Satya Dev : ముందుగా కొన్ని సినిమాల్లో కనిపించి మంచి గుర్తింపు సాధించుకున్నాడు సత్యదేవ్. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది వంటి సినిమాల్లో కూడా సత్యదేవ్ కొన్ని కీలకపాత్రలో కనిపించాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ముకుంద సినిమాలో కూడా ఒక పాత్రలో కనిపించాడు సత్యదేవ్. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన జ్యోతిలక్ష్మి సినిమా లో లీడ్ రోల్ లో కనిపించి మంచి గుర్తింపు సాధించుకున్నాడు. ఆ తర్వాత బ్రోచేవారెవరురా వంటి సినిమాలు కూడా సత్యదేవ్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. సత్యదేవ్ కు ఉన్న టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా పెద్ద కమర్షియల్ సక్సెస్ సాధించి పోయిన కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమాలు ఉన్నాయి. అందులో బ్లఫ్ మాస్టర్ (Bluff Master) సినిమా మంచి పేరుని తీసుకొచ్చింది.
ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు కొన్ని కీలకమైన పాత్రలలో కనిపిస్తున్నాడు సత్యదేవ్. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన గాడ్ ఫాదర్ (God Father) సినిమాలో విలన్ పాత్రలో కనిపించాడు. ఈ సినిమా సత్యదేవ్ కి విపరీతమైన పేరును తీసుకొచ్చింది. ఒక సందర్భంలో సత్యదేవ్ విలన్ గా పర్ఫెక్ట్ గా సరిపోతాడు అలాంటి ప్రయత్నాలు చేస్తే మంచిది అని చాలామంది ఊహించారు కూడా. ఇక సత్యదేవ్ కి ఉన్న వాయిస్ బెస్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పండి. సూర్య (Suriya) నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాకి కూడా తెలుగులో డబ్బింగ్ చెప్పాడు సత్య. రీసెంట్ గా సత్య చేసిన కృష్ణమ్మ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఇక ప్రస్తుతం సత్యదేవ్ జీబ్రా (Zebra) అనే సినిమాను చేశాడు. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది ఈ తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నాడు సత్యదేవ్.
Also Read : Pushpa 2 Advance Booking: అడ్వాన్స్ బుకింగ్స్ లో నీయవ్వ తగ్గేదేలే .. ఎన్ని కోట్లంటే?
ఈ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒక విషయాన్ని రివీల్ చేశాడు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ (RRR) సినిమాలో కూడా నటించాడట సత్యదేవ్. సత్యదేవ్ నటించిన దాదాపు 16 నిమిషాల ఫుటేజ్ సినిమాలో లేకుండా పోయిందట. అయితే సినిమాలో ఎక్కడో కూడా సత్యదేవ్ పోర్షన్ కరెక్ట్ గా సెట్ అవ్వట్లేదు అని దానిని తొలగించారు. అయితే ఈ విషయం ఇప్పటివరకు కూడా ఎక్కడ బయటకు రాలేదు. సత్యదేవ్ కూడా ఎవరికి చెప్పలేదు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను ఇప్పటివరకు బయటకు చెప్పలేదు మీకు ఎలా తెలిసింది అంటూ ఈ విషయాన్ని రీవీల్ చేశాడు. సత్యదేవ్ నటించిన సీన్స్ కేవలం 16 నిమిషాల వరకు పోయాయి అంటే, దీనిని బట్టి రాజమౌళి నాలుగు గంటల సినిమా తీసి ఉంటాడు అని చాలామంది చర్చలు జరుపుతున్నారు.