BigTV English

KCR Re-Entry in BRS: కేటీఆర్ జ‌ర సైడైపో! సారు.. కారు.. వ‌స్తున్నార‌ట‌!

KCR Re-Entry in BRS: కేటీఆర్ జ‌ర సైడైపో! సారు.. కారు.. వ‌స్తున్నార‌ట‌!

సీఎం కుర్చీలో నుంచి దిగిపోయాక ఫామ్ హౌస్ కే పరిమితం

పదేండ్ల పాలన తర్వాత ప్రజా తీర్పుతో ఖంగుతిన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సీఎం కుర్చీలో నుంచి దిగిపోయాక.. పెద్దగా జనంలోకి రాకుండా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. తుంటి ఎముక శస్త్ర చికిత్స తరువాత ఆయన ఫాం హౌస్ లో పూర్తి స్థాయి విశ్రాంతి తీసుకున్నారు. కృష్ణ జలాల వాటా పై ఆయన స్టిక్ సహాయంతో నల్లగొండ బహిరంగ సభకు హజరు అయ్యారు. తరువాత ఎండిన పంట పొలాలు పరిశీలించేందుకు రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర చేపట్టారు. తరువాత కూడా ఫాం హౌస్ కే పరిమితయ్యారు. అక్కడే కార్యకర్తలను కలుస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యక్ష రాజకీయాలకు కేసీఆర్ ఇక బై బై చెప్పనున్నారని జోరుగా చర్చ నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ఒక్కసారి అలా వచ్చి..ఇలా వెళ్లిన కేసీఆర్.. మళ్లీ హాజరయ్యేందుకు ఆసక్తి చూపకపోవడం ఈ వాదనలు మరింత బలపరిచాయి.


శస్త్రచికిత్స తరువాత ఫాం హౌస్ లోనే కేసీఆర్ విశ్రాంతి

ప్రతిపక్ష పాత్ర 100 శాతం నెరవేరుస్తామని చెప్పిన కేసీఆర్ ఆ దిశగా అడుగులు మాత్రం వెయ్యక పోవడం విమర్శలకు మరింత బలాన్ని ఇచ్చాయి. ఆరోగ్య రీత్యా కొన్ని రోజులు ఫాం హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారని.. పార్టీ శ్రేణులు భావించారట. తుంటి ఎముక శస్త్ర చికిత్స నుంచి పూర్తిగా కోలుకున్న తరువాత కూడా ఆయన మాత్రం ఫాం హౌస్ ను నుంచి బయటకు రాకపోవడంతో సొంత నేతలు కూడా ఇన్నాళ్లు మీమాంసలో ఉన్నారట. పాలిటిక్స్‌కి దూరంగా ఉంటూ వస్తున్న కేసీఆర్ కొన్ని నెలల తర్వాత మళ్లీ వార్తల్లోకి వచ్చారు. శనివారం ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌లో పాలకుర్తి నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమై.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆయన.. ఆ తర్వాత కారు నడుపుతూ గులాబీ కార్యకర్తల్లో జోష్ కనిపించారు.

కారు నడుపుతూ గులాబీ కార్యకర్తల్లో జోష్ నింపే యత్నం

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకొని మరీ.. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోని పంట పొలాలను పరిశీలించారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయ్. ఇదంతా చూస్తుంటే.. కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న కేసీఆర్.. ఇప్పుడు నెమ్మదిగా కార్యకర్తలతో మీటింగులు, కారు డ్రైవింగ్‌లు చూస్తుంటే.. మళ్లీ జనంలోకి రాబోతున్నాననే సంకేతాలు ఇస్తున్నట్లు.. యాక్టివ్ అవుతున్నట్లు కనిపిస్తోంది. కార్యకర్తలతో భేటీ తర్వాత వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వంద శాతం మళ్లీ బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి డైలాగులతో.. పార్టీ నుంచి క్యాడర్ జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మళ్లీ జనంలోకి రాబోతున్నాననే సంకేతాలు కేసీఆర్ ఇస్తున్నారా ?

అయితే అనూహ్యంగా కేసీఆర్ ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవ్వడం వెనుక రీజన్ ఏంటని సర్వత్రా చర్చనీయాంశంగా మారిందట. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలన్నీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే చూస్తున్నారు. కేటీఆర్ వ్యవహార శైలి సీనియర్ నాయకుల్లో అసంతృప్తి కలిగిస్తుందట. వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీలో అన్ని తానై వ్యవహరిస్తున్న కేటీఆర్ కొందరిని మాత్రమే కలుపేసుకుంటూ పోతున్నారనే విమర్శను ఎదుర్కొంటున్నారట. ఈ తరహా శైలితో పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని పార్టీలో సీనియర్ లీడర్లు వాపోతున్నారట. ముఖ్యంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వైఖరితో పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని చర్చించుకుంటున్నారట. వారిని కేటీఆర్ ప్రోత్సహిస్తున్నారని కారు పార్టీ నేతల్లో జోరుగా గుసగుసలు నడుస్తున్నాయట.

Also Read:  ఢిల్లీలో కేటీఆర్, రాత్రి వేళ చర్చలు సక్సెస్.. రేస్ నుంచి ఉపశమనం?

కేటీఆర్ శైలితో సీనియర్ నాయకుల్లో అసంతృప్తి

కొన్నాళ్లుగా.. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్.. రీసెంట్ ఇష్యూ లతో తండ్రి కేసీఆర్‌కు తలనొప్పిగా మారారట. జన్వాడ ఫామ్‌ హౌజ్‌లో కేటీఆర్ బావమరిది పాకాల రాజు పార్టీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవ్వడం.. కేటీఆర్‌పై వస్తున్న డ్రగ్స్ ఆరోపణలకు.. మరింత బలం చేకూరుస్తోందని అనుకుంటున్నారట. ఇప్పటికే.. బీఆర్ఎస్ హయాంలో డ్రగ్స్ కేసును తొక్కిపెట్టారనే విమర్శలున్నాయట. ఇప్పుడు.. ఈ ఫామ్ హౌజ్‌లో పార్టీతో.. కేసీఆర్ అండ్ ఫ్యామిలీ తలెత్తుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి.. కేటీఆర్ బదులు ఆయన డైరెక్ట్ గా మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట.

హరీష్ రావుకు పగ్గాలు ఇవ్వాలని పలువురు నేతల డిమాండ్

అలానే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సున్నాకే పరిమితమవ్వడం.. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడడం కేటీఆర్ వైఫల్యాలను బయటపడుతుందని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తుందట. గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ కార్యక్రమం నిర్వహిస్తే.. ఒకరు ఇద్దరు తప్పా , మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరు పెద్దగా పాల్గొనడం లేదని.. కేటీఆర్ అన్నింటా ఫెయిల్ అవుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయట. పార్టీలో డబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు అటు అసెంబ్లీలో ఇటు బయట అధికార పక్షాన్ని డిఫెన్స్ చేస్తున్నప్పటికీ.. పార్టీ పగ్గాలు మాత్రం హరీష్ రావుకు ఇవ్వడం లేదట కేసీఆర్. సీనియర్ నేతలు అందరూ హరీష్ రావుకు పగ్గాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ.. కేసీఆర్ మాత్రం ఆదిశగా అడుగులు వేయడం లేదని అనుకుంటున్నారట.

కేసీఆర్ ప్రజల్లోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని చర్చ

ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతగా కేసీఆరే పూర్తిగా పార్టీ భాద్యతలు తీసుకోవాలని భావిస్తున్నారట. అందుకే ఆయన యాక్టివ్ గా ఉన్నానని సంకేతాలు ఇచ్చేందుకే స్వయంగా కారు నడుపుతూ ముందు సీట్లో యువనేత కార్తీక్ రెడ్డిని కూర్చోబెట్టుకొని ఫాం హౌస్ లో తిరిగారని భావిస్తున్నారట. పూర్తిగా కోలుకున్న కేసీఆర్ తన సొంత కారు కంటే ముందు పార్టీ స్టీరింగ్ కారు ఎప్పుడు పట్టుకుంటారు అని పార్టీలో రాజకీయ విశ్లేషకులో జోరుగా చర్చ జరుగుతుందట. పార్టీ కారు స్టీరింగ్ కేసీఆర్ చేతిలోనే ఉండేలా.. రానున్న రోజుల్లో ప్రజల్లోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని కూడా టాక్ నడుస్తోందట. మరో పదేళ్ల పాటు కేసీఆర్ చేతుల్లోనే కారు స్టీరింగ్ ఉంటుందని కూడా పార్టీలోని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారట.

కేటీఆర్ వైఫల్యంతోనే మళ్లీ ఎంట్రీ ఇస్తున్నారా?

ఇక కొద్ది రోజుల్లోనే కేసీఆర్ జిల్లాల టూర్ కూడా చేపట్టే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తోందట. మరి ఈ వ్యవహారమంతా అటెన్షన్ గ్రాబ్ చేసేందుకు కేసీఆర్ ప్రయత్నాలా ? లేక కేటీఆర్ ని వైఫల్యంతోనే బాధ్యతలను మోసేందుకు సిద్ధం అయ్యారా ? అని చర్చ జరుగుతోంది. ప్రజా పాలనే ధ్యేయంగా సాగుతున్న కాంగ్రెస్ సర్కారుని కేసీఆర్ ఎలా డీల్ చేస్తారని కూడా చర్చ జరుగుతోంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×