BigTV English
Advertisement

Balakrishna: బాలయ్యను మెచ్చుకున్న ఎస్వీఆర్ మనవళ్లు.. అక్కినేని కుర్రాళ్లే తొందరపడ్డారా?

Balakrishna: బాలయ్యను మెచ్చుకున్న ఎస్వీఆర్ మనవళ్లు.. అక్కినేని కుర్రాళ్లే తొందరపడ్డారా?

Balakrishna: నందమూరి బాలకృష్ణ. నోటి దురుసు ఎక్కువ. మైక్ పట్టుకుంటే.. నాలుకపై కంట్రోల్ ఉండదంటారు. ఫ్యాన్స్ ను చూస్తే చెలరేగిపోతారని చెబుతారు. అప్పుడప్పుడు నోటికొచ్చినంత మాట్లాడేస్తుంటారు. అదికాస్తా కాంట్రవర్సీగా మారడం.. కొన్నిరోజుల పాటు మీడియా పండగ చేసుకోవడం కామనే. ఇలా బాలయ్య చుట్టూ గతంలో అనేక వివాదాలు నడిచాయి. నడుస్తున్నాయి.


లేటెస్ట్ అక్కినేని ఎపిసోడ్ తో మరోసారి బాలయ్య చుట్టూ విమర్శలు చుట్టుముట్టాయి. ఎన్టీఆర్, ఎస్వీఆర్, అక్కినేని తొక్కినేని.. అంటూ ఓ ఫ్లోలో అనేశారు. కట్ చేస్తే, అక్కినేని తొక్కినేని కామెంట్ మీడియాలో వైరల్ అయింది. కాస్త లేటుగా అక్కినేని కుర్రాళ్లు నాగచైతన్య, అఖిల్ లు బాలకృష్ణకు స్వీట్ వార్నింగ్ ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది.

మరోవైపు, ఎస్వీఆర్ ను సైతం బాలయ్య కించపరిచారంటూ కాపు నాడు నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ క్షమాపణలు డిమాండ్ చేశారు. బాలకృష్ణ సారీ చెప్పేందుకు ఓ డెడ్ లైన్ కూడా పెట్టారు. ఇదేదో ముదిరేలా ఉందనుకున్నారో ఏమో.. ఎస్వీ రంగారావు మనవళ్లు రంగంలోకి దిగారు. నందమూరి బాలకృష్ణతో తమకు మంచి అనుబంధం ఉందని.. ఎస్వీఆర్‌ గురించి ఆయన మాట్లాడిన దాంట్లో వివాదం లేదంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి బాలకృష్ణ సాధారణ పోకడలో చెప్పారని.. మీడియాలో ఈ విషయాన్ని ఇంకా సాగిదీయవద్దంటూ విషయాన్ని అక్కడికి హీట్ ఆఫ్ చేశారు ఎస్వీఆర్ వారసులు.


అక్కినేని విషయంలో మాత్రం అలా జరగలేదు. విషయం మీడియాలో రచ్చ కావడంతో.. లేటెస్ట్ గా బాలయ్య సైతం స్పందించారు. తను మాట్లాడినదాంట్లో తప్పేమీ లేదనేలా కవర్ చేసుకున్నారు. ఏదో ఫ్లోలో అనేశా.. అందులో అవమానం ఏమీ లేదు.. రాద్దాంతం చేస్తే తనకేం సంబంధం లేదంటూ చెప్పేశారు. పైగా ఏఎన్నార్ తనకు బాబాయ్ లాంటి వాడని.. ఆయన పిల్లలకంటే తనపైనే ఎక్కువ ప్రేమ చూపించేవారంటూ రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చేశారు బాలయ్య బాబు.

బాలకృష్ణ రియాక్షన్ ను కొందరు తీవ్రంగా తప్పుబడుతుంటే.. మరికొందరు మాత్రం నిజమే కదా.. బాలయ్య మనసులో ఏమీ ఉండదు.. కాకపోతే నోటి దురుసు ఎక్కువ కదా అంటున్నారు. ఎస్వీఆర్ మనవళ్లు సైతం ఆయన సాధారణ పోకడలో అలా మాట్లాడారని అన్నారు. కాకపోతే తొక్కినేని అన్నందుకు అక్కినేని ఫ్యామిలీనే బాగా హర్ట్ అయినట్టుంది.

బాలకృష్ణకు, నాగార్జునకు మధ్య అంతమంచి సంబంధాలేవీ లేవనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే, బాలయ్య తమను కించపరిచారంటూ నాగచైతన్యతో కౌంటర్ ట్వీట్ చేయించి విషయాన్ని పెద్దది చేశారని కొందరు అంటున్నారు. ఎప్పటిలానే బాలయ్య వ్యాఖ్యలపై స్పందించకుండా వదిలేసుంటే.. మీడియాలో ఇంత రచ్చ అయి ఉండేది కాదంటున్నారు. అలా ఎలా వదిలేస్తారు.. నోటికొచ్చినట్టు బహిరంగంగా మాట్లాడితే ఊరుకుంటారా అంటూ అక్కినేని సపోర్టర్స్ వాదన. ఎవరి మాట ఎలా ఉన్నా.. ఇప్పటికి కూడా బాలయ్య తాను తప్పుగా ఏం మాట్లాడలేదని.. ఏఎన్నార్ తన బాబాయ్ లాంటి వారని.. సమర్థించుకోవడంతో.. అక్కినేని ఫ్యామిలీ ఇప్పుడెలా రియాక్ట్ అవుతుందో?

Related News

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Kalvakuntla Kavitha: జూబ్లీహిల్స్ బైపోల్‌.. బీఆర్ఎస్‌కు కవిత గండం

Kalvakuntla Kavitha: కవిత టార్గెట్.. కారు పార్టీ.. టచ్‌లో ఆ నేతలు?

Vijayanagaram TDP: టీడీపీ జిల్లా.. రథసారథి ఎవరో?

Big Stories

×