో ఉన్నవారే కనిపిస్తుండటంతో ఆశావాహులు ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నారు. నిజానికి ఈ డీసీసీలపై పార్టీని నమ్ముకుని, ఏళ్ల తరబడి పార్టీని వీడకుండా ఉన్నవారు చాలా ఆశతో కనిపించారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లి.. కనీసం ముఖ పరిచయం లేని వారికి హైకమాండ్ అవకాశం ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో పార్టీ మనుషులను గుర్తించి బాధ్యతలను కట్టపెడతామంటూ… రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ వ్యాఖ్యలను గుర్తుచేసుకొని మరీ నవ్వుకుంటున్నారట కొందరు కాంగ్రెస్ నేతలు.

Advertisement

పార్టీలో ఐదేళ్లు ఉన్నవారికే పదవిని ఇస్తామనే షరతులు
నిజానికి ఈ డీసీసీల ఎంపికపై అనేక షరతులు విధించినట్టు కనిపించింది. ఒకరికి ఒక పదవి మాత్రమే ఉండాలి.. పార్టీలో ఐదేళ్లు ఉన్నవారికే పదవిని ఇస్తామనే షరతులు వినిపించాయి. కానీ ఇవేవీ అమల్లోకి వచ్చిన దాఖలాలు కనిపించలేదు. దీంతో డీసీసీల ఎంపికకు పెట్టిన షరతులు ఉత్తి కాకమ్మ కబుర్లేనా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. పదవులు ఉన్నవారికే డీసీసీలను కట్టబెట్టారని.. గతేడాది పార్టీలో చేరిన వారికి కూడా డీసీసీ ఇచ్చారనే చర్చ జరుగుతోంది.

కైలాష్‌పై కేసు ఫైల్ చేయాలని నల్గొండ ఎస్పీకి లేఖ
నల్గొండ కొత్త డీసీసీ అధ్యక్షుడిగా పున్నా కైలాష్ నేతను ఎంపిక చేయడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వెంటనే కైలాష్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కైలాష్ తనపై, తన కుటుంబంపై అసభ్యకరంగా మాట్లాడారని కోమటిరెడ్డి ఆరోపించారు. అలాగే కైలాష్‌పై కేసు ఫైల్ చేయాలని నల్గొండ ఎస్పీకి సైతం మంత్రి కోమటిరెడ్డి లేఖ రాశారు. అయితే దీనికి ఓ కారణం ఉంది.

Advertisement

హైదరాబాద్ డీసీసీ ఎంపికపై కూడా అసంతృప్తి..
ఇలా బహిరంగంగా తనను విమర్శించిన కైలాష్‌ను డీసీసీగా ఎంపిక చేయడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇక హైదరాబాద్‌ డీసీసీ ఎంపికపై కూడా నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇంచార్జ్‌ నేతలు, ఎమ్మెల్యేలు ఏకంగా కార్యక్రమాన్ని బహిష్కరించారు. అసలు హైదరాబాద్‌లో పార్టీ బలంగా లేదనుకుంటున్న సమయంలో ఇలాంటి నిర్ణయాలు సరికావనే చర్చ జరుగుతోంది. ఇక సిట్టింగ్‌ డీసీసీకి మరో చాన్స్‌ ఇవ్వరనే చర్చ జరిగింది. కానీ మళ్లీ ఏకంగా ఐదుగురు నేతలకు అవే బాధ్యతలను అప్పగిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. మెదక్, ములుగు, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, నారాయణపేట డీసీసీలకు పాత నేతలనే మళ్లీ కొనసాగించారు.

పదవులు లేకుండా పనిచేస్తున్న వారి సంగతేంటి?
ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లకు డీసీసీ పదవులు ఇస్తే ఏళ్ళ తరబడి పార్టీ కోసం ఎలాంటి పదవులు లేకుండా పనిచేస్తున్న నాయకుల సంగతేంటి? అనేది ఇప్పుడు నేతలు వేస్తున్న ప్రశ్న. ఇక ఇచ్చిన వారిలో చాలా మంది జూనియర్లు ఉన్నారు. డీసీసీ అంటే జిల్లాకే బాస్. మరి అలాంటి బాస్‌ జూనియర్ అయితే.. అతను చెప్పే మాటలు తీసుకునే నిర్ణయాలు సీనియర్ నేతలు వింటారా? అనేది మరో ప్రశ్న.

Also Read: పంచాయతీ ఎన్నికలపై ఫోకస్‌ చేసే టైమ్ ఉందా? కమలంలో కొత్త పంచాయతీ..

ఒక్క కోమటిరెడ్డి మాత్రమే కాదు.. మరికొంత మంది మంత్రులు కూడా డీసీసీల ఎంపికపై అంత హ్యాపీగా లేరని తెలుస్తోంది. కొందరు మంత్రులు తాము అనుకున్నవారికి పదవులు ఇప్పించుకున్నారని.. దీంతో మిగిలిన నేతలు హ్యాపీగా లేరనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పార్టీకి మరింత బలంగా మారి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టడానికి కారణమవుతాయనుకున్న నియమాకాలు.. ఇప్పుడు రివర్స్‌లో పనిచేస్తాయా? నష్టాన్ని చేకూరుస్తాయా? అనే చర్చ మొదలయ్యేలా చేసిందనే టాక్ వినిపిస్తోంది.

Story By Vamshi Krishna, Bigtv

Related News

టంగ్ స్లిప్ప‌వుతుందా? ఓట‌మిని ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారా? జ‌నాల‌ను కించ‌ప‌రిచేలా ఈ మాట‌లేలా?

ఆది నుంచి త‌ప్పట‌డుగులే.. వివాదాలే ఆమె దారి? ఇదీ కొండా సురేఖ వైఖరి!

ఇకపై అసమ్మతి గళాలకు బ్రేకులు… పరిపాలన పై రేవంత్ సర్కార్ మరింత పట్టు..

రేవంత్ నాయకత్వాన్ని బలపరిచేలా అధిష్టానం అడుగులు! ఢిల్లీ పెద్ద‌ల‌తో స‌త్సంబంధాల సంకేతాలు..!

సీఎంగా రేవంత్ ఉన్నంతకాలం కేసీఆర్ అసెంబ్లీకి రారు.. కేటీఆర్ క్లారిటీ!

లీ క్వాన్ యూ ఎవరు? కేసీఆర్‌ను ఆయనతో పోల్చిన కేటీఆర్‌.. అసలు కథ ఇదే!

మేమొచ్చినా.. వెంట‌నే హామీలు అమ‌లు చేయ‌లేం.. ! కుదురుకోవ‌డానికి ఐదారేళ్లు ప‌డుతుందేమో..? ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కేటీఆర్ కామెంట్స్‌..

ఎంపీ ధర్మపురి అరవింద్‌కు బిగ్ షాక్.. తిరగబడ్డ సొంత పార్టీ నేతలు!

Big Stories

Advertisement
×