E-Paper
Advertisement

అమెజాన్ ప్రైమ్ ఉచితంగా కావాలా? జియో, వీఐలో బెస్ట్ ప్లాన్లు ఇవే.. బెనిఫిట్స్ కూడా ఎక్కువే!

అమెజాన్ ప్రైమ్ ఉచితంగా కావాలా? జియో, వీఐలో బెస్ట్ ప్లాన్లు ఇవే.. బెనిఫిట్స్ కూడా ఎక్కువే!
Advertisement

Amazon Prime Lite Plan: ప్రముఖ టెలికాం దిగ్గజాలైన రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా (Vi) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను తీసుకొస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు 84 రోజుల వ్యాలిడిటీతో పాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ లైట్ (Amazon Prime Lite) ప్రయోజనాన్ని అందించే ప్లాన్లను అందుబాటులోకి తెచ్చాయి. సాధారణంగా అమెజాన్ ప్రైమ్ లైట్ వార్షిక సబ్‌స్క్రిప్షన్ ధర రూ. 799 వరకూ ఉండగా ఈ ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్ల ద్వారా యూజర్లు 84 రోజుల పాటు ఉచితంగా ప్రైమ్ లైట్ సేవలను పొందవచ్చు. మరి ఈ రెండింటిలో ఏ ప్లాన్ వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

జియో రూ. 1029 ప్లాన్

జియో తీసుకొచ్చిన రూ.1029 ప్లాన్.. 84 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. ఇందులో రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు యూజర్లకు లభించనున్నాయి. ఇక ఓటీటీ ప్రయోజనాల విషయానికొస్తే.. 84 రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, 50GB జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ ఫ్రీగా పొందొచ్చు. వీటితో పాటు రూ. 35,100 విలువైన 18 నెలల గూగుల్ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్ కూడా ఈ ప్లాన్ ద్వారా లభిస్తుంది. అర్హత గల యూజర్లకు అపరిమిత 5G డేటా కూడా ఈ ప్లాన్‌లో పొందొచ్చు.

వీఐ రూ. 996 ప్లాన్

Advertisement

మరోవైపు వొడాఫోన్ ఐడియా తీసుకొచ్చిన రూ. 996 ప్లాన్‌ లోనూ అమెజాన్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ లభిస్తోంది. ఈ ప్లాన్ కూడా 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSల సదుపాయాన్ని అందిస్తోంది. తక్కువ ధరలో 84 రోజుల వ్యాలిడిటీతో అమెజాన్ ప్రైమ్ కోరుకునేవారికి.. ఈ ప్లాన్ అనుకూలంగా ఉండనుంది.

Also Read: సాధారణ ప్రయాణికురాలిగా ఆదా శర్మ ట్రైన్ జర్నీ.. జనాలు షాక్!

ఏ ప్లాన్ ఎంచుకుంటే బెటర్

Advertisement

రెండు ప్లాన్ల విషయానికి వస్తే.. ధర పరంగా వీఐ రీఛార్జ్ కాస్త తక్కువకే లభించనుంది. అలాగనీ రెండింటి మధ్య ధర వ్యత్యాసం కూడా చాలా తక్కువ. ఒకవేళ మీరు 5G నెట్‌వర్క్ ఉపయోగిస్తూ, ఫ్రీగా క్లౌడ్ స్టోరేజ్, హాట్‌స్టార్, ఏఐ సేవలను కోరుకుంటే జియో ప్లాన్ బెస్ట్ ఆప్షన్ గా నిలవనుంది. కేవలం ప్రైమ్ లైట్ ప్రయోజనంతో పాటు తక్కువ బడ్జెట్‌లో రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే వీఐ ప్లాన్ సరిపోతుంది.

Also Read: తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి.. రూ.10 లక్షల విరాళం అందించిన హర్యానా దాత!

Tags

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×