BigTV English

Sharmila Vs Jagan: చెల్లిపై అన్న అస్త్రం.. శైలజానాథ్ చేరిక వెనుక

Sharmila Vs Jagan: చెల్లిపై అన్న అస్త్రం.. శైలజానాథ్ చేరిక వెనుక

కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పేసుకున్నారు. మాజీ సీఎం జగన్ ఆయన్ని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కొద్ది రోజులుగా శైలజానాథ్ వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఆ లాంఛనాన్ని పూర్తి చేస్తూ అధికారికంగా తన మద్దతు దారులతో కలిసి శైలజానాథ్ వైసీపీలో చేరారు. జగన్ రాజకీయ విధానాలు నచ్చి పార్టీలో చేరానని.. ప్రస్తుత ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని శైలజానాథ్ చెప్పుకొచ్చారు. అధికారం కోసమో, బిజినెస్‌ల కోసమో రాజకీయాలు కాదంటున్న శైలజానాథ్ ఎన్డీఏ కూటమిపై వైసీపీ నాయకుడి తరహాలో ధ్వజమెత్తారు.

మరి కొందరు కాంగ్రెస్ ముఖ్యులు వైసీపీలో చేరుతారని కూడా శైలజానాథ్ ప్రకటించారు. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన శింగనమల నుంచి శైలజానాథ్ రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పని చేసారు. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గానూ వ్యవహరించారు. వైసీపీ ప్రజల తరుపున పోరాడుతుందని, కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేక మొదలైందని.. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అవలంభిస్తోందని వైసీపీలో చేరిన ఆయన షరా మామూలుగానే విమర్శలు గుప్పించారు.


దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన సీనియర్ నేత శైలజానాథ్ 2022లో పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అప్పట్లో షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పజెప్పడం కోసం ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఒకింత అసంతృప్తితో ఉన్న ఆయన గత ఎన్నికల సమయంలోనే పార్టీ మారతారన్న ప్రచారం జరిగింది. టీడీపీతో కూడా టచ్‌లోకి వెళ్లారన్న టాక్ నడిచింది. అయితే ఏ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నెల్ రాకపోవడంతో ఆయన సైలెంట్ అయ్యారు.

ఇక తాజాగా వైసీపీలో చేరిక సందర్భంగా శైలజానాథ్‌కు జగన్ స్పష్టమైన హామీలు ఇచ్చారంటున్నారు. గత ఎన్నికల్లోనే ఆయన తన కుమారుడు రిత్విక్‌ని పొలిటికల్ అరంగేట్రం చేయించాలని భావించారంట. అది సాధ్యపడలేదు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తండ్రి కొడుకులిద్దరికీ టికెట్లు ఇస్తానని జగన్ ప్రామిస్ చేశారంట. 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగి అసెంబ్లీ స్థానాలు పెరగనున్న నేపధ్యంలో ఎస్సీ నేతలైన శైలజానాథ్, రిత్విక్‌లు ఇద్దరు బరిలో నిలిచే అవకాశం ఉందంటున్నారు. ఈ లోగా జగన్ ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పచెపుతారన్న ప్రచారం జరుగుతుంది.

ఇక శైలజానాథ్‌ను జగన్ అంత సాదరంగా ఆహ్వానించి పార్టీలో చేర్చుకోవడం వెనుక చాలా లెక్కలే ఉన్నాయంటున్నారు. గత ఎన్నికల ముందు నుంచి జగన్‌కు ఆయన చెల్లెలు, పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల పక్కలో బల్లెంలా తయారయ్యారు. కూటమి నేతల విమర్శలను పార్టీ నేతలతో కలిసి తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్న జగన్.. చెల్లెలి విషయంలో మాత్రం సెల్ఫ్ డిఫెన్స్‌లో పడ్డారు. అందుకే కాంగ్రెస్‌లో తనకున్న పరిచయాలతో షర్మిలను పీసీసీ చీఫ్‌గా తప్పించడానికి తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారంట. అది కుదరకపోవడంతో ఇప్పుడు కొత్త స్కెచ్ గీశారంట.

పీసీసీ చీఫ్‌గా పనిచేసిన శైలజానాథ్‌ను వైసీపీలో చేర్చుకోవడం ద్వారా.. కాంగ్రెస్ సీనియర్లలో షర్మిలపై వ్యతిరేకత పెరిగిందన్న విషయాన్ని హైలెట్ చేయాలని చూస్తున్నారంట. అందులో భాగంగానే కాంగ్రెస్ నుంచి మరింత మంది సీనియర్లు వైసీపీలోకి వస్తున్నారని చెప్పించారంట. ఇక శింగనమలలో సరైన నాయకుడు లేక వైసీపీ పరిస్థితి అధ్వాన్నంగా మారింది. 2019 లో వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచి 2024 ఎన్నికల్లో పార్టీలో వ్యతిరేకత కారణంగా టికెట్ కూడా దక్కించుకోలేక పోయారు.

Also Read: అబ్బాయ్ ఆశలు నెరవేరతాయా? బలి పశువు అవుతారా?

గత ఎన్నికల్లో టిడిపి నుంచి అప్పటికే ఒకసారి ఓడిపోయిన శ్రావణి 2024 ఎన్నికల్లో మంచి మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ తరపున జొన్నలగడ్డ పద్మావతి ప్లేస్ లో వీరంజానేయులు అనే టిప్పర్ డ్రైవర్‌ని పోటీలోకి దింపామని గొప్పగా చెప్పుకొంది వైసీపీ.. అసెంబ్లీ సమన్వయకర్తగా వీరాంజనేయులు నియమించింది వైసీపీ అధిష్టానం.. కానీ పైకి మాత్రమే వీరాంజనేయులు పెట్టి.. పెత్తనం అంతా మాజీ మంత్రి జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివరెడ్డి ది కొనసాగేదని వైసీపీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు సాంబశివారెడ్డికి చెక్ పెట్టడానికి జిల్లా వైసీపీ సీనియర్ నేతలే ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు.

ఆ క్రమంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. శైలజానాథ్‌ను వైసీపీలోకి తీసుకు రావడంలో మెయిన్ రోల్ పోషించారంట. కేతిరెడ్డి పెద్దారెడ్డి అంత పట్టుదలకు పోవడానికి చేయడానికి మరో కారణం కూడా ఉంది. చాలా కాలంగా సింగనమల మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి,ఆమె భర్త ఆలూరు సాంబశివ రెడ్డి తో వైసిపి సీనియర్ నేతలు అయిన అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి వంటి వారికి పోసగడం లేదు. 2024 ఎన్నికల టైం లో కూడా టికెట్ పద్మావతికి రాకపోవడానికి కారణం కూడా జిల్లా వైసీపీ సీనియర్ నేతలే అని ప్రచారం ఉంది.

అయితే పద్మావతి భర్త ఆలూరు సాంబశివారెడ్డికి జగన్ దగ్గర ఉన్న సంబంధాలతో తన అనుచరుడు టిప్పర్ డ్రైవర్ అయిన వీరాంజనేయులుకి టికెట్ ఇప్పించుకున్నాడు. వీరాంజనేయులు కూడ ఓటమి పాలవ్వడంతో ఇక సాంబశివారెడ్డి ఫ్యామిలీకి చెక్ పెట్టేందుకు వైసీపీ సీనియర్ నేతలకు మార్గం సుగమం అయింది. ఇక్కడ ట్విస్ట్ ఏటంటే శైలజానాథ్ వైసీపీలో చేరడానికి ప్రధాన కారకుడైన కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఆగర్భ శత్రువులు జేసీ బ్రదర్స్.. అలాంటి జేసీ దివాకరరెడ్డిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నాకే శైలజనాథ్ వచ్చి వైసీపీలో చేరారు. మొత్తానికి సాకె శైలజానాథ్ వైసీపీ కండువ కప్పుకోవడం వెనుక పెద్ద కథ నడవడమే కాదు. ఎవరి లెక్కలు వారికి ఉన్నాయంటున్నారు.

Related News

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

Big Stories

×