Shahrukh Khan:బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్(Shahrukh Khan) నటించిన పఠాన్(Pathaan ) సినిమా అందరూ చూసే ఉంటారు.. 2023లో షారుఖ్ ఖాన్ హీరోగా, దీపిక పదుకొనే (Deepika Padukone) హీరోయిన్ గా సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్లో ఈ పఠాన్ మూవీ వచ్చింది. 2023లో వచ్చిన ఈ సినిమాతో బాలీవుడ్ కి ఊపిరి పోసారు షారుఖ్ ఖాన్. ముఖ్యంగా 2023లో బాలీవుడ్ లో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. దాంతో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్,జవాన్ వంటి సినిమాలు హిట్ అయ్యి బాలీవుడ్ పరువు కాపాడాయి. అయితే రూ.250 కోట్లతో తెరకెక్కిన పఠాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ సినిమా విడుదలైన సమయంలోనే దీనికి సీక్వెల్ గా పఠాన్ -2 (Pathaan-2)కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా పఠాన్ -2 సినిమాకి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. మరి ఇంతకీ పఠాన్ -2 మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లబోతోంది? అనేది ఇప్పుడు చూద్దాం..
KrishnaVamsi- RamyaKrishna: భార్యకు విడాకులు.. స్పందించిన డైరెక్టర్.!
పఠాన్ 2 కి సర్వం సిద్ధం..
షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీకి సీక్వెల్ గా పఠాన్ 2 సినిమా పై తాజాగా కొన్ని అప్డేట్లు వినిపిస్తున్నాయి. పఠాన్-2 మూవీ షూటింగ్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్టు సమాచారం. అయితే పఠాన్ సినిమాకి సిద్ధార్థ్ ఆనంద్(Siddharth Anand) దర్శకత్వం వహించగా.. పఠాన్ -2 సినిమాకి డైరెక్షన్ ఆయన చేయడం లేదని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. పఠాన్ కి సీక్వెల్ గా వస్తున్న కథని ఈ మూవీ నిర్మాత ఆదిత్య చోప్రా, అబ్బాస్ టైరేవాలా, శ్రీధర్ రాఘవన్ లు స్క్రిప్ట్ వర్క్ రెడీ చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ స్క్రిప్ట్ ని షారుఖ్ ఖాన్ కి కూడా వినిపించారట. ఇక షారుఖ్ ఖాన్ కి ఈ కథ నచ్చడంతో బాగుందని ప్రశంసించినట్లు సమాచారం. అలాగే పఠాన్ సినిమా కంటే పఠాన్ -2 సినిమా మరింత స్ట్రాంగ్ గా ఉండబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం పఠాన్ సీక్వెల్ కి సంబంధించిన పనులన్నీ నిర్మాత ఆదిత్య చోప్రా (Adithya Chopra) దగ్గరుండి మరీ చూసుకుంటున్నారట.
వచ్చే ఏడాది షూటింగ్ మొదలు..
ఇక ఈ ఏడాది చివర్లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యాక.. వచ్చే ఏడాది పఠాన్ -2 సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్టు బీటౌన్ లో టాక్ వినిపిస్తోంది. యష్ రాజ్ ఫిలిం బ్యానర్స్ లో ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన పఠాన్ సినిమా భారీ హిట్ కొట్టడంతో పఠాన్ సీక్వెల్ పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో కూడా షారుఖ్ ఖాన్ సరసన దీపిక పదుకొనేని హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు సమాచారం. కానీ ఇప్పటి వరకు పఠాన్ సీక్వెల్ కి దర్శకత్వం ఎవరు చేస్తారు అనేది మాత్రం తెలియడం లేదు. మరి సీక్వెల్ కి కూడా సిద్ధార్థ్ ఆనందే డైరెక్షన్ చేస్తారా.. ? లేక కొత్త దర్శకుడు ఎవరైనా ఈ ప్రాజెక్టులోకి వస్తారా? అనేది తెలియాల్సి ఉంది.