Numerology Financial Discipline| డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని సరైన విధంగా పొదుపు చేయడం కూడా అంతే ముఖ్యం. అయితే కొందరు వ్యక్తులు చిన్న మొత్తాన్ని కూడా జాగ్రత్తగా ఖర్చు చేస్తారని న్యూమరాలజీ చెబుతోంది. ఒక ప్రత్యేక మూల అంకం ఉన్నవారిని ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ కలిగిన వారని జ్యోతిష్య వివరిస్తోంది. వీరు సంపాదనతో పాటు పొదుపు, భవిష్యత్ ప్రణాళికలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు.
న్యూమరాలజీ ప్రకారం 4, 13, 22 లేదా 31 తేదీల్లో పుట్టినవారి మూల అంకం 4గా పరిగణిస్తారు. న్యూమరాలజీలో ఈ సంఖ్యను క్రమశిక్షణ, బాధ్యత, ఆచరణాత్మక ఆలోచనలతో అనుసంధానిస్తారు. ఈ మూల అంకానికి రాహువు అధిపతి. అందుకే వీరు ఆర్థిక నిర్ణయాల్లో తొందరపడరు.
మూల అంకం 4 ఉన్నవారు అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు దాని అవసరాన్ని పరిశీలిస్తారు. ఖరీదైన గ్యాడ్జెట్లు, బ్రాండెడ్ వస్తువుల విషయంలో కూడా వీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇతరులను ఆకట్టుకోవడానికి డబ్బు ఖర్చు చేయడం వీరికి అంతగా నచ్చదు.
చిన్న మొత్తంలో చేసే పొదుపును కూడా వీరు ప్రాధాన్యం ఇస్తారు. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేకంగా డబ్బు దాచుకునే అలవాటు వీరికి ఉంటుంది.ఈ విధమైన అలవాట్లతో ఎప్పుడూ బడ్జెట్ కంట్రోల్ చేస్తూ ఉంటారు.
పెట్టుబడుల విషయంలో మూల అంకం 4 వ్యక్తులు జాగ్రత్తగా వ్యవహరిస్తారు. త్వరగా భారీ లాభాలు పొందాలనే ఆశతో అధిక రిస్క్ తీసుకోరు.
ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బంగారం, ఆస్తులు వంటి మార్గాలను కొందరు ఇష్టపడతారు. దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం వీరి లక్షణంగా భావిస్తారు.
మూల అంకం 4ను సహనం, పట్టుదల, క్రమమైన ప్రయత్నాలతో కూడా అనుసంధానిస్తారు. ఈ సంఖ్య ఉన్నవారు సులభంగా డబ్బు సంపాదించే మార్గాల కంటే కష్టాన్ని నమ్ముతారు. వృత్తిలో స్థిరంగా ఎదగడానికి ప్రయత్నిస్తారు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను ఏర్పరచుకుని ముందుకు సాగుతారు.
Also Read: తప్పు నాది కాదు నీది.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ తన తప్పుని అంగీకరించరు
భవిష్యత్తులో ఎదురయ్యే అవసరాల కోసం ముందుగానే డబ్బు సిద్ధం చేసుకోవడం వీరికి అలవాటు. రిటైర్‌మెంట్, అత్యవసర ఖర్చులు, ఇతర పెద్ద బాధ్యతల కోసం పొదుపు చేయవచ్చని నమ్ముతారు. తక్షణ ఆనందం కంటే ఆర్థిక స్థిరత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
అయితే న్యూమరాలజీ ఒక సామాజిక విశ్వాస వ్యవస్థ మాత్రమే, శాస్త్రీయంగా నిరూపితమైన ఆర్థిక విధానం కాదు. వ్యక్తిగత ఆర్థిక అలవాట్లు ఆదాయం, పరిస్థితులు, జ్ఞానం, లక్ష్యాలపై ఆధారపడి ఉంటాయి. పెట్టుబడులకు ముందు అర్హత కలిగిన ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.
Also Read: ఇండియాలో వారసత్వ ఆస్తుల బదిలీ అంత ఈజీ కాదు.. అన్నీ సవ్యంగా ఉన్నా లంచాలు ఇవ్వాల్సిందే
గమనిక : ఈ సమాచారం సాంప్రదాయ న్యూమరాలజీ నమ్మకాల ఆధారంగా అందించబడింది. బిగ్ టీవీ ఈ విషయాలను ధృవీకరించదు.
ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి.