E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Day 88 : ఫస్ట్ ఫైనలిస్ట్ రేసు నుంచి సుమన్ శెట్టి అవుట్… రీతూ వర్సెస్ భరణి… లాస్ట్ మినిట్లో తనూజ ట్విస్ట్

Bigg Boss 9 Telugu Day 88 : ఫస్ట్ ఫైనలిస్ట్ రేసు నుంచి సుమన్ శెట్టి అవుట్… రీతూ వర్సెస్ భరణి… లాస్ట్ మినిట్లో తనూజ ట్విస్ట్
Advertisement

Bigg Boss 9 Telugu Day 88 : ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడానికి నిన్న పెట్టిన పోటీలో భరణి విన్ అయిన విషయం తెలిసిందే. పవన్ భరణితో శపథం చేసి మరీ ఓటమి పాలై, ఈ రేసు నుంచి తప్పుకున్నాడు. దీంతో ఈరోజు భరణి ఇతర కంటెస్టెంట్స్ పోటీ పడే ఛాన్స్ వచ్చింది. కానీ డెమోన్ బాధ పడుతుండగా, సంజన – రీతూ ఓదార్పుతో ఎపిసోడ్ ను షురూ చేశారు. ఇక తనూజ ఎవడైన గెలిచాక చెబుతారు. కానీ ముందే టికెట్ టు ఫినాలే కొట్టేది నేనే అంటూ డైలాగ్స్ కొడతారా?” అంటూ డెమోన్ కు చురకలు అంటించింది. అంతలోనే నాలుగవ ఛాలెంజ్ లో పోటీ పడనున్న కంటెస్టెంట్స్ ఎవరో తేల్చండి అనే బిగ్ బాస్ ఆదేశంతో అందరూ అలర్ట్ అయ్యారు.

కళ్యాణ్ – ఇమ్మూ గ్రూప్ గేమ్ 

కళ్యాణ్ – ఇమ్మూ పక్కా ప్లానింగ్ తో రంగంలోకి దిగారు. “తొలి ఫైనలిస్ట్ అవ్వడానికి జరుగుతున్న పోటీలో భాగంగా ముగ్గురు పోటీదారులకు ఇస్తున్న నాలుగవ ఛాలెంజ్ కలర్ ఫుల్ టు పవర్ ఫుల్. దీని కోసం పోటీదారులు చేయాల్సిందల్లా ప్లేటులో ఉన్న తమ కలర్ ను చేతులతో తీసుకుని తమ ముందున్న కాన్వాస్ పై పూయాల్సి ఉంటుంది” అని టాస్క్ ను బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఈ టాస్క్ లో భరణి, కళ్యాణ్, రీతూ పాల్గొన్నారు. చివరికి కళ్యాణ్ విన్ అయ్యి, సుమన్ తో నెక్స్ట్ ఆడతానని స్పష్టం చేశాడు. కానీ ఈ గ్యాప్ లోనే ‘సుమన్ అన్న జోలికి వెళ్లొద్దు అన్నా కదా’ అంటూ కళ్యాణ్ కు భరణి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ‘మీకు అర్థం కాట్లేదు’ అని కళ్యాణ్ వివరణ ఇచ్చేలోగానే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. సుమన్ శెట్టితో కూర్చుని “నిన్నూ నన్ను తీసేసి, వాళ్ళు ముగ్గురూ కొట్టుకుందాం అన్నదే ఆ ముగ్గురి స్ట్రాటజీ అనుకుంటా. చూద్దాం ఏం జరుగుతుందో” అని చెప్పాడు భరణి.

Advertisement

ఇద్దరు పోటీదారులకు బిగ్ బాస్ పెట్టిన నాలుగవ యుద్ధం “రేజ్ ర్యాంపేజ్”. రేజ్ రూమ్ లో ఉన్న అన్నీ ఐటమ్స్ ను పగలగొట్టి, త్రాసులో తలోవైపు పెట్టాలి. ఎవరి వైపు ఎక్కువ బరువు ఉంటే వాళ్ళు విన్ అయినట్టు. ఈ టాస్క్ లోనూ సుమన్ ను ఓడించి, కళ్యాణ్ త్రాసులో ఎక్కువ బరువును పెట్టి విన్ అయ్యాడు. అయితే టాస్క్ లో భాగంగా సుమన్ ను బ్లాక్ చేసినా, ఆయన ఎఫర్ట్స్ ను అభినందించాల్సిందే.

బ్యాలెన్స్ చేయరా డింభకా

“మీరంతా ఇప్పటి వరకు దేని కోసం పోరాడుతున్నారో దాన్ని రివీల్ చేసే సమయం వచ్చింది. అది కేవలం గౌరవం మాత్రమే కాదు. గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుకలా మారిన మీ ప్రయాణానికి ప్రతీక. అది కేవలం మీలో ఒకరికే లభిస్తుంది. ఇదే ఆఖరి ఛాలెంజ్. తరువాత యుద్ధాలు మాత్రమే ఉంటాయి. చివరి టాస్క్ బ్యాలెన్స్ చేయరా డింభకా” అని చెప్పారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో కళ్యాణ్, రీతూ, ఇమ్మూ పాల్గొనగా… మిగతా వాళ్ళు ఫైనలిస్ట్ కాకూడదు అని ఎవరిని అనుకుంటే వాళ్ళ స్టిక్ పై కాయిన్స్, టోకెన్ యాడ్ చేయాలి. అవి కింద పడితే ఓడినట్టే. ఇందులో ఇమ్మూ – కళ్యాణ్ ప్లాన్ ప్రకారం రీతూ గెలిచింది. ఆ తరువాత బిగ్ బాస్ అడిగితే, బాగా ఆలోచించి భరణితో గేమ్ ఆడడానికి సిద్ధం అయ్యింది.

Advertisement

తరువాత “ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడానికి ఇద్దరికీ ఇస్తున్న ఐదో యుద్ధం రింగ్ మాస్టర్. జంక్ యార్డులో ఉన్న మూడు ట్రాయింగిల్స్, మూడు సర్కిల్స్, మూడు స్క్వేర్ ను టేబుల్ లోని రోలో పెట్టాలి” అంటూ మరో టాస్క్ ను ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో భరణి, రీతూ పాల్గొన్నారు. రీతూనే గెలిచింది. కానీ అంతలోనే తనుజా ఎంట్రీ ఇచ్చి, ఫస్ట్ లైన్ కరెక్ట్ కాదంటూ ట్విస్ట్ ఇచ్చింది. దీంతో కన్ఫ్యూజన్ లోనే మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశారు రీతూ, భరణి. ఈ టాస్క్ పూర్తి కాకుండానే ఎపిసోడ్ ను ఎండ్ కార్డ్ పడింది.

Read Also : డెమోన్‌పై తనూజా.. కళ్యాణ్‌పై భరణి కుతంత్రాలు… సరిపోయారు తండ్రికూతుర్లు ఇద్దరూ

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×