Big Stories

AP News: ఏపీలో కంటెయినర్ పంచాయితీ.. ఇంతకీ అసలు కథేంటి?

ys jagan latest news in telugu

- Advertisement -

Suspected Container at CM Camp Office(AP political news): కాదేది కవితకనర్హం..అదే రాజకీయాలకి వస్తే.. కాదేది వివాదానికి కనర్హం.. అన్ని స్టేట్స్‌ ఏమో కానీ.. ఏపీలో మాత్రం కాస్త స్పెషల్.. మాములుగానే ఎలక్షన్ టైమ్.. ఇప్పుడు తుమ్మినా, దగ్గినా దాన్ని ఆయుధంగా మలుచుకునే టైమ్.. అది అధికారపక్షమా? విపక్షమా? అన్న డౌట్‌ అవసరం లేదు. విషయం ఏదైనా.. వివరణ ఇదే.. నమ్మకపోతే ఏపీ కంటెయినర్ కథ చూడండి..

- Advertisement -

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ నివాసం.. అత్యంత భద్రత గల ప్రాంతం.. అక్కడికి వచ్చే పోయే వారు ఎవరైనా నిఘా నిడలో ఉంటారు. ప్రతి వెహికల్ ఎంట్రీ, ఎగ్జిట్‌ నోట్‌ చేస్తారు సెక్యూరిటీ సిబ్బంది. అలాంటి సీఎం జగన్ ఇంటికి వచ్చిందో కంటెయినర్.. మాములుగా అయితే మెయిన్ ఎంట్రెన్స్ దాటాక..సెకండ్ చెక్‌పోస్ట్ వద్ద వెహికల్స్‌ను స్కాన్ చేస్తారు. కానీ ఆ కంటెయినర్‌ను ఎవరూ స్కాన్ చేయలేదు. సీఎం క్యాంప్ ఆఫీస్ గేటు వద్ద కంటెయినర్‌ను వెనక్కి తిప్పి పెట్టారు. గంటసేపు అక్కడే ఉంది ఆ కంటెయినర్.. ఆ తర్వాత వెనక్కి వెళ్లిపోయింది. అప్పుడు కూడా ఎలాంటి చెకింగ్స్, స్కానింగ్స్ చేయలేదు. అక్కడ మొదలైంది అసలు రచ్చ.. ఆ రచ్చే ఏపీ పాలిటిక్స్‌ను మొత్తం షేక్ చేసింది.

Also Read: పార్టీ కార్యకర్తలకు, నేతలకు కీలక హెచ్చరికలు జారీ చేసిన పవన్ కళ్యాణ్

కంటెయినర్ ఎందుకు వచ్చింది? అపోజిట్ డైరెక్షన్‌లో ఎందుకు వెళ్లింది? సెక్యూరిటీ స్టాఫ్‌ దాన్ని ఎందుకు స్కాన్ చేయలేదు? ఈ ప్రశ్నలు మొదలయ్యాయి. అన్నింటికంటే ముఖ్యంగా అనేక డౌట్స్‌ వచ్చేందుకు కారణమైంది ఆ వెహికల్ నెంబర్.. ఏపీ 16 Z 0363.. మాములుగా Z సిరీస్‌ ఆర్టీసికి వాడతారు. మరి చూస్తే అది గూడ్స్‌ వెహికలు.. మళ్లీ దానిపై పోలీస్‌ అనే స్టిక్కర్ ఉంది..ఆర్టీసీ వెహికల్‌పై పోలీస్‌ స్టిక్కర్ ఎందుకుంది? ఇలా అన్ని ప్రశ్నలే.. సమాధానాలు లేవు. కానీ ఈ ప్రశ్నలకు సరికొత్త సమాధానాలు ఎవరికి వారే రాసుకున్నారు..

ఈ కంటెయినర్‌పై రియాక్ట్ అయ్యారు టీడీపీ నేతలు.. సీఎం జగన్ అధికారిక నివాసంలోకి కంటెయినర్ ఎందుకు వెళ్లింది? నిబంధనలకు అనుగుణంగా ఎందుకు తనిఖీలు చేయలేదని ప్రశ్నించారు.. అసలు ఆ కంటెయినర్‌లో ఏముందని ప్రశ్నించారు. ఇక్కడి వరకు బాగుంది. కానీ లెటెస్ట్‌గా వైజాగ్‌లో పట్టుబడ్డ డ్రగ్స్‌కు .. సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు లింక్‌ చేసేశారు.. ? కంటెయినర్‌లో బ్రెజిల్ సరుకుందా? లిక్కర్ మాఫియా ద్వారా మెక్కిన వేల కోట్లు ఉన్నాయా? లేదంటే ఏపీ సెక్రటేరియట్‌లో ఇన్నాళ్లూ దాచిన దొంగ ఫైళ్లా? అంటూ ప్రశ్నించారు. దీంతో ఏపీలో రాజకీయ దుమారం మొదలైంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వైజాగ్ పోర్టుకు.. కంటెయినర్లలో అక్రమంగా వేల కోట్ల డబ్బు, డైమండ్స్, గోల్డ్ బిస్కెట్స్‌ను విదేశాలకు తరలిస్తున్నారా? అంటూ టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు.

Also Read: విశాఖ డ్రగ్స్ కేసులో బీజేపీ హస్తం.. సీఎం జగన్ సంచలన ఆరోపణలు

కంటెయినర్‌లో ఏం తెచ్చారు? ఏం తీసుకెళ్లారన్న ప్రశ్నల వర్షం కురుస్తున్న సమయంలోనే.. తెరపైకి మరో వీడియో వచ్చింది. ఏ గూడ్స్ ట్రక్ అయితే సీఎం క్యాంప్ ఆఫీస్‌లోకి వెళ్లిందో. అదే ట్రక్‌ వీడియోను రిలీజ్ చేసింది వైసీపీ.. అది సీఎం వైఎస్ జగన్ బస్సు సందర్భంగా దారిలో.. ఆహారం వండేందుకు ఉపయోగించే ప్యాంట్రీ వెహికల్ అని క్లెయిమ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది..

అయితే విమర్శల వర్షం ఇప్పటికీ ఆగడం లేదు. వీడియో తీయడానికి ముందే అందులో ఉన్న సరుకును మార్చేశారని.. సీఎం క్యాంప్ ఆఫీస్‌ నుంచి వెహికల్ మరేక్కడికో వెళ్లింది. ఇలా సాగిపోతున్నాయి ఆరోపణలు.. విమర్శలు..

ఎలక్షన్ టైమ్.. ఇప్పుడు ప్రతి అంశం సున్నితమే.. విషయం ఏదైనా అది వివాదానికే దారి తీస్తోంది. రాజకీయాల్లో రచ్చ సృష్టిస్తోంది. ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నాయి. అధికార, విపక్షాలు.. ఈ ఆరోపణలు ఆగాలంటే.. అన్ని పనులూ ట్రాన్స్‌పరెంట్‌గా చేయాల్సిందే.. అటు ఆరోపణలు చేసే ముందు కాస్త ఆలోచిస్తే మంచిది. లేదంటే.. అందరి ముందూ పరువు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా నేతలు ఈ విషయాలు తెలుసుకుంటే మంచింది.

.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News