Big Stories

Hetero Chairman Parthasaradhi: కోట్లు కుమ్మరించిన హెటిరో.. పార్ధసారథికి దక్కిన ఎంపీ సీటు

Parthasaradhi
 

Hetero Chairman Parthasaradhi Latest News: హెటిరో గ్రూప్‌.. బండి పార్ధసారథి రెడ్డి .. ఒకటి ఫార్మా కంపెనీ.. మరోకరు ఆ కపెంనీ ఫౌండర్ అండ్ చైర్మన్.. ఈ రెండింటికి ఎంత లింక్ ఉందో.. ఎలక్టోరల్ బాండ్స్‌కు.. పార్ధసారథి రెడ్డికి ఎంపీ సీటు రావడానికి.. వివిధ పార్టీలకు డోనేషన్స్ ఇవ్వడం వెనక కూడా చాలా రీజన్స్ ఉన్నాయి.. ఇంతకీ పార్ధసారథి రెడ్డికి సీటు రావడానికి ముందు.. ఆ తర్వాత ఏం జరిగింది? నధులు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా మళ్లాయి? హెటిరో వల్ల లాభపడిన పార్టీలేంటి? ఏ పార్టీకి ఎంత దక్కింది?

- Advertisement -

హెటిరో గ్రూప్.. ఫార్మా దిగ్గజం.. హైదరాబాద్‌లో పురుడు పోసుకొని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది ఈ ఫార్మా గ్రూప్.. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఈ కంపెనీ పార్టీలకు ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్సే ఇప్పుడు టాపిక్.. ఈ కంపెనీ భారత రాష్ట్ర సమితికి ఏకంగా 120 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చింది. ఇది కూడా ప్రాబ్లమ్ కాదు. కానీ ఆ బాండ్లు ఇచ్చిన టైమింగే ఇక్కడ పాయింట్.. ఎందుకంటే హెటిరో గ్రూప్ చైర్మన్ పార్ధసారథి రెడ్డి బీఆర్ఎస్‌ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.. సరిగ్గా ఆయన ఎంపీగా ఎంపికవ్వడానికి ముందు 70 కోట్ల విలువైన ఎలక్టోరల్ బ్రాండ్స్‌..బీఆర్ఎస్‌కు అందాయి..అంటే డబ్బులిచ్చి ఎంపీ సీటును పార్ధసారథి కొన్నారా? డబ్బులకు బీఆర్ఎస్‌ పార్టీ ఎంపీ సీటును అమ్ముకుందా? ఈ తతంగమంతా చూస్తే అలానే కనిపిస్తోంది మరి.

- Advertisement -

Also Read: ఫోన్ ట్యాపింగ్లో మళ్లీ కేసీఆర్ పేరు.. ఈసారి శిష్యుడే..!

మరి ఎలక్టోరల్ బాండ్స్‌ లిస్ట్ చూస్తే ఈ విషయాలన్ని కనిపించడం లేదు. మరి అన్ని కోట్ల విలువైన బాండ్లను ఎలా ఇచ్చారు? సింపుల్ హెటిరో ఫార్మా పేరుపై ఇవ్వలేదు ఈ బాండ్స్‌ను.. అనుంబంధ కంపెనీల పేరుపై చిన్న చిన్న డోనేషన్స్‌తో బాండ్లను కొనుగోలు చేసి.. బీఆర్‌ఎస్‌కు చేరవేసింది హెటిరో.. హెటిరో డ్రగ్స్ లిమిటెడ్.. హెటిరో ల్యాబ్స్.. హెటిరో బయోఫార్మా, హింద్యాస్ ల్యాబ్స్‌ ప్రైవేట్ లిమిటెడ్.. దానిక ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్.. ఇలా చిన్న చిన్న కంపెనీల పేరుపై మొత్తం 140 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్‌ను కొనుగోలు చేశారు. ఇందులో 120 కోట్లు బీఆర్ఎస్‌కు.. బీజేపీకి 15 కోట్లు.. కాంగ్రెస్‌కు 5 కోట్లు కట్టబెట్టారు..

మళ్లీ పార్థసారథి ఇష్యూకు వద్దాం.. ఆయనను రాజ్యసభ అభ్యర్థిగా 2022లో అనౌన్స్ చేసింది బీఆర్‌ఎస్‌.. అదే ఏడాది ఏప్రిల్‌లో బీఆర్ఎస్‌కు 50 కోట్లు బాండ్ల రూపంలో చేరాయి.. అదే ఏడాది జూన్‌లో ఆయన ఏకగ్రీవంగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ నెక్ట్స్‌ మంత్‌లోనే బీఆర్‌ఎస్‌కు మరో 20 కోట్లు బీఆర్‌ఎస్‌కు చేరాయి. హింద్యాస్‌ ల్యాబ్స్‌ 2.5 కోట్లు.. సెల్మాలర్ ల్యాబ్స్ 10 కోట్లు.. హెజిలో ల్యాబ్స్‌ 2.5 కోట్లు.., దాసమి ల్యాబ్స్‌ 2.5 కోట్లు.. దానికా ట్రేడర్స్ ప్రైవేట్‌ లిమిటెడ్ 2.5 కోట్లు.. ఇలా మొత్తం 20 కోట్లు చేరాయి బీఆర్ఎస్‌కు.. ఈ డోనేషన్స్ అక్కడితో ఆగలేదు.. 2023లో మళ్లీ అనుంబంధ కంపెనీలన్నీ కలిసి మరో 50 కోట్లు అందించాయి బీఆర్‌ఎస్‌కు..

ఓ వైపు బీఆర్ఎస్‌కు కోట్లు కుమ్మరిస్తున్న సమయంలోనే.. హెటిరో గ్రూప్‌కు రెడ్ కార్పెట్‌ వెల్‌కమ్‌ దక్కింది. ఈ సమయంలోనే కంపెనీ చాలా డెవలప్‌ అయ్యింది. ఫార్మా సెక్టార్‌లో ఓ వెలుగు వెలిగింది. 2022 ఫైనాన్షియల్ ఇయర్‌లో ఒక్క హెటిరో హెల్త్‌కేరే.. 1823 కోట్ల రెవెన్యూ సాధించింది..
అంతేకాదు ఆ సమయంలో బీఆర్ఎస్‌ సర్కార్ ఓ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో ఫార్మాసిటీని నిర్మించాలని.. 2025లోపు వంద బిలియన్‌ డాలర్ల మార్కెట్‌కు చేరుకోవాలని టార్గెట్‌గా ఫిక్స్‌ చేసుకుంది. ఇందులో ప్రధానంగా లబ్ధి పొందేది హెటిరో గ్రూప్‌ అని వేరే చెప్పుకోనక్కరలేదు.

అసలు హెటిరో గ్రూప్‌ బీఆర్ఎస్‌ వైపు ఎప్పుడు మళ్లింది.. ? దీనికి ఆన్సర్ 2021 అని చెప్పాలి.. ఆ ఇయర్ అక్టోబర్‌లో హెటిరో గ్రూప్‌పై ఐటీ రెయిడ్స్ జరిగాయి. ఆ సమయంలో 142 కోట్ల క్యాష్‌ను సీజ్ చేశారు..
550 కోట్ల ఆదాయాన్ని చూపించలేదని గుర్తించారు. ఆ తర్వాత ఆయన బీఆర్‌ఎస్‌కు మరింత దగ్గరయ్యారు. మరి అంత ఆదాయం ఆ కంపెనీ ఎందుకు వచ్చింది? దాన్ని ఎందుకు లెక్కల్లో చూపించలేదు? దీనికి ఆన్సర్ తెలియాలంటే కరోనా టైమ్స్‌కు వెళ్లాల్లి.. కరోనాను కంట్రోల్‌ చేసేందుకు రెమిడెసివిర్ అనే డ్రగ్‌ను డెవలప్‌చేసింది హెటిరో.. దీన్ని ఆఫిషియల్‌గా సేల్ చేయకుండా.. డైరెక్ట్‌గా కంపెనీనే బ్లాక్‌లో అమ్మడం మొదలుపెట్టింది.

అలా సంపాదించిందే ఈ డబ్బంతా అని ఆప్పుడు విచారణలో తేలిందన్న ఆరోపణలు ఉన్నాయి.. కానీ రాత్రికి రాత్రే ఈ వ్యవహారం సద్ధుమణిగింది.. ఆ తర్వాత కొన్ని నెలలకే అంటే2022లో.. హెటిరో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 10 కోట్లను కేంద్రంలోని బీజేపీకి డోనేట్ చేసింది. 2023లో మరో 5 కోట్లను అందించింది..
ఇక తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్‌కు ముందు కూడా బీఆర్ఎస్‌కు 15 కోట్లు.. కాంగ్రెస్‌కు 5 కోట్లు డోనేట్ చేసింది హెటిరో.. ఇన్ని కోట్లు కుమ్మరించడం వల్లే మళ్లీ ఐటీ అటువైపు చూడలేదా? అనే డౌట్స్ కూడా ఉన్నాయి..

హెటిరో పొలిటికల్ పార్టీలకు డోనేషన్‌ ఇవ్వడం ఇదే ఫస్ట్‌ టైమా? ఇంత ముందుకు ఇవ్వలేదా? అంటే ఆన్సర్ యస్ అనే చెప్పాలి.. 2014లో కూడా పొలిటికల్ డోనేషన్స్‌ ఇచ్చింది హెటిరో.. అప్పుడు వైఎస్‌ఆర్‌సీపీకి కోటి రూపాయలు. ఇప్పడు బీఆర్ఎస్‌గా మారిన అప్పటి టీఆర్‌ఎస్‌కు కోటిన్నర..
టీడీపీకి 50 లక్షలు.. బీజేపీకి కోటి రూపాయలు ఇచ్చింది హెటిరో.. ఇలా పార్టీలకు ఫండ్స్ ఇచ్చిన హెటిరో చాలానే లబ్ధి పొందింది. హైటెక్‌ సిటీ సమీపంలో అత్యంత విలువైన.. 15 ఎకరాల భూమిని హెటిరో డ్రగ్స్‌ చైర్మన్‌ పార్థసారథిరెడ్డికి చెందిన..

Also Read: వారే మెట్టు దిగారు.. వీరెందుకిలా? ఏపీ బీజేపీ నేతల తీరు మారదా?

సాయిసింధు ట్రస్టుకు 60 ఏళ్లపాటు లీజుకు ఇచ్చింది అప్పటి బీఆర్ఎస్‌ సర్కార్.. 2018లో జీవో నంబర్‌ 59 జారీచేసింది. అయితే ఈ జీవోను హైకోర్టులో సవాల్ చేశారు కొందరు. దీంతో హైకోర్లు జీవోను కొట్టేసింది. దీంతో హెటిరో ఆశలు అడియాశలయ్యాయి.. అయితే తాము క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికే భూమిని కోరామంటూ హెటిరో వాదించింది. కానీ కోర్టు ఆ విషయాలను పట్టించుకోలేదు.. ఇదే కాదు 2022లో జీనోమ్ వ్యాలీలో.. 750 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌తో స్టెరీల్ మాన్‌ఫ్యాక్చరింగ్ కంపెనీని విస్తరించాలని నిర్ణయించింది.

ఈ మధ్య కాలంలో డెవలప్‌ అయిన హెటిరో గ్రూప్‌ సంపద విలువ ఎంతో తెలుసా? అక్షరాల 24 వేల 900 కోట్లు.. లెటెస్ట్‌గా హురున్‌ గ్లోబల్‌ రిలీజ్ చేసిన కుబేరుల జాబితాలో ఉన్నాయి ఈ డిటెయిల్స్.. ఇక పార్థసారథి వ్యక్తిగత సంపదను చూస్తే.. 3 వేల 900 కోట్లు.. ఇది ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో స్వయంగా మెన్షన్‌ చేసిన సంపద వివరాలు..

ఇది హెటిరో గ్రూప్ కథ.. దాని చైర్మన్ పార్దసారథి రెడ్డి గాథ.. ఆ కంపెనీ ఎలా విస్తరించింది.. పార్ధసారథి రెడ్డికి ఎంపీ సీటు ఎలా వచ్చిందో ఇప్పుడు అర్థమయ్యింది కదా.. ఓవరాల్‌గా చూస్తే.. ఆయన పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి.. అఫిషియల్‌గానే బీఆర్ఎస్‌కు 120 కోట్లు ఇచ్చారు. ఇక ఇతర పార్టీలకు మరో 20 కోట్లు పంచారు.. సొంత పార్టీతో పాటు.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని.. అన్ని పార్టీలకు డోనేషన్స్‌ ఇస్తున్నారు.. అంటే ఫ్యూచర్‌లో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు కదా.. ఇదంతా బయటకి రాదన్న ధైర్యంతో ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా పంచేశారు..దీనికి ట్యాక్స్‌ మినహాయింపు కూడా ఉండటంతో.. అటు స్వామి కార్యం.. స్వకార్యం రెండూ తీరుతాయనుకున్నారు. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇన్నాళ్లు గుట్టుగా ఉన్న ఈ సీక్రెట్స్ అన్నీ.. ఇప్పుడు బట్టబయలయ్యాయి..

.

.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News