Big Stories

TDP BJP Alliance: వారే మెట్టు దిగారు.. వీరెందుకిలా..? ఏపీ బీజేపీ నేతల తీరు మారదా..?

TDP

- Advertisement -

TDP BJP Alliance in Andhra Pradesh Elections 2024: దక్కింది 10 అసెంబ్లీ.. ఆరు పార్లమెంట్ సీట్లు.. పోటీ చేయడానికి అభ్యర్థులను వెతుక్కునే పరిస్థితి. పార్టీలో ఉన్నదే నలుగురైదుగురు ప్రామినెంట్ ఫెస్‌లు.. మళ్లీ వారిలో అలకలు.. అసంతృప్తులు.. అసమ్మతులు.. ఇది ఏపీ బీజేపీ పరిస్థితి.. దాదాపు రాష్ట్రంలో కనుమరుగవుతుందనుకున్న సమయంలో.. రాష్ట్రంలో మరోసారి నిలబడేందుకు వచ్చిన చాన్స్‌ను.. సీనియర్లేందుకు కాళ్ళదన్నుతున్నారు? బీజేపీ సీనియర్ల ఓవరాక్షన్‌కు రీజన్సేంటి?

- Advertisement -

2019 ఎలక్షన్‌ రిజల్ట్స్‌ ఏపీ బీజేపీకి ఓ నైట్‌మేర్.. ఈ పార్టీకి వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్.. నోటా కంటే తక్కువ.. నిజానికైతే ఏ పార్టీ అయినా ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తుంది. మళ్లీ ఎన్నికల వరకు బలపడేందుకు ట్రై చేస్తుంది. పోనీ వీరికి సపోర్ట్‌ లేదా అంటే.. కేంద్రంలో అధికారంలో ఉంది వారి పార్టే.. కానీ ఏపీలో బీజేపీ బలపడింది ఎంత? దీనికి ఆన్సర్ అందరికి తెలిసిందే. ఇలాంటి సమయంలో వారికి రాకరాక కూటమి పేరుతో ఒక చాన్స్ వచ్చింది. మళ్లీ పోటీ చేసే అవకాశం దక్కింది. అసెంబ్లీ, పార్లమెంట్‌లో అభ్యర్థులను ధైర్యంగా బరిలోకి దించి. గెలిచే అవకాశం వచ్చింది. కానీ వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారా? అంటే నో.. అనే చెప్పాలి..

పార్టీ సమావేశం పెడితే.. ఉన్న పదిమంది సీనియర్‌ నేతల్లో సగం మంది రారు.. ఫర్ ఎగ్జాంపుల్.. బెజవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్‌కు కీలక నేతలైన సోము వీర్రాజు రాలేదు.. రాజ్యసభ ఎంపీగా ఉన్న జీవీఎల్ నర్సింహరావు డుమ్మా కొట్టారు. మరో నేత విష్ణువర్ధన్‌ రెడ్డి ఆచూకి కానరాలేదు. వీరంతా ఎందుకు రాలేదు.. ? ఆన్సర్ సింపుల్‌.. వారు ఎక్స్‌పెక్ట్‌ చేసిన సీటు దక్కలేదు. ఇదీ ఆ పార్టీ పరిస్థితి..

Also Read: జగనన్న వదిలిన బాణం ఆయనకే ఎదురెళ్తోంది.. షర్మిల చీల్చే ఓట్లు ఇవే..

విష్ణువర్ధన్‌ రెడ్డి కదిరి ఎమ్మెల్యే టికెట్ ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ టీడీపీ తరపున యశోధా దేవిని అభ్యర్థిగా ప్రకటించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. విశాఖ ఎంపీ టికెట్‌ను జీవీఎల్ నర్సింహారావు కావాలన్నారు. అది కూడా టీడీపీనే దక్కించుకుంది.. భరత్‌ను అభ్యర్థిగా ప్రకటించేశారు కూడా..ఇక సోమువీర్రాజు రాజమండ్రి ఎంపీ సీటును ఆశించారు. కానీ వాళ్ల పార్టీ అధిష్టానం ఆ టికెట్‌ను.. పురందేశ్వరికి కట్టబెట్టింది. సో నేతలంతా నరాజయ్యారు.. అలకపాన్పు ఎక్కారు.. మీటింగ్‌కు డుమ్మా కొట్టారు. ఈ చర్యలతో పార్టీకి ఉన్న కొద్దిపాటి కార్యకర్తలకు. పార్టీ కంటే స్వప్రయోజనాలే ముఖ్యమని సరికొత్త మెసెజ్‌ ఇచ్చారు..

ఇదే కాదు ఏపీ బీజేపీని మరో పంచాయితీ తెగ కంగారు పెడుతోంది. పేరుకు బీజేపీలోనే ఉన్నా.. ఓ బ్యాచ్‌ టీడీపీకి.. మరో బ్యాచ్‌ వైసీపీకి ఫేవర్‌గా ఉన్నారన్న ప్రచారం ఉంది. ఇలా ఓ బ్యాచ్‌ మరో బ్యాచ్‌ నేతలపై విమర్శలు చేస్తున్నారు. వారి వల్ల..వీరికి.. వీరి వల్ల వారికి టికెట్లు దక్కడం లేదంటూ తెగ ఫీలైపోతున్నారు. సరే నిజంగానే వీళ్లకు టికెట్లు దక్కాయనుకోండి. జస్ట్ అనుకోండి. వీళ్లకు పడే ఓట్లు ఎన్ని? వీళ్ల చరిష్మా ఎంత? పార్టీకి ప్రజల్లో ఉన్న పలుకుబడేంటి? ఇది కదా ఆలోచించాల్సింది. కానీ ఈ ఆలోచన ఏ ఒక్కరిలోనూ కనిపించడం లేదు. 2014 ఎన్నికల్లో పొత్తులతో పోటీకి వెళితే.. 7.22 శాతం ఓట్లు వచ్చాయి.. 2019 ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేస్తే.. ఒకశాతం ఓట్లు కూడా రాలేదు.. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే 0.98 శాతం ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో నోటాకు వచ్చిన ఓట్లు 1.24 శాతం. ఇది బీజేపీ ఘనత.. ఈసారి పొత్తులో ఉన్నారు కాబట్టి కాస్త ఓట్లు పెరగడం.. దాంతో పాటు సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి పొత్తు అనేది ఓ గోల్డెన్‌ చాయిస్.. కానీ ఆ చాయిస్‌ను చాలా లైట్‌గా తీసుకుంటున్నారు ఏపీ కమలనాథులు.

Also Read: అందుకోసమే త్రివేణి సంగమం.. అజెండా అదే..!

నిజానికి టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడమే గొప్ప విషయం.. ఎందుకంటే.. చంద్రబాబు ప్రధాని నరేంద్రమోడీపై ఎన్ని విమర్శలు చేశారు గతంలో.. అంతేందుకు పొత్తుకు కుదిర్చేందుకు రాయబారం నడిపిందే తానని.. చెబుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మోడీపై ఎన్ని విమర్శలు చేయలేదు. ఇవన్నీ మోడీ, అమిత్‌ షాలకు తెలియదా? మర్చిపోయారా? నో.. అలాంటిది జరిగే చాన్సే లేదు. కానీ అయినా పదిమెట్లు దిగొచ్చి ఆ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. ఎలాంటి ఈగో చూపించలేదు. ఎలాంటి హెచ్చులకు పోలేదు. తక్కువ సీట్లైనా రాష్ట్రంలో పార్టీని బతికించాలనుకున్నారు. కానీ లోకల్ లీడర్స్‌ ఓవరాక్షన్‌ మాత్రం తగ్గడం లేదు. అర్థంలేని పంతాలకు పోయి అలకపాన్పు ఎక్కితే.. చివరికి అడ్రస్‌ లేకుండా పోయేది వారు మాత్రమే కాదు. వారిని బతికిస్తున్న బీజేపీ అని తెలుసుకోవడం లేదు. ఇదే కంటిన్యూ అయితే.. ఏపీలో బీజేపీ అడ్రస్ గల్లంతవ్వడం ఖాయమనే ప్రచారం ఇప్పటికే జరుగుతోంది.

నిజాలు మాట్లాడుకుంటే.. ఏపీ బీజేపీ పేరు మనకు న్యూస్‌లో కనిపించేది. పోరాటాల కంటే అలకల విషయంలోనే.. కమలనాథుల అలక.. నేతలు పార్టీని వీడుతారా? ఇవే థంబ్‌నెయిల్స్‌ కనిపిస్తాయి మీకు వార్తల్లో.. ఇకనైనా ఈ పరిస్థితి మారాలన్నా.. కాస్తో కూస్తో సీట్లను గెలవాలన్నా.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలన్నా..సొంత సమస్యలను కొంత మానుకొని.. పార్టీ బాగు కోసం పాటుపడిత కానీ ఫలితం ఉండదు.. లేదంటే.. 2019 రిజల్ట్స్‌ రీపిటయ్యే చాన్సెసే ఎక్కువున్నాయి. ఏపీ బీజేపీ నేతలు వింటున్నారా?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News