BigTV English
Advertisement

HYDRA: హైడ్రా పనైపోయిందా ? సీఎం రేవంత్ స్పందన ఏంటి ?

HYDRA: హైడ్రా పనైపోయిందా ? సీఎం రేవంత్ స్పందన ఏంటి ?

HYDRA: రోజురోజుకు విమర్శలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం, అధికారులపై ఒత్తిడి అంతకన్నా పెరుగుతోంది. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌ అంతకన్నా ఎక్కువవుతుంది. మరి హైడ్రా కంటిన్యూ అవుతుందా ? ఇక అటకెక్కిస్తారా? అనేవే ప్రశ్నలు. వీటిపైనే తెలంగాణ పొలిటికల్‌ సర్కిల్స్‌లో తెగ ప్రచారం జరుగుతోంది. మరి తర్వాత జరగబోయేది ఏంటి?


శషభిషలు లేవు.. అంతా క్రిస్టల్ క్లియర్. బతిలాడినా.. వేడుకున్నా.. భయపెట్టినా.. బెదిరించినా.. తగ్గేదేలే.. వెనకడుగు వేసేదేలే. ఏ లక్ష్యంతో అయితే హైడ్రాను ప్రారంభించామో.. ఆ లక్ష్యం నెరవేరే వరకు ముందుకు సాగడమే తప్ప.. వెనకడుగు వేసేది లేదు. ఇందులో మీకు ఎలాంటి డౌట్స్‌ అవసరం లేదు. ఇలా ఉన్నది ఉన్నట్టు.. ముఖం మీద కొట్టినట్టు చెప్తేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా ఇక నుంచి ముందుకే వెళ్తుంది తప్ప.. ఆగిపోవడం అనే ప్రశ్నే లేదంటున్నారు.

కాస్త బాధగా.. మరికాస్త నష్టం చేకూర్చినా.. కొందరికి నష్టం జరిగినా.. హైడ్రా దూకుడుగా ఉండాల్సిందే. ఎందుకంటే హైడ్రా దూకుడుగా ఉంటేనే.. చెరువులను చెర పట్టిన వారి పీడ విరగడవుతుంది. భూములు ఫ్రీ అవుతాయి. వారి ప్రవాహానికి ఎలాంటి అడ్డు అదుపు ఉండదు. లేదంటే ఇప్పుడు జరుగుతున్న ఉపద్రవాలను చూస్తూనే ఉన్నాం కదా. ఇదే విషయాన్ని చెబుతున్నారు సీఎం రేవంత్.


కొన్ని రోజులుగా ఓ చర్చ నడుస్తోంది. ఇక హైడ్రా పని అయిపోయింది.. దాన్ని మెల్లిమెల్లిగా నిర్వీర్యం చేస్తారని, కానీ వారి అనుమానాలన్నీ ఇప్పటికే పటాపంచలయ్యి ఉంటాయి. దీనికి కొనసాగింపుగా మరికొన్ని డిటెయిల్స్‌ రిలీజ్ చేసింది హైడ్రా. ఇప్పటి వరకు 23 ప్రాంతాల్లో ఆక్రమణలను కూల్చేశామని చెప్పింది హైడ్రా. అంతేకాదు.. మొత్తం 262 అక్రమ కట్టడాలను నేలమట్టం చేసి.. 111 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. కాబట్టి.. పని ఎక్కడా ఆగలేదు. అయితే రేవంత్‌ ఆలోచన హైడ్రాతో ఆగిందా?

Also Read: రూట్ మార్చిన హైడ్రా.. అంతా పక్కాగా..

నిజానికి మూసీ నది సుందరీకరణపై అధికారంలోకి వచ్చినప్పుడే ఫోకస్ చేశారు సీఎం రేవంత్. లండన్‌లోని థేమ్స్‌ నది తరహాలో మూసీని డెవలప్‌ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే మూసీ రివర్ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు అదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నారు రేవంత్.

ఆక్రమణల విషయంలో జాలి, దయ అవసరం లేదంటున్నారు రేవంత్. ఎందుకంటే.. ఒక్కసారి కాంప్రమైజ్ అయితే అసలు లక్ష్యం నీరుగారిపోతుంది. అందుకే డైరెక్ట్‌గా హెచ్చరిస్తున్నారు. మీ అక్రమ నిర్మాణాలను మీరే కూల్చేయాలి. లేదంటే మేమే వచ్చి కూల్చేస్తామంటున్నారు. ఇది హైడ్రా విషయంలో ఇచ్చిన క్లారిటీ. ఇక మూసీ చుట్టుపక్కల ఉన్న నిర్మాణాల విషయంలో మాత్రం ఆయన కాస్త జాలి చూపించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో గుడిసెలు వేసుకున్నవారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామన్నారు. నిజానికి చాలా మంది మూసీ పరివాహక ప్రాంతంలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. అందుకే వారి సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆక్రమణల విషయంలో అష్టదిగ్బంధనం చేస్తున్నారు సీఎం రేవంత్. ఆక్రమణలు కూల్చేస్తున్నారు. కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదు. ఇదే సమయంలో.. ఈ ఆక్రమణలకు వంతపాడిన వారి భరతం కూడా పడుతున్నారు. అంతేకాదు హైడ్రాను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు మొదలయ్యాయి. హైడ్రాకు ప్రత్యేకంగా పోలీస్‌ అధికారులను కేటాయించారు. 15 మంది సీఐ స్థాయి అధికారులు. 8 మంది ఎస్‌ఐ స్థాయి అధికారులు ఇప్పుడు హైడ్రా కోసం పనిచేయనున్నారు. కాబట్టి.. అన్‌స్టాపబుల్‌గా హైడ్రా ముందుకు వెళ్లడమే కానీ.. ఆగే సవాలే లేదు.

Related News

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Kalvakuntla Kavitha: జూబ్లీహిల్స్ బైపోల్‌.. బీఆర్ఎస్‌కు కవిత గండం

Kalvakuntla Kavitha: కవిత టార్గెట్.. కారు పార్టీ.. టచ్‌లో ఆ నేతలు?

Vijayanagaram TDP: టీడీపీ జిల్లా.. రథసారథి ఎవరో?

Big Stories

×