E-Paper
Advertisement

మేమే వ‌స్తామంటే మేమే వ‌స్తాం..! వెయ్యి రోజుల పాల‌న‌పై బీఆరెస్ పోరాటం.. మేమే మ‌రో ప‌దేళ్లంటున్న స‌ర్కార్‌..

మేమే వ‌స్తామంటే మేమే వ‌స్తాం..!  వెయ్యి రోజుల పాల‌న‌పై బీఆరెస్ పోరాటం.. మేమే మ‌రో ప‌దేళ్లంటున్న స‌ర్కార్‌..
Advertisement

తెలంగాణ‌లో అప్పుడే ఎన్నిక‌లు వ‌చ్చేశాయా? అనే రేంజ్‌లో పాలిటిక్స్ న‌డుస్తున్నాయి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం మ‌రోసారి అధికారం కోసం ఎదురు చూస్తుంటే.. ఇప్పుడున్న అధికార పార్టీ మ‌రో రెండు ట‌ర్ములు మేమే ఉంటామ‌ని ప్ర‌క‌టించుకుంటున్న‌ది. ఇక బీజేపీ కూడా ఎవ‌రి పొత్తు లేకుండానే ఒంట‌రిగా పోటీ చేసి ఈసారి అధికారం చేజిక్కించుకుంటామ‌ని స‌వాల్ విసురుతోంది.

కొత్త పార్టీ టీఆరెస్ చీఫ్ క‌విత‌ కూడా తామే అధికారంలోకి వ‌స్తున్నామ‌ని చెప్పుకుంటున్నారు. కానీ క‌విత చెప్పే విధానంలో కొంత ఇంట్ర‌స్టింగు పాయింట్ ఉన్న‌ది. ఆమె త‌న పార్టీని గెలిపించండ‌ని కోరే ముందే.. బీఆరెస్‌ను మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లో గెలిపించొద్ద‌ని పిలుపునివ్వ‌డం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

కాంగ్రెస్ ఎట్లాగూ ఓడుతుంద‌ని జోస్యం చెబుతూనే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న బీఆరెస్ మ‌ళ్లీ మేమే అధికారంలోకి వ‌స్తామ‌ని ఆశ‌ల ప‌ల్ల‌కిలో ఊరేగుతున్న‌ద‌ని, వ్య‌వ‌స్థీకృత అవినీతికి పాల్ప‌డిన బీఆరెస్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రానీయొద్ద‌ని ఆమె ప్ర‌జ‌ల‌కు పిలుపునిస్తున్నారు. నిజాయితీ, నిబ‌ద్ద‌త‌తో కొత్త‌గా పార్టీ పెట్టిన త‌మ‌ను ఆశీర్వ‌దించాల‌ని కోరుతున్నారు.

ఇప్పుడీ ముచ్చ‌ట ఎందుకొచ్చిదంటే.. స‌ర్కార్ పాల‌న‌కు వెయ్యి రోజులు పూర్త‌యిన నేప‌థ్యంలో నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌కు పిలుపునిస్తోంది బీఆరెస్ పార్టీ. స‌ర్కార్ ఇచ్చిన హామీలను అమ‌లు చేయ‌డం లేదెందుకు? అని వారం రోజుల పాటు వివిధ రూపాల్లో నిర‌స‌న‌లు తెలిపేందుకు సిద్ద‌మ‌వుతోంది. ఓ ర‌కంగా స‌ర్కార్‌పై ఒత్తిడి పెంచేందుకు సిద్ద‌మైంది.

Advertisement

మ‌రో వైపు బీఆరెస్ వ్యూహాల‌ను బ‌లంగా తిప్పికొట్టేందుకు స‌ర్కార్ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను మ‌రింత విస్తృతం చేసే ప‌నిలో ప‌డింది. మంత్రుల జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల వేగం పెంచింది. అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల స‌ర‌ళిని పెంచుతోంది. ఆ వేదిక‌ల మీద బీఆరెఎస్‌పై మ‌రింత దూకుడుగా విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే.. మ‌రో ప‌దేళ్లు మేమే అధికారంలో ఉంటామనే మెసేజ్‌ను పంపుతున్నారు మంత్రులు.

ప్ర‌జ‌ల‌ను కూడా దీనికి క‌నెక్ట‌య్యేలా మంత్రుల స్పీచులుంటున్నాయి. తెలంగాణ మేమే ఇచ్చాము.. తెలంగాణ జ‌నం సోనియ‌మ్మ‌కు రుణ‌ప‌డి ఉంటారు.. అందుకే క‌నీసం రెండు ట‌ర్ములైనా అధికారంలో ఉంచుతారు.. ఇందులో డౌట్‌లేదు.. అని అంటూనే.. జ‌నం దీనికి ఎప్పుడో ఫిక్స్ అయిపోయార‌ని ప్ర‌జ‌ల త‌ర‌పున నేత‌లే వ‌కాల్తా పుచ్చుకుంటున్నారు.

అయితే బీజేపీ కూడా త‌న దూకుడును పెంచుతోంది. ఫీజు రియంబ‌ర్స్‌మెంట్‌, 22ఏ పై ఆందోళ‌న‌లను పెంచుతోంది. అర్వింద్ తదిత‌ర నేత‌లైతే .. ఈసారి ఏమ‌న్నా చేస్తాం.. అధికారంలోకి వ‌చ్చి తీరుతామ‌నే వ్యూహాత్మ‌క ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ వ‌స్తున్నారు. ఇది కూడా మైండ్ గేమ్‌లో భాగ‌మేన‌ని తెలుస్తోంది.

ఓ వైపు స‌ర్ దెబ్బ‌తో ఓట్ల‌న్నీ గ‌ల్లంతువుతున్న త‌రుణంలో.. ఇది త‌మను విజ‌యానికి చేరువ చేసే ప‌రిణామ‌నే విధంగా దీన్ని అంత‌ర్గతంగా ప్ర‌చారం చేసుకుంటున్న‌ది బీజేపీ. క‌విత త‌న కొత్త పార్టీ ద్వారా జ‌నాన్ని ఆక‌ట్టుకునేందుకు పాంచ‌జ‌న్యం పేరుతో దూసుకుపోతుండ‌గా.. తాజాగా  ప్ర‌తీ పేద కుంటుంబానికి ఎక‌రం భూమి ఇస్తామ‌నే భూ ల‌క్ష్మీ ప‌థ‌కాన్ని జోడించి .. కొత్త పార్టీని జ‌నం నోళ్ల‌లో నానేలా చేస్తున్న వ్యూహం చ‌ర్చ‌కు వ‌స్తోంది.

ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేండ్ల పైబ‌డే ఉన్నా ఇప్పుడు అధికారం కోసం పోటీలు ప‌డుతున్నఈ నాలుగు పార్టీల‌కు మాత్రం త్వ‌ర‌లో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు ట్ర‌య‌ల్ ర‌న్‌గా మార‌నున్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

Tags

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

టెన్త్ సర్టిఫికెట్ లేకున్నా జూనియర్ లెక్చరర్.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి సంచలనాలు!

కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×