E-Paper
Advertisement

తండ్రి చాటు బిడ్డగానే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి! దామోద‌ర‌రెడ్డి డ్యుయ‌ల్ రోల్ అట్టర్ ఫ్లాప్?

తండ్రి చాటు బిడ్డగానే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి! దామోద‌ర‌రెడ్డి డ్యుయ‌ల్ రోల్ అట్టర్ ఫ్లాప్?
Advertisement

నాగ‌ర్ క‌ర్నూల్‌లో తండ్రీకొడుకుల రాజ‌కీయాల మ‌ధ్య యువ‌త ప‌ట్టింపు లేకుండా పోతోందా? ఇద్దరి మధ్యలో కాంగ్రెస్ యూత్ క్యాడ‌ర్ నిర్లక్ష్యానికి గుర‌వుతోందా? అందుకే కొంత‌కాలంగా వారంతా పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టన‌ట్టుగా వ్యవహరిస్తున్నారా? అంటే.. అవున‌నే ఆన్షర్ వ‌స్తోంది. పార్టీని అధికారంలోకి తేవ‌డానికి నాడు ఉర‌క‌లెత్తిన యువ‌ ఉత్సాహం.. ఇప్పుడు చల్లబడిందంటున్నారు.

అస‌లు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో అస‌లేం జ‌రుగుతోంది..?

త‌ను ఎమ్మెల్యేగా కావాల‌నుకున్న ద‌శాబ్దాల క‌లను తన కొడుకు రాజేశ్‌రెడ్డి ద్వారా నెర‌వేర్చుకున్నారు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోద‌ర‌రెడ్డి. ఉన్నత విద్యావంతుడు, డాక్టరైన రాజేశ్‌రెడ్డికి రాజ‌కీయాల్లో అనుభ‌వం లేదు. అందుకే ఆది నుంచి ఆయ‌న తండ్రి చాటు బిడ్డగానే అక్కడి రాజ‌కీయాల్లో కొనసాగుతున్నారు. ఇప్పటి వ‌ర‌కు త‌న‌దైన మార్కును వేసుకోలేక‌పోయార‌నే ప్రచారం కూడా ఉండ‌టంతో యువ‌త ఆయ‌న‌తో సంతృప్తిగా కొన‌సాగ‌డం లేద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

తండ్రి ప‌ట్టించుకోడు.. కొడుకు నిర్ణయాలు తీసుకోడు..

Advertisement

నిజానికి, ఎమ్మెల్సీ దామోద‌ర్‌రెడ్డివి ఫెయిల్ పాలిటిక్స్‌. కానీ వ‌య‌సు రీత్యా పెద్దవాడు కావ‌డంతో కాంగ్రెస్ యూత్ లీడ‌ర్లు, క్యాడ‌ర్ ఆయ‌న వ‌ద్దకు కూడా వెళ్లరు. వీరంతా ఎమ్మెల్యేగా ఉన్న కొడుకు రాజేశ్‌రెడ్డికే జై కొడ‌తారు. కానీ ఎమ్మెల్యే మాత్రం తండ్రిని కాద‌ని అడుగు కూడా ముందుకు వేసే ప‌రిస్థితి లేద‌నే రాజ‌కీయ వాతావ‌ర‌ణం అక్కడ కొన‌సాగుతోంది. దీంతో యువ‌త‌లో తీవ్ర నైరాశ్యానికి ఇది ప్రధాన కార‌ణంగా చెబుతున్నారు.

Also Read: పాడిపై ఎథిక్స్ వేటు.. చర్య‌లు తీసుకోవ‌డ‌మే త‌రువాయి.. దుందుడుకు, వివాద‌స్ప‌ద నేతకు ఇదే స‌రైన చర్యా..?

డ్యుయ‌ల్ రోల్ అట్టర్ ఫ్లాప్‌..

Advertisement

ఆయ‌నే ఎమ్మెల్సీ, ఆయ‌నే ఎమ్మెల్యే ..ఈ రెండు పాత్రల‌ను దామోద‌ర్‌రెడ్డి విజ‌యవంతంగా పోషిస్తున్నారనే ప్రచారం నాగ‌ర్ క‌ర్నూల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉంది. సోష‌ల్ మీడియాలో పార్టీ కార్యక్రమాల‌ను విస్తృతంగా ప్రచారం చేసేది యువ‌తే. కానీ త‌మ‌ను వీరిద్దరూ ప‌ట్టించుకోవడం లేద‌నే అసహ‌నం, అసంతృప్తి రోజు రోజుకు పెరిగిపోవ‌డంతో అభివృద్ది, పార్టీ కార్యక్రమాల ప్రచారంపై ఎవ‌రికీ ప‌ట్టింపు లేకుండా పోయింది. ఇది ప్రతిపక్షాలకు మంచి అస్త్రంగా మారుతోంది. దీంతో డ్యుయ‌ల్ రోల్ వ్య‌వ‌హారం ఇక్క‌డ బెడిసి కొడుతుంద‌నే వాద‌న బ‌ల‌ప‌డుతోంద‌ని చెబుతున్నారు. ఇక‌నైనా పార్టీ క్యాడ‌ర్‌ను ప‌ట్టించుకోవాల‌ని, యువ‌త‌ను ప‌ట్టించుకోవాల‌ని కోరుతున్నారు కాంగ్రెస్ అభిమానులు.

– Written by Dandugula Srinivas, BIG TV

Tags

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

టెన్త్ సర్టిఫికెట్ లేకున్నా జూనియర్ లెక్చరర్.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి సంచలనాలు!

కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×