BigTV English

Jagan: జగన్ ప్లాన్ రివర్స్.. కూటమి ఎత్తుగడ, వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు?

Jagan: జగన్ ప్లాన్ రివర్స్.. కూటమి ఎత్తుగడ, వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు?

Jagan: రాజకీయాల్లో రాణించాలంటే కాసింత అనుభవం ఉండాలి. లేదంటే పార్టీని నమ్ముకున్నవారంతా నట్టేట మునిగినట్టే. ఎత్తులు పైఎత్తులు వేస్తేనే సక్సెస్ అవుతాము. ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటే మొదటికే ముప్పు వస్తుంది. అందుకు ఉదాహరణ మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలే. లేటెస్ట్‌గా ఆ పార్టీలో సంక్షోభం మొదలైనట్టు కనిపిస్తోంది.


అసెంబ్లీ సమావేశాలకు రామని తేల్చి చెప్పేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని లేకుంటే రామని తేల్చేశారు. ఈ వ్యవహారంపై సోమవారం బీఏసీ సమావేశం జరిగింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన సమావేశానికి సీఎం చంద్రబాబు, బీజేపీ నుంచి విష్ణుకుమార్, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు.

ఈనెల 22 వరకు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. ఉదయం, మధ్యాహ్నం కూడా సమావేశాలు జరగనున్నాయి. హోదా ఇచ్చేవరకు తాము రామని మాజీ సీఎం జగన్ చెప్పడంపై బీఏసీలో చర్చకు వచ్చింది.


తొలుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు రియాక్ట్ అయినట్టు సమాచారం. అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలను ఆగవని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలో నేతలంతా ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ALSO READ:  వర్రా రవీంద్రరెడ్డి అరెస్ట్.. అసలు సూత్రధారి సజ్జల భార్గవ్.. సంచలన విషయాలు వెల్లడించిన డీఐజీ

అసెంబ్లీకి రానివారి సభ్యత్వాలను రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో గవర్నర్‌కు కూటమి సర్కార్ లేఖ రాసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నిర్ణయాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా ఉండాలని లేఖలో వివరించినట్టు సమాచారం.

సభకు రాని వాని సభ్యత్వాలను రద్దు చేసే అధికారం కేవలం గవర్నర్‌కు మాత్రమే ఉంది. దీంతో గవర్నర్ నిర్ణయం ఎలా ఉంటుందోనన్న చర్చ ఏపీ అంతటా మొదలైపోయింది. సభ్యత్వాలను రద్దు చేసే అధికారం గవర్నర్‌కు ఉందా అనేది అసలు పాయింట్.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 నుంచి 165 వరకు అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి గవర్నర్ విధులను స్పష్టం చేస్తుంది. సభ్యత్వాలను రద్దు చేసే అధికారం రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించలేదని అంటున్నారు.

గతంలో ఇలాంటి వాటిపై గవర్నర్లు ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా అంటూ చర్చించుకోవడం వైసీపీ నేతల వంతైంది. అదే జరిగితే ఫ్యాన్ పార్టీలో మరో సంక్షోభం తప్పదని అంటున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. సభ్యత్వం రద్దయితే మొదటికే ముప్పు వస్తుందని అంటున్నారు.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×