Big Stories

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్లో మళ్లీ కేసీఆర్ పేరు.. ఈసారి శిష్యుడే..!

kcr

- Advertisement -

Phone Tapping Case Latest News: ఫోన్‌ ట్యాపింగ్‌ కేస్‌.. ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్.. ఇప్పుడీ కేసులో లింక్స్‌ అన్ని కలిపితే ఇప్పుడు గులాబీ పెద్దకు చిక్కులు తప్పవా? వాళ్లు వీళ్లు కాదు..
అసలు ముద్దాయి మాజీ సీఎం అని రఘునందన్‌ రావు ఎందుకంటున్నారు? అసలు మీరేం చేయలేరన్న కేటీఆర్‌ వ్యాఖ్యల వెనక కాన్ఫిడెన్స్‌ ఏంటి?

- Advertisement -

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. ఎస్సై నుంచి మొదలు పెడితే మాజీ పోలీస్‌ బాస్‌ల వరకు అందరి ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఉందని.. ఇప్పటికే తేలింది. అయితే వీరంతా పాత్రధారులే.. అసలు సూత్రధారులు వేరే ఉన్నారని మనం ఫస్ట్‌ నుంచి చెబుతున్నాం. ఇప్పుడు దీన్ని కన్ఫామ్ చేస్తున్నారు బీజేపీ నేత రఘునందన్‌ రావు..

విన్నారుగా ఆయన డిమాండ్స్‌.. మొదటి ముద్దాయి కేసీఆర్..రెండో ముద్దాయి హరీష్‌రావు.. ఇదే ఆయన చెబుతున్న మాట.. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కంప్లైంట్ చేశారు. ఇప్పుడు బీజేపీ నేత రఘునందన్‌ రావు కూడా ఆయన బాటలోనే నడిచి.. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. నిజానికి రఘునందన్ రావు పోలీసులను ఆశ్రయించారనేది కాస్త ఇంట్రెస్టింగ్ ఇష్యూ.. ఎందుకంటే ఆయన కేవలం పొలిటికల్ లీడర్ మాత్రమే కాదు. ఆయనో అడ్వోకేట్.. కేసులో వివరం.. విషయం లేనిదే ఆయన దిగరు. పక్కా ఆధారాలు లేకుండా ఫిర్యాదు చేసినా దండగే అని ఆయనకు తెలుసు. కానీ ఆయన ముందుకొచ్చి ఫిర్యాదు చేయడం.. ఆరోపణలు చేయడం చూస్తుంటే ఈ కేసులో మరిన్ని సంచలనాలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read:వారే మెట్టు దిగారు.. వీరెందుకిలా? ఏపీ బీజేపీ నేతల తీరు మారదా?

ఇప్పటి వరకు పొలిటిషియన్స్, ఇండస్ట్రియలిస్ట్స్‌ కే ఫోన్ ట్యాపింగ్ పరిమితం అనుకున్నాం.. కానీ రఘునందన్‌ ఓ కొత్త విషయాన్ని చెప్పారు. విషయం చెప్పారనడం కన్నా ఓ బాంబ్‌ పేల్చారని చెప్తే కరెక్టేమో.. ట్యాపింగ్‌ అనేది పొలిటిషియన్స్‌కు మాత్రమే పరిమితం కాదు. న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయంటున్నారు. ఇదే నిజమైతే అధికారులు, అప్పటి ప్రభుత్వ పెద్దలు పీకల్లోతులో ఇరుక్కుపోయినట్టే.. అంతేకాదు పోలీసులు విచారణ సరిగా చేయకపోతే.. కోర్టు మెట్లెక్కడం ఖాయమన్నారు రఘునందన్‌ రావు..

ఒక్కసారి కేసీఆర్‌, హరీష్‌రావు పేర్లతో కేసు రిజిస్టర్‌ అయితే.. కథ ఇక వేరేలా ఉండటం ఖాయం.. ఇప్పటికే SIB మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు బుక్కయ్యారు. రాధాకిషన్ రావు కోసం గాలింపు మొదలయ్యింది..
భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్‌ రావు కటకటాల వెనక్కి వెళ్లారు. మరికొందరు అధికారులను గుర్తించి విచారిస్తున్నారు. ఇప్పటికే కొందరు గులాబీ నేతలను కూడా గుర్తించి నోటీసులను జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు.. మరి ఇప్పుడు రఘునందన్‌ రావు ఫిర్యాదుతో కేసీఆర్‌పై కేసు నమోదవుతుందా? లేదా? అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.
.
ఫోన్ ట్యాపింగ్‌పై రచ్చ రచ్చ అవుతుంటే.. బీఆర్ఎస్ లీడర్స్ మాత్రం ఎదురు దాడి చేయడమే మార్గం అనుకొంటోంది. అందుకే.. మొదట్లో సైలెంట్‌గా ఉన్నవాళ్లంతా.. సడన్‌గా రూట్ మార్చారు. పార్టీ పరువు పోతుండడంతో రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. ట్యాపింగ్ చేశాం.. అయితే ఏంటంట అన్న రేంజ్‌కు కూడా వెళ్లిపోయారు.. కావాలంటే కేటీఆర్ చెప్పిన మాటలు వినండి.

Also read:  రైతుల కష్టాలట! బీఆర్ఎస్ కన్ఫ్యూజన్ గేమ్!

విన్నారుగా.. ఇది కేటీఆర్‌ మాట్లాడిన మాటలు.. ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారట.. అది కూడా ఒకటో.. రెండో చేసి ఉంటారట. అదే పోలీసుల పనట.. కేటీఆర్ గారూ.. పోలీసులు మావోయిస్టులవో, టెర్రరిస్టులవో ఫోన్లు ట్యాప్ చేసి, దాడులు జరగకుండా అడ్డుకుంటే సీన్ మరోలా ఉండేది. జనమంతా శభాష్ అనేవాళ్లు.. కానీ.. ఆ పనిని వదిలేసి పొలిటికల్ లీడర్ల వెంట పడడం వల్లే ఇష్యూ ఇప్పుడు మీ వరకూ వచ్చింది. మీ మాటలు చూస్తుంటే.. అంటే గుమ్మడికాయల దొంగేవరు అంటే భుజాలు తడుముకున్నట్టుగా లేదు సీన్.. ఆరోపణల్లో వస్తున్న ఫోన్లన్ని చేయలేదు కానీ.. ఏదో ఒకటి, రెండు చేసి ఉండొచ్చు.. అని చెప్పకనే చెబుతూ నిజాన్ని మాత్రం ఒప్పెసుకున్నారు కేటీఆర్.. ఆయన అక్కడితో ఆగలేదు.. చేతిలో అధికారం ఉంది కదా.. దమ్ముంటే చర్యలు తీసుకోండి అంటూ సవాల్ విసురుతున్నారు కేటీఆర్..

నిజానికి కేటీఆర్‌ కాన్ఫిడెన్స్‌ వెనక రీజనేంటి? దమ్ముంటే చర్యలు తీసుకోండని ఏ ధైర్యంతో సవాళ్లు విసురుతున్నారు? అన్నది కాస్త ఇంట్రెస్ట్‌గా మారింది. ప్రస్తుతం ట్యాప్‌ చేసిన అధికారులు ఉన్నారు..
కానీ ట్యాప్‌ చేయమని ఆదేశాలిచ్చిన అధికారులు మాత్రం.. ఇండియాలో లేరు.. వేరే దేశాల్లో తలదాచుకుంటున్నారు. వారు ఇండియాకు ఇప్పట్లో వచ్చే సీన్ కనిపించడం లేదు. అదే కేటీఆర్‌కు కాన్ఫిడెన్స్‌కు కారణమా? వారు వచ్చి విచారణ ఎదుర్కొంటేనే.. వారికి అలా చేయమని ఎవరు చెప్పారో తెలుస్తుంది. అలా తెలిస్తేనే.. పోలీసులకు చర్యలు తీసుకునేందుకు అవకాశం వస్తుంది..
అందుకే కేటీఆర్‌ ధైర్యంగా సవాళ్లు విసురుతున్నారా అన్న డౌట్ వస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News