E-Paper
Advertisement

రేణిగుంటకు 164 ఏళ్లు.. ఇంత సుదీర్ఘ చరిత్ర ఉందా?

రేణిగుంటకు 164 ఏళ్లు.. ఇంత సుదీర్ఘ చరిత్ర ఉందా?
Advertisement

Renigunta Railway Junction: 164 ఏళ్ల కాలప్రవాహంలో ఎందరో కలలను, కన్నీళ్లను, ఆనందబాష్పాలను నిశ్శబ్దంగా వీక్షించిన మూగసాక్షి.. రేణిగుంట రైల్వే జంక్షన్. కాలం మారింది.. రైళ్ల రూపం మారింది.. రైల్వే మార్గాలు విస్తరించాయి.

బ్రిటిష్ పాలనలో ఒక చిన్న రేకుల షెడ్డులో కేవలం 10మంది సిబ్బందితో మొదలైన చిన్న రైల్వే స్టేషన్‌.. ఇప్పుడు 5 ప్లాట్‌ఫామ్‌లతో, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ, ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు, సురక్షితమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలతో ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సేవలను అందిస్తోంది.

Advertisement

1862 ఆగస్టు 27న మొదలైన రైల్వే ప్రయాణం

సరిగ్గా 1862 ఆగస్టు 27న రేణిగుంటలో రైల్వే కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అనంతరం రెడ్డిపల్లి, కడప వైపు రైల్వే మార్గాలు విస్తరించడంతో రేణిగుంట ప్రాధాన్యత మరింత పెరిగింది. 1892లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇక్కడ స్టీమ్‌ లోకోమోటివ్‌ షెడ్‌ ఏర్పాటు చేశారు.

Advertisement

also read :లక్కీ డ్రాలో అదిరిపోయే ట్విస్ట్.. టోకెన్ తీసిన చిన్నోడికే ఇల్లు!

ఆవిరి ఇంజిన్ల కాలంలో రేణిగుంట రైల్వే కార్యకలాపాలకు ఇది మరింత ఊపునిచ్చింది. అలా.. చిన్న స్టేషన్‌ కాస్తా ఎన్నో జీవితాల ప్రయాణంలో విడదీయలేని జ్ఞాపకంగా మారింది.

తిరుమల భక్తులకు కీలకమైన రైల్వే మజిలీ

అంతేకాదు రేణిగుంట అంటే కేవలం రైళ్ల రాకపోకలు కాదు.. ఎంతోమంది జీవితాల కథల్లో ఓ మధురమైన మజిలీ. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు..ఇక్కడ రైలు దిగి తిరుమల బాట పడుతుంటారు.

also read :మంత్రి పదవిని కాపాడుకునేందుకే రాఖీ అస్త్రమా.. కాంగ్రెస్‌లో కొండా సురేఖ నయా స్ట్రాటజీ!

అదే సమయంలో.. పాలు, ఎరువులు, రేషన్‌ బియ్యం వంటి సరకు రవాణాలోనూ రేణిగుంట కీలక పాత్ర పోషిస్తోంది. ప్రయాణికుల ప్రయాణం నుంచి ప్రాంత ఆర్థిక కార్యకలాపాల వరకు రేణిగుంటతో ముడిపడిన అవసరాలెన్నో, అనుబంధాలెన్నో.

Tags

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

టెన్త్ సర్టిఫికెట్ లేకున్నా జూనియర్ లెక్చరర్.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి సంచలనాలు!

కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×