BigTV English

Bank Holidays In March: టూర్ ప్లాన్ ఉందా? మార్చిలో బ్యాంకులకు సెలవులే సెలవులు

Bank Holidays In March: టూర్ ప్లాన్ ఉందా? మార్చిలో బ్యాంకులకు సెలవులే సెలవులు

Bank Holidays In March: మార్చిలో ఏమైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా? ముందుగానే రెడీ అవ్వండి.  ఎందుకంటే మార్చి నెలలో సెలవులే సెలవులు. దాదాపు 13 సెలవులు ఉన్నట్లు తెలుస్తోంది. సెలవులు నేపథ్యంలో పెళ్లిళ్లు, టూర్లకు వెళ్లే‌వాళ్లు జాలీగా ఎంజాయ్ చేయవచ్చు. ఎలాంటి చింత అవసరం లేదు. కాకపోతే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ఒక్కటే మాత్రమే అడ్డంకి. ఇంతకీ సెలవులు  ఏంటి? వాటిపై ఓ లుక్కేద్దాం.


మార్చిలో 13 సెలవులు

మరో రెండు రోజుల్లో ఫిబ్రవరి నెల ముగియనుంది. ఫిబ్రవరిలో సగం రోజులు సెలవులు తీసుకున్న బ్యాంకర్లకు మార్చిలోనూ హాలీడేలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ మేరకు ఆర్​బీఐ సెలవుల జాబితాను విడుదల చేసింది. ముఖ్యంగా బ్యాంక్​ పనుల మీద తిరిగేవారు కచ్చితంగా మార్చిలో సెలవుల జాబితాను తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే పెళ్లిళ్లు కూడా ఇదే నెలలో ఎక్కువగా ఉండడంతో ముందుగానే అలర్ట్ కావచ్చు. లేకుంటే ఇబ్బందులు తప్పవు.


దేశవ్యాప్తంగా సెలవులు

ఆయా రోజుల్లో వేర్వేరు రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి వేయబడతాయి. అందుకు అనుగుణంగా ఆర్థిక లావాదేవీలను ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. మార్చి ఒకటి శనివారం సెలవు. బెంగాల్​, ఒడిశా, అసోంలో బ్యాంక్​లకు సెలవు, ఎందుకంటే ఆ రోజు రామకృష్ణ జయంతి సందర్భంగా ఆ మూడు రాష్ట్రాలకు సెలవు వర్తించనుంది. ఆదివారం నార్మల్‌గా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

మార్చి 8న రెండో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. మరుసటి రోజు ఆదివారం కావడంతో ఆ రోజూ రెస్ట్ తీసుకోవచ్చు. మార్చి​ 13న గురువారం ఛొటి హోలీ కావడంతో సెలవు. 14న శుక్రవారం రోజు హోలీ. ఆరోజు దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. మరుసటి రోజు అంటే 16న ఆదివారం.

ALSO READ: ముఖేష్ అంబానీ ఇంట్లో పనివాళ్ల జీతం తెలిస్తే షాక్

మార్చి 20న గురువారం నూతన ఏడాది కావడంతో మహారాష్ట్ర, గుజరాత్‌లోని బ్యాంకులకు సెలవు తప్పని సరి. మార్చి 22న నాలుగో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటాయి. ఆ మరుసటి రోజు అంటే 23న ఆదివారం నార్మల్‌గా వచ్చే సెలవు ఉంటుంది.

మార్చి 23న జనరల్ గా ఆదివారం సెలవు ఉంటుంది. అదే రోజు జమాత్ ఉల్-విదా. జమ్మూ & కాశ్మీర్, కేరళ, ఉత్తర ప్రదేశ్‌లలో దీన్ని జరుపుకుంటారు. ఇక మార్చి 28న శుక్రవారం ఉగాది కావడంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కొత్త ఏడాదిగా భావిస్తారు. ఆ రోజూ సెలవు ఉంటుంది. మార్చి 30 ఆదివారం కావడంతో బ్యాంక్ కు సెలవు ఉంటుంది. ఓవరాల్‌గా చూస్తుంటే మార్చి నెలలో దాదాపు 13 సెలవులు వున్నాయి.

అందుబాటులో ఆన్‌లైన్ సర్వీసులు

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 13 సెలవులు రావు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల పండుగలు బట్టి ఆ రోజు సెలవు మాత్రమే ఉంటాయి. అంతేగానీ దేశవ్యాప్తంగా అందరికీ సెలవు వర్తించదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. నగదు అత్యవసర పరిస్థితుల కోసం వారాంతం, ఇతర సెలవులతో సంబంధం లేకుండా ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ సేవలను నిత్యం అందుబాటులో ఉంటాయి. నగదు ఉపసంహరణ కోసం ఏ బ్యాంకు ఏటీఎం నైనా యాక్సెస్  చేసుకునే సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి సెలవుల బట్టి టూర్లకు చాలామంది ప్లాన్ చేసుకోవచ్చు.

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×