BigTV English

OTT Movie : టెక్నాలజీ తో మనుషుల్ని చంపే దెయ్యం… గూస్ బంప్స్ తెప్పించే హారర్ థ్రిల్లర్

OTT Movie : టెక్నాలజీ తో మనుషుల్ని చంపే దెయ్యం… గూస్ బంప్స్ తెప్పించే హారర్ థ్రిల్లర్

OTT Movie : హారర్ సినిమాలు కొత్త కొత్త కంటెంట్ తో థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను భయపెడుతున్నాయి. వీటిలో వణుకు పుట్టించే సినిమాలతో పాటు, నవ్వు తెప్పించే హారర్ సినిమాలు కూడా ఉన్నాయి. వెన్నులో వణుకు పుట్టించే ఒక హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘రింగ్స్’ (Rings). 2017లో విడుదలైన ఈ మూవీకి ఎఫ్. జేవియర్ గుటిరెజ్ దర్శకత్వం వహించారు. డేవిడ్ లౌకా, జాకబ్ ఆరోన్ ఎస్టేస్ అకివా గోల్డ్స్‌మన్ దీనిని రచించారు. ఇందులో మటిల్డా లూట్జ్ ఏడు రోజుల్లో తన ప్రాణాలను హరించే భయంకరమైన శాపానికి గురవుతుంది. అలెక్స్ రో, జానీ గాలెకి, ఐమీ టీగార్డెన్, బోనీ మోర్గాన్ మరియు విన్సెంట్ డి’ఒనోఫ్రియో కూడా సహాయక పాత్రల్లో నటించారు.  ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

ప్లేన్ లో ఒక వ్యక్తి భయపడుతూ ఉంటాడు. పక్కన కూర్చున్న అమ్మాయి ఎందుకు భయపడుతున్నావు అని అడుగుతుంది. నాకు ఒక అమ్మాయి వీడియో చూపించిందని, అది చూస్తే ఏడు రోజుల్లో చనిపోతానని చెప్పారని భయపడుతూ చెప్తాడు. ఆ సమయం పూర్తి కావడానికి ఐదు నిమిషాలే ఉంటుంది. ఆ అమ్మాయి అతనిపై విచిత్రంగా చూస్తుంది. ఆ వెంటనే ప్లేన్ కూడా కూలిపోతుంది. మరోవైపు హీరో, హీరోయిన్లు ప్రేమించుకుంటూ ఉంటారు. హీరో చదువుకోడానికి సిటీకి వెళ్లాల్సి వస్తుంది. వీడియో కాల్ మాట్లాడుకుంటూ ఉందామని హీరోయిన్, హీరోకి చెప్తుంది. హీరో చదువుకోవడానికి సిటీకి వెళ్లిపోతాడు. అక్కడ పనిచేసే ప్రొఫెసర్ అ దయ్యం వీడియోని చూస్తాడు. ఆ వీడియో మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాడు ప్రొఫెసర్. ఆ వీడియో ఏడు రోజుల లోపల మరో వ్యక్తికి చూపిస్తే, ఆ దయ్యం ఏమీ చేయకుండా వీడియో చూసిన వాళ్ళ పైకి వెళ్తుంది. ఒకవేళ ఏడు రోజుల్లోపు, వేరొకరికి ఆ వీడియో చూపించకపోతే ఆ దయ్యం వీళ్ళని చంపేస్తుంది.

ఈ విషయం ప్రొఫెసర్ తెలుసుకొని, తన అసిస్టెంట్ కి ఆ వీడియో చూపిస్తాడు. ఆ తర్వాత ఆ దయ్యం నుంచి తప్పించుకుంటాడు. ఒకరోజు ఫోన్ చేసినా ఎంతకీ హీరో తీయకపోవడంతో, హీరోయిన్ అతన్ని వెతుక్కుంటూ వస్తుంది. అప్పటికే ప్రొఫెసర్ అసిస్టెంట్ ఆ వీడియోని, హీరోయిన్ కి చూపించాలనుకుంటుంది. అయితే హీరో అక్కడికి వచ్చి ఆ వీడియో చూడొద్దని చెప్తాడు. హీరో కూడా ఆ వీడియో చూసి ఉంటాడు. ఇక హీరోకి కూడా అదే చివరి రోజు అవడానికి ఉంటుంది. చివరికి ఆ దయ్యం నుంచి వీళ్ళు తప్పించుకుంటారా? టెక్నాలజీని దయ్యం ఎందుకు వాడుతుంది? ఈ దయ్యం కథకు ముగింపు వస్తుందా? ఈ విషయాలు తెలియాలంటే ‘రింగ్స్’ (Rings) అనే ఈ మూవీ ని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

OTT Movie : పెళ్ళైన ట్యూషన్ టీచర్ పై ప్రేమ… సీక్రెట్ లెటర్ తో బండారం బట్టబయలు… IMDbలో 7.5 రేటింగ్

OTT Movie : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

OTT Movie : బాబోయ్ చావడానికెళ్లి ఇలా బుక్కయ్యాడేంటి… 12 జన్మలు, 12 సార్లు చావు… కల్లో కూడా చావు గురించి ఆలోచించరు

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : వరుడిని కోమాలోకి పంపే పెళ్లి కూతురు కోరిక… అంతలోనే మరో పెళ్ళికి సిద్ధం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Big Stories

×