BigTV English

Nara Lokesh : నారా లోకేష్ పాదయాత్రకు రెడీ .. రూట్ మ్యాప్ ఇదే..

Nara Lokesh : నారా లోకేష్ పాదయాత్రకు రెడీ .. రూట్ మ్యాప్ ఇదే..

Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టే పాదయాత్రకు సర్వం సిద్ధమైంది. జనవరి 27 నుంచి 400 రోజులపాటు 4 వేల కిలోమీటర్లు నడిచేందుకు లోకేష్ సిద్ధమయ్యారు. యువత భవిత కోసమంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గెలుపు తీరాలకు చేర్చడమే లక్ష్యంగా 125కుపైగా నియోజకవర్గాల్లో నడవనున్నారు.


తొలిరోజు షెడ్యూల్..
జనవరి 27న ఉదయం కుప్పం నియోజకవర్గంలోని లక్ష్మీపురం వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి 11 గంటల 3 నిమిషాలకు లోకేష్ తొలి అడుగు వేస్తారు. అక్కడి నుంచి ఓల్డ్‌పేట్‌ వెళ్లతారు. అక్కడ మసీదులో ప్రార్థనలు చేసి ముస్లిం నేతలతో సమావేశమవుతారు. కుప్పం బస్టాండ్‌, పార్టీ కార్యాలయం, ట్రాఫిక్‌ ఐల్యాండ్‌ జంక్షన్‌, కుప్పం ప్రభుత్వాసుపత్రి క్రాస్‌, శెట్టిపల్లి క్రాస్‌ల మీదుగా పీఈఎస్‌ కళాశాల వరకు తొలిరోజు పాదయాత్ర సాగుతుంది.

కుప్పంలో భారీ బహిరంగ సభ..
సాయంత్రం కుప్పంలో నిర్వహించే బహిరంగ సభలో లోకేష్ పాల్గొంటారు. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు. దాదాపు 50 వేల మంది సభకు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా 400 మంది పార్టీ సీనియర్‌ నేతలు బహిరంగ సభ వేదికపై కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.


ప్రతి నియోజకవర్గంలో 3 రోజులు..
జనవరి 28న పీఈఎస్‌ కళాశాల నుంచి శాంతిపురంలోని అరిముతనపల్లి వరకు లోకేష్ పాదయాత్ర సాగనుంది. ఈ నెల 29న శాంతిపురం మండలంలోని అరిముతనపల్లి నుంచి చెల్డిగానిపల్లె వరకు జరుగుతుంది. కుప్పంలో 29 కిలోమీటర్ల మేర 3 రోజులపాటు లోకేశ్‌ పాదయాత్ర సాగుతుంది. తర్వాత పలమనేరు నియోజకవర్గలోకి ఎంటర్ అవుతారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నెల రోజులపాటు యువగళం యాత్ర సాగుతుంది. కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు ప్రతి నియోజకవర్గంలో 3 రోజులపాటు పాదయాత్ర ఉండేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఏడాదికిపైగా ఈ పాదయాత్ర సాగనుంది.

యాత్ర లక్ష్యమిదే..
నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధాన అజెండాగా సాగే పాదయాత్రలో మహిళలు, రైతులు, వివిధ వర్గాల వారి సమస్యలను చర్చించి ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో యువత ప్రస్తావించిన సమస్యలపై తెలుగుదేశం అధ్యయనం చేసింది. రాష్ట్రంలో 1.50 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని అంచనా వేసింది. రాష్ట్రంలో యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువగళం వినిపించాలని లోకేష్ నిర్ణయించారు. 96862 96862 కి మిస్డ్ కాల్ ఇచ్చి యువగళంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేసుకున్నారు.

అనుమతులపై ఉత్కంఠ..
లోకేష్ 400 రోజుల పాదయాత్ర అనుమతులపై డీజీపీ కార్యాలయం ఇప్పటి వరకు స్పందించలేదు. జిల్లా యంత్రాంగం మాత్రం తొలి 3 రోజులకు అనుమతులు ఇచ్చి మొత్తం 29 షరతులు విధించింది. లోకేష్ పాదయాత్రను అడ్డుకునే కుట్రను ఉపేక్షించేది లేదని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×