E-Paper
Advertisement

స్కూల్ టీచర్ నుంచి డిటెక్టివ్‌గా… ట్రిపుల్ మర్డర్, ట్రెజర్ హంట్, లవ్ ట్రయాంగిల్ తో అదిరిపోయే డార్క్ కామెడీ సిరీస్

స్కూల్ టీచర్ నుంచి డిటెక్టివ్‌గా… ట్రిపుల్ మర్డర్, ట్రెజర్ హంట్, లవ్ ట్రయాంగిల్ తో అదిరిపోయే డార్క్ కామెడీ సిరీస్
Advertisement

Crime Mystery Thriller: క్రైమ్ థ్రిల్లర్ అంటే సాధారణంగా సీరియస్ కథ, టెన్షన్, మర్డర్ మిస్టరీలే గుర్తుకొస్తాయి. కానీ అదే కథలో డార్క్ కామెడీ, సస్పెన్స్, రొమాన్స్, ట్రెజర్ హంట్ అన్నీ కలిస్తే ఎలా ఉంటుంది ? అలాంటి అరుదైన మిక్స్‌తో రూపొందిన అమెరికన్ వెబ్ సిరీస్ ‘Diarra From Detroit’ Season 2. తాజాగా ఈ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి సీజన్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సిరీస్, రెండో సీజన్‌లో మరింత పెద్ద మిస్టరీ, ఊహించని ట్విస్టులు, కడుపుబ్బా నవ్వించే డార్క్ కామెడీతో ముందుకొచ్చింది. డెట్రాయిట్ నగర నేపథ్యంలోని ఈ కథ ప్రతి ఎపిసోడ్‌లో కొత్త ప్రశ్నలు లేవనెత్తుతూ, చివరి వరకు సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తుంది. క్రైమ్ డ్రామాలను విభిన్నంగా చూపించే ప్రయత్నమే ఈ సిరీస్ ప్రత్యేకత.

కథలోకి వెళ్తే…

డియారా బ్రిక్‌ల్యాండ్ అనే స్కూల్ టీచర్ విడాకుల తర్వాత ఒంటరిగా జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భావించి టిండర్ యాప్ ద్వారా ఓ వ్యక్తిని పరిచయం చేసుకుంటుంది. మొదటి డేట్ బాగానే ముగిసినా, ఆ వ్యక్తి మరుసటి రోజు నుంచి పూర్తిగా కనిపించకుండా పోతాడు. ఫోన్ స్విచ్ ఆఫ్, సోషల్ మీడియా ఖాళీ, ఎక్కడా ఎలాంటి సమాచారం ఉండదు. దీంతో అందరూ అతను తనను పట్టించుకోలేదని భావించినా, డియారాకు మాత్రం దీని వెనుక ఏదో పెద్ద రహస్యం దాగి ఉందనే అనుమానం కలుగుతుంది.

Advertisement

దీంతో ఆమె స్వయంగా దర్యాప్తు ప్రారంభిస్తుంది. ఒక చిన్న క్లూను వెంబడిస్తూ ముందుకు సాగుతుండగా, ఆమె ఊహించని సంఘటనల్లో చిక్కుకుంటుంది. ఈసారి కథ కేవలం కనిపించకుండా పోయిన వ్యక్తి గురించే కాదు. ఒక పాత ఫర్నిచర్‌ను తిరిగి తెచ్చే సాధారణ మిషన్ అనుకోకుండా ట్రిపుల్ మర్డర్ కేసుగా మారిపోతుంది. ఆ కేసు వెనుక దాగి ఉన్న రహస్యాలు ఒక్కొక్కటిగా బయట పడుతుండగా, నగరమంతా గుప్తనిధి కోసం జరుగుతున్న అన్వేషణ కూడా కథలో చేరుతుంది.

ఇక అండర్‌వరల్డ్ గ్యాంగులు, డబ్బు కోసం ప్రాణాలు తీసే నేరస్తులు, డియారా వ్యక్తిగత జీవితంలో ఏర్పడే లవ్ ట్రయాంగిల్ కథను మరింత క్లిష్టంగా మారుస్తాయి. ఒకవైపు హత్యల మిస్టరీని ఛేదించే ప్రయత్నం, మరోవైపు తన ప్రాణాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి డియారాను కొత్త సవాళ్లలోకి నెట్టేస్తుంది. ప్రతి ఎపిసోడ్ చివర్లో వచ్చే ట్విస్టులు తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేని విధంగా ఉంటాయి. చివరికి మాయమైన వ్యక్తికి ఏమైంది ? ట్రిపుల్ మర్డర్ వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి ? గుప్తనిధి నిజంగానే ఉందా ? డియారా వెతుకుతున్న నిజం చివరకు బయట పడుతుందా? అనే ప్రశ్నలకు సమాధానాలు మాత్రం సిరీస్ చూస్తేనే తెలుస్తాయి.

తెలుగులో లేదు

Advertisement

ఈ సిరీస్‌కు అతిపెద్ద బలం డార్క్ కామెడీ. సీరియస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మధ్యలో వచ్చే కామెడీ సన్నివేశాలు కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. డియారా కిల్‌పాట్రిక్ నటనతో పాటు ఆమె రాసిన పాత్ర కూడా చాలా సహజంగా ఉంటుంది. మోరిస్ చెస్ట్‌నట్, ఫైలీషియా రషాద్, డోమినిక్ పెర్రీ కీలక పాత్రల్లో నటించారు. ప్రతి ఎపిసోడ్‌లో సస్పెన్స్‌తో పాటు వినోదం కూడా సమానంగా ఉండటం ఈ సిరీస్లో హైలెట్. ప్రస్తుతం ఈ సిరీస్ Paramount+లో ఇంగ్లీష్ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 8 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సీజన్‌లో మొదటి రెండు ఎపిసోడ్లు ఇప్పటికే విడుదలయ్యాయి. మిగిలిన ఎపిసోడ్లు ప్రతి బుధవారం విడుదల అవుతున్నాయి. క్రైమ్ మిస్టరీలు, డార్క్ కామెడీ, ఊహించని ట్విస్టులు ఉండే సిరీస్ కోసం వెతుకుతుంటే ఇది మీ కోసమే.

Read Also: గ్లాడియేటర్ స్టార్ రస్సెల్ క్రో కొత్త మూవీ ‘బీస్ట్’… తెలుగు డబ్బింగ్‌తో ఓటీటీలో స్ట్రీమింగ్

Tags

Related News

18 ఏళ్లుగా ఒక్క బిడ్డా పుట్టలేదు… 2027లో ప్రపంచం ఎలా ఉంటుందో చూపించిన కల్ట్ క్లాసిక్

స్కూల్లోనే పిల్లల్ని చంపి తినే టీచర్… స్పైన్ చిల్లింగ్ హర్రర్ థ్రిల్లర్

టీవీని పక్కన పెట్టేసిన జెన్‌జీ.. అంతా ఓటీటీ మాయే!

రూపాయి ఖర్చు లేకుండా చూడొచ్చు… ఓటీటీ ఫ్రీ క్యాటగిరీలో దుమ్మురేపుతున్న 7 వెబ్ సిరీస్‌లు

10 కోట్ల బ్యాగ్‌ దొరకడంతో మొదలయ్యే గందరగోళం… కితకితలు పెట్టే ఇమ్మిగ్రెంట్స్ కష్టాలు

కిడ్నాప్ వెనుక క్రిమినల్ నెట్‌వర్క్… కూతురి కోసం బ్లడీ బ్లడ్ బాత్

ఫోక్ క్వీన్ నాగదుర్గకు ఓటీటీలో అదిరిపోయే హిట్!

Big Stories

Advertisement
×