BigTV English
Advertisement

Gudem Mahipal Reddy: గూడెం మహిపాల్ యూటర్న్.. మళ్లీ కేసీఆర్ చెంతకు

Gudem Mahipal Reddy: గూడెం మహిపాల్ యూటర్న్.. మళ్లీ కేసీఆర్ చెంతకు

Gudem Mahipal Reddy: బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే ఆ ఎమ్మెల్యే కారు దిగేశాడు.. పవర్‌లో ఉన్నంత కాలం ఎంచక్కా కూడబెట్టుకున్న అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి హస్తం గూటికి చేరిపోయాడు. మరి కాంగ్రెస్‌లో ఏం లెక్కలు తేడా వచ్చాయో కాని తిరిగి గులాబీ గూటికి చేరడానికి రెడీ అయ్యాడంట. ఆ దిశగా గులాబీబాస్‌తో మంతనాలు కూడా సాగిస్తున్నాడంట. ఇంతకీ ఎవరా శాసనసభ్యుడు?  అంత చకచకా రాజకీయ రంగులు మార్చేస్తూ యూటర్న్ తీసుకోవడం వెనుక లెక్కలేంటి?


పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హస్తం కూటికి చేరి పట్టుమని పది నెలలు కూడా కాలేదు. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన గూడెం మహిపాల్ రెడ్డి గుండెల నిండా గులాబీ జెండానే ఉందంట. అందుకే మళ్లీ తన సొంత గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నాంట. మళ్లీ తన సొంత కారులో ఎక్కేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సంప్రదింపులు మొదలుపెట్టారంట. కారు ఓనర్ ఓకే అంటే ఏ క్షణమైనా జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంట. అంతా సజావుగా జరిగితే మార్చి 2 న గులాబీ కండువా కప్పుకోవడం‌ ఖాయమంటున్నారు గూడెం అనుచరులు.

గూడెం మహిపాల్ రెడ్డి మూడు సార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడో సారి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ 2024 లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం గూడెంకు షాక్ తగిలిందనే చెప్పవచ్చు. ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ హయాంలో చేసిన అవినీతి, అక్రమాలతో పాటు అనుమతికి మించి క్రషర్ తవ్వకాలు చేశారని ఆయనపై ఆరోపణలున్నాయి. తన అక్రమ దందాలతో కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వెలుగులోకి తీసింది. దాంతో కేసుల భయంతో ఆయన 2024 జూలైలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.


మొదట్లో కాస్త బాగానే ఉన్నా గత కొద్ది రోజులుగా పటాన్ చెరు ఎమ్మెల్యే అధికార పార్టీలో ఇమడలేక పోతున్నారంట. నియోజకవర్గంలో ఏదైనా అధికార కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చే మంత్రుల పర్యటనపై ఎమ్మెల్యేకు సమాచారం ఉండటం లేదంట. వారంతట వారు వచ్చి ప్రోగ్రామ్స్ చేసుకుని వెళ్లిపోతుండటం గూడెంకు మింగుడుపడటం లేదంట. కనీసం ఎమ్మెల్యే పేరు ఎక్కడా ప్రస్తావించకుండానే కార్యక్రమాలను ముగిస్తుండటం ఆయనకు పుండు మీద కారం చల్లినట్లు అవుతోందంట.

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన కుల‌ గణన, ఇంటింటి సమగ్ర సర్వే కార్యక్రమాన్ని ఎమ్మెల్యేకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు మెదక్ కంటెస్టెడ్ ఎంపీ క్యాండెట్ నీలం మధు స్వగ్రామమైన చిట్కుల్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా హాజరయ్యారు. అయితే సమాచారం లేకపోవడంతో ఎమ్మెల్యే గైర్హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: ఇండియా దెబ్బకు పాక్ ప్రధాని ఓవరాక్షన్

ఇక మహిపాల్‌రెడ్డి పార్టీ మారాక ఎమ్మెల్యే క్యాంపు‌ కార్యాలయంలో సీఎం రేవంత్ ఫోటో పెట్టలేదని కాట శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు గతంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అదలా ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలోనూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కనిపించలేదు. దాంతో ఆయన ఎక్కడా అంటూ కాంగ్రెస్ నేతలు రసాభస చేశారు. ఇవన్నీ జీర్ణించుకోలేని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ గులాబీ కండువా కప్పుకుని తిరిగి సొంత గూటిలోకి వెళ్లాలని నిశ్చయించుకున్నారంట. మార్చి నెల 2 వ తేదీన కారు ఎక్కేందుకు ముహూర్తం ఖరారైనట్లు చెప్తున్నారు. హరీష్ రావుకు వీర విధేయునిగా పేరు ఉన్న మహిపాల్ రెడ్డి మళ్లీ బీఆర్ఎస్ లోకి చేరడం తథ్యమేనని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.

గూడెం మహిపాల్ రెడ్డీ కాంగ్రెస్‌లో చేరిన నాటి నుండి పటాన్‌చెరులో కాటా శ్రీనివాస్ వర్గం వ్యతిరేకంగా ఉంది. నియోజకవర్గంలో కాటా, గూడెం వర్గాల మధ్య ఆగాధం పెరిగింది. అధిష్టానం ఇద్దరు కలిసి ఉండాలని చెప్పినా ఎవరికి వారే యమునా తీరుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో గూడెం మళ్ళీ యు టర్న్ తీసుకున్నారని.. అందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. మహిపాల్‌రెడ్డి మళ్లీ కారులో షికారు చేయడం ఖాయమైందంటున్నారు.

 

Related News

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Big Stories

×