E-Paper
Advertisement

ఇండస్ట్రీలో నటుడిగా 41 ఏళ్లు.. ఇంత చెండాలం చూడలేదు.. ‘జబర్దస్త్‌’లో బాబు మోహన్ కామెంట్స్!

ఇండస్ట్రీలో నటుడిగా 41 ఏళ్లు.. ఇంత చెండాలం చూడలేదు.. ‘జబర్దస్త్‌’లో బాబు మోహన్ కామెంట్స్!
Advertisement

Jabardasth: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాస్యనటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న బాబు మోహన్ (Babu Mohan) ఇండస్ట్రీలో 41 ఏళ్లుగా నిర్విరామంగా ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్నారు. అలాంటి ఈయన తాజాగా జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమంలో ఒక స్కిట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇన్నేళ్లలో ఇంత చండాలం ఇప్పటివరకు చూడలేదు అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

74 ఏళ్ల వయసులో.. 41 ఏళ్ల ఇండస్ట్రీ అనుభవంలో..

సీనియర్ నటులుగా 74 ఏళ్ల వయసులో కూడా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ అందరిని ఆకట్టుకుంటున్న కస్తూరి బాబూ మోహన్ రావు ఉద్యమం, చిరునవ్వుల వరమిస్తావా, ముగ్గురు మొనగాళ్లు, చిట్టెమ్మ మొగుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కోటా శ్రీనివాసరావు , బాబు మోహన్ కాంబినేషన్లో వచ్చే ఎన్నో సినిమాలు.. వీరి కాంబినేషన్ తోనే సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాయి. అలాంటి బాబు మోహన్ ఇప్పుడు వరుస చిత్రాలలో నటిస్తూ ఆకట్టుకుంటూనే.. మరొకవైపు బుల్లితెర షోలలో కూడా సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోని తాజాగా జబర్దస్త్ లో పాల్గొనగా.. లేటెస్ట్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోని నిర్వహకులు తాజాగా విడుదల చేశారు.అందులో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో వైరల్..

Advertisement

‘శ్రీనివాస మంగాపురం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో జయకృష్ణ (Jaya Krishna), హీరోయిన్ రషా తడానీ (Rasha Thadani) గెస్ట్లుగా వచ్చారు. ఇకపోతే కమెడియన్స్ తమ స్కిట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇందులో రోహిణి స్కిట్ బాగా ఆకట్టుకుంది. పుష్ప మేనరిజం తో ఆమె చేసిన పర్ఫామెన్స్ ఎపిసోడ్ కి హైలెట్గా నిలవనుంది అని చెప్పవచ్చు. ఇక రోహిణి స్కిట్ తర్వాత రష్మీ, బాబు మోహన్ ఒక స్కిట్ చేశారు. రష్మి మాట్లాడుతూ.. “అప్పుడెప్పుడో నేను మీకు ప్రపోజ్ చేస్తే మీరు పట్టించుకోలేదు. వేరే వాళ్లను పెళ్లి చేసుకున్నారు. అంగట్లో దొరికినట్టుగా అని డైలాగ్ చెప్తుండగానే.. వెనకనుంచి ప్రాంప్టర్ వచ్చి ఆయనకు డైలాగ్ అందించారు. హీరో గెటప్ వేసిన బాబు మోహన్ కథ ఏంటో చెప్పు అని అడగగా.. రాకెట్ రాఘవ స్క్రిప్ట్ చెబుతూ..” అనగనగా ఒక రాజుగారు ఉన్నారు గురువుగారు.. ఆ రాజు గారికి 7 మంది కొడుకులు ఉన్నారు.. దానిని ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ మీద చూపించబోతున్నాం” అంటూ తన కథ చెబుతారు..

ALSO READ:ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన ఓ సుకుమారి.. ఎక్కడ చూడొచ్చంటే?

ఇంత చండాలం ఎప్పుడూ చూడలేదు – బాబు మోహన్

Advertisement

ఇక స్కిట్లోకి వెళ్తే.. లేడీ గెటప్ లో ఉన్న కమెడియన్.. బోర్ కొడుతోంది కథ చెప్పండి అంటూ బాబూ మోహన్ కి వైఫ్ క్యారెక్టర్ చేసిన కమెడియన్ డైలాగ్ చెప్తాడు. అయితే బాబు మోహన్ అసిస్టెంట్.. గురువుగారు రాత్రి 10 అవుతోంది పడుకుందాం పదండి అని చెబితే.. నా పెళ్ళాం అక్కడుందయ్యా అంటూ బాబు మోహన్ కామెంట్ చేశాడు.. ఇక బాబు మోహన్ మాట్లాడుతూ నాగబాబుతో..” అన్నా.. మీరు ఉండగా ఇంత ఘోరాలు జరుగుతున్నాయా అన్నయ్యా.. రైటర్ ప్రాంప్టింగ్.. 41 సంవత్సరాలు పూర్తయింది సినీ ఇండస్ట్రీలోకి వచ్చి… ఇంత చండాలం ఎప్పుడూ చూడలేదు” అంటూ బాబు మోహన్ కామెంట్ చేశారు. ఇక జడ్జ్ నాగబాబు మాట్లాడుతూ.. మీరు ఆ కాలంలో చేసినట్టు యాక్టింగ్ చేసి ఉంటే ఇప్పుడు ఇంత నవ్వు వచ్చుండేది కాదు చాలా అద్భుతం అంటూ కామెంట్ చేశారు. మొత్తానికైతే సరదాగా సాగిన ఈ స్కిట్ పూర్తి ఎపిసోడ్ చూడాలి అంటే ఆగస్టు 9న ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు ఎదురు చూడాల్సిందే.

Related News

Podarillu Today Episode : కేశవకు జాగారం.. మాధవ్ కు వార్నింగ్.. నిజం చక్రికీ తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: పార్వతిని చంపేందుకు ప్లాన్.. కిడ్నాపర్స్ ఎంట్రీ.. పల్లవి దొరుకుతుందా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనాపై చింతామణి రివేంజ్.. పాపం..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ విడిపోతారా..? రామరాజు నెక్స్ట్ ఏంటి..? శ్రీవల్లి అవుట్..

Sunday Movies in Tv : ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యొద్దు..

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Big Stories

Advertisement
×