E-Paper
Advertisement

Grandhi Srinivas: ఆ పార్టీలోకి గ్రంథి శ్రీనివాస్!

Grandhi Srinivas: ఆ పార్టీలోకి  గ్రంథి శ్రీనివాస్!
Advertisement

Grandhi Srinivas:  పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్. ఆయన త్వరలో కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరబోతున్నారా? చేరితే ఆయన ఏ పార్టీలోకి అడుగుపెట్టనున్నారు? ఇప్పుడిదే చర్చ జోరుగా సాగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన నేత అసలు పార్టీ ఎందుకు మారాలనుకుంటున్నారు అనేది ఓ చర్చ అయితే.. అసలు ఈ ప్రచారం ఎందుకు ప్రారంభమైందనేది మరో చర్చ. అయితే దీనతంటికి కారణం కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.. ఆయన చేసిన కామెంట్స్‌. ఇంతకీ ఈ ప్రచారం ఏంటి? దీనిపై గ్రంధి రియాక్షన్ ఏంటి?

నేతన క్యాంపు కార్యక్రమంలో శ్రీనివాస వర్మ కీలక వ్యాఖ్యలు

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ప్రత్యేక నూతన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీలు బొర్రా గోపి మూర్తి, పాందువ్వ శ్రీనివాసరాజు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా హాజరవ్వడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అంతేకాదు ఆ ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీనివాస వర్మ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చిన్నప్పటి నుంచి తనకు స్నేహితుడని, అందుకే క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించడం జరిగిందన్నారు. గ్రంధి శ్రీనివాస్ ప్రస్తుతం కూటమి సభ్యుడు కాకపోయినా అని రెండుసార్లు నవ్వుతూ స్ట్రెస్ చేసి చెప్పారు. దీంతో మరోసారి గ్రంధి రాజకీయ పయనంపై కూటమి సీనియర్ నాయకుల్లో చర్చ మొదలైంది. కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ఎమ్మెల్యేల ముందే ఈ వ్యాఖ్యలు చేయడంపై గ్రంధి శ్రీనివాస్ త్వరలోనే కూటమి పార్టీలలో చేరబోతున్నారని స్పష్టమైందని చెప్తున్నారు. అయితే గ్రంధి శ్రీనివాస్ బీజేపీలో చేరతారా, తెలుగుదేశంలో చేరతారా, జనసేనలో చేరతారా అనేది మాత్రం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

గ్రంధి శ్రీనివాస్ ఓటమిపై స్పందించని వైసీపీ అధినేత

Advertisement

రాజకీయంగా గ్రంధి శ్రీనివాస్ ఫైర్ బ్రాండ్ అని అందరికీ తెలిసిందే. ఇప్పటికే భీమవరం నియోజకవర్గంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో గ్రంధి పరాజయం చెందారు. తన ఓటమికి పార్టీలోనే కొంతమంది కారణమయ్యారని ఆనాడే జగన్‌కు తెలియజేసినా కూడా ఆయన స్పందించకపోవడం, మరోపక్క నర్సాపురం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద రాజు వైఖరిపై విసుగు చెందిన గ్రంధి శ్రీనివాస్ గత ఏడాది డిసెంబర్‌లో వైసీపీ రాజీనామా చేశారు. అయితే రాజీనామా అనంతరం వైసీపీకి చెందిన కొంతమంది పెద్దలు తిరిగి గ్రంధి శ్రీనివాస్‌తో మాట్లాడారు. పార్టీలోకి రావాలని కోరారు. అయినప్పటికీ గ్రంధి వైసీపీలో తనకు జరిగిన అన్యాయంపై ఎప్పటికప్పుడు వారికి చెబుతూ వైసీపీకి దూరంగా ఉన్నారు.

గ్రంధి శ్రీనివాస్ త్వరలోనే కూటమిలో చేరబోతున్నట్లు సంకేతాలు

మరోపక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీలో గ్రంధి శ్రీనివాస్ చేరే అవకాశం ఉందని రాజకీయంగా చర్చ జరుగుతున్నప్పటికీ.. ఇప్పటివరకు ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో గ్రంధి శ్రీనివాస్‌ను తమ పార్టీల్లోకి రావాలని ఇప్పటికే కూటమి పార్టీలోని కొంతమంది పెద్దలు ఆయనకు నేరుగా ఆహ్వానం పలుకుతున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ అందరి ముందు పబ్లిక్‌గా చేసిన హాట్ కామెంట్స్ తర్వాత… త్వరలోనే కూటమిలో చేరబోతున్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నట్లు సీనియర్ రాజకీయ నాయకులు చెప్తున్నారు.

గ్రంధి శ్రీనివాస్ ‌తో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ భేటీ

Advertisement

నిజానికి గ్రంధి బీజేపీలో చేరతారనే ప్రచారం చాలా నెలలుగా కొనసాగుతోంది. ఆగస్టులో గ్రంధి శ్రీనివాస్ నివాసానికి వెళ్లి కలిశారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. బీజేపీలో కీలకంగా ఉన్న కేంద్రమంత్రి వర్మ గ్రంధి ఇంటికి వెళ్లి భేటీ అవడం, రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించడం అప్పట్లో హాట్‌ టాపిక్. కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉండటంతో పరామర్శించేందుకు కేంద్రమంత్రి వర్మ వెళ్లారని ఆయన అనుచరులు తెలిపారు. కాపు సామాజిక వర్గానికి చెందిన గ్రంధి శ్రీనివాస్‌ను పార్టీలోకి తీసుకుంటే నరసాపురం నియోజకవర్గంలో బీజేపీ మరింతగా బలపడుతుందన్న ఆలోచనలో ఉన్నారట. గోదావరి జిల్లాల్లో కాపుల ఓటు బ్యాంకు ఎక్కువ. గ్రంధి శ్రీనివాస్ కాపు లీడర్. మంచి పేరున్న నేత. ఆయన అనుభవం, పరిచయాలు తోడైతే నరసాపురం పార్లమెంట్, భీమవరం అసెంబ్లీ పరిధిలోనే కాదు..గోదావరి జిల్లాల్లో కమల వికాసం ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట కమలనాథులు. మళ్లీ ఇప్పుడు శ్రీనివాస వర్మ అదే స్టైల్‌లో మాట్లాడటంతో మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి.

2029 ఎన్నికల్లో పులపర్తికి ఎమ్మెల్యే గా పోటీ చేసే అవకాశం ఉందా..

ప్రస్తుతం భీమవరం జనసేన ఎమ్మెల్యేగా పనిచేస్తున్న పులపర్తి రామాంజనేయులు 2029 ఎన్నికల్లో వయసు రీత్యా మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు దాదాపుగా లేవని చెప్పాలి. మరోపక్క చూస్తే భీమవరం నియోజవర్గం టీడీపీకి ఒకరకంగా కంచుకోట. ఈ పరిస్థితుల్లో 2029 ఎన్నికల్లో ఈ భీమవరం సీటు కూటమిలో భాగంగా ఏ పార్టీకి దక్కుతుంది అనే దానిపై కూడా గ్రంధి శ్రీనివాస్ ఆలోచన చేయాల్సి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే సామాజిక వర్గంగా, ఆర్థికంగా పశ్చిమగోదావరి జిల్లాలోనే టాప్ మోస్ట్ లీడర్ అయిన గ్రంధి శ్రీనివాస్ తిరిగి ఏ పార్టీలో చేరినా కచ్చితంగా ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటారని వేరే చెప్పనక్కరలేదు. అంతేకాకుండా గ్రంధి శ్రీనివాస్ ఏ పార్టీలోకి చేరితే ఆ పార్టీకి రాజకీయంగా ఉభయగోదావరి జిల్లాల్లో మేలు జరిగే పరిస్థితి ఉందని తెలిసిందే. ఈ పరిస్థితుల్లో గ్రంధి శ్రీనివాస్ రాజకీయంగా మరోసారి తీసుకోబోయే స్టెప్ ఆచితూచి వేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరి గ్రంధి ఏ గూటికి చేరుతారు అనేది అఫిషీయల్‌గా చెప్తే తెలిసే పరిస్థితి లేదు. కాకపోతే రాబోయే ఎన్నికల రేసులో ఉండాలంటే ఇప్పడే ఏదో ఒక పార్టీలో చేరి యాక్టీవ్‌గా పనిచేయాల్సినపరిస్థితి అయితే ఉంది.

 Story by Vamshi, Big Tv 

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×