BigTV English

I.N.D.I.A Bloc : ఇండియా కూటమికి అన్ని సీట్లెలా వచ్చాయి ? ఇది ఎవరి పతనానికి సంకేతం?

I.N.D.I.A Bloc : ఇండియా కూటమికి అన్ని సీట్లెలా వచ్చాయి ? ఇది ఎవరి పతనానికి సంకేతం?

I.N.D.I.A Bloc Winning Seats in Loksabha Elections : ఇండియా బ్లాక్‌కు ఈ ఎన్నికల్లో వచ్చే సీట్లు ఎన్ని? ఈ ప్రశ్నకు అన్ని ఎగ్జిట్ పోల్స్‌ 200కు లోపే అని తేల్చి చెప్పాయి. ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా 200 దాటుతాయని చెప్పలేదు. బట్ అందరి అంచనాలను తలకిందులు చేసింది ఇండియా కూటమి. ఇంతకీ ఈ స్థాయిలో సీట్లు దక్కడం వెనక రీజన్సేంటి ? కూటమి సీట్ల సంఖ్య పెరగడం దేనికి సంకేతం ?


ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్. సింపుల్‌గా ఇండియా కూటమి. ఈ కూటమి గెలిచిన సీట్ల సంఖ్య 234. అంటే మ్యాజిక్ ఫిగర్‌కు అత్యంత దగ్గరగా వచ్చింది కూటమి. దీనిని ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే దేశ వ్యాప్తంగా మోడీ మ్యాజిక్ తగ్గింది అని చెప్పకనే చెబుతోంది ఈ ఫలితం. ఇందులో కాంగ్రెస్‌ గెలిచిన సీట్ల సంఖ్య 99. ఆ తర్వాత యూపీలో బీజేపీ నడ్డి విరిచి సమాజ్‌వాదీ పార్టీ ఏకంగా 37 సీట్లను గెలుచుకుంది. ఆ తర్వాత తృణమూల్ 29 సీట్లు.. డీఎంకే 22 సీట్లతో ఉన్నాయి. అంటే కూటమిలో ఉన్న ప్రతి పార్టీ బలపడింది.

2014లో కాంగ్రెస్‌ గెలిచిన సీట్లు 52 మాత్రమే. కానీ ఇప్పుడు ఆ నంబర్‌ ఆల్‌మోస్ట్‌ డబుల్ అయ్యింది. అంటే కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లోనే కాదు. కాంగ్రేసేతర పాలిత రాష్ట్రాల్లో కూడా కూటమికి అవకాశాలు మెరుగయ్యాయి. అయోధ్య, పాకిస్థాన్, చైనా పేరుతో చేసిన రాజకీయం అంతగా ప్రభావితం చూపలేదు. పేదరికం, నిరుద్యోగం, రిజర్వేషన్ల రద్దు, సామాజిక, ఆర్థిక అంతరాలు పెరుగుతున్నాయంటూ కూటమి చేసిన ప్రచారం ఫలితం చూపించింది. ఎట్ ది సేమ్ టైమ్.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్ట్రాటజీని ఫాలో అవుతూ.. బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకు పని చేశారు కూటమి నేతలు.


Also Read : బీజేపీకి భారీ షాక్.. బిగ్ ఆఫర్ ప్రకటించిన ఖర్గే

యూపీపై ఇండియా కూటమి మేజర్‌గా ఫోకస్ చేసింది. అవసరమైతే తమకు ఒక్క సీటు ఇవ్వకపోయినా.. మద్ధతించేందుకు కాంగ్రెస్‌ రెడీ అయ్యింది. తమిళనాడులో డీఎంకేకు ఎదురులేకపోవడం కలిసి వచ్చింది. కేరళలో బీజేపీ బలహీనంగా ఉండటం కూడా పాజిటివ్‌ అంశమే అని చెప్పాలి. మహారాష్ట్రలో కూడా ఎన్డీఏను మట్టికరిపించింది ఇండియా కూటమి. అంతేకాదు బీజేపీలో చేరికలు.. ఈడీ, సీబీఐ రెయిడ్స్.. ఎలక్టోరల్ బాండ్స్.. కొంతమంది వ్యాపారవేత్తలకు మాత్రమే పెద్ద పీట వేయడం. ఇలా ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాయి కూటమి నేతలు. దీంతో ప్రజల ఆలోచన విధానం మారింది. అబ్‌ కీ బార్ చార్‌ సౌ బార్.. అంటూ మోడీ చేసిన ప్రచారం ప్రచారానికే పరిమితం చేయడంలో సక్సెస్ అయ్యింది ఇండియా కూటమి.

మరి కూటమి మెజారిటీ మార్క్‌ను ఎందుకు చేరుకోలేకపోయింది.. ? దీనికి ఆన్సర్ సింపుల్.. సరైన ఐక్యత లేకపోవడం. దీనికి పూర్తిగా కాకపోయినా.. కొంచమైనా ఇద్దరిని కారణంగా చెప్పుకోవచ్చు. వారిద్దరు మరేవరో కాదు.. ఒకరు అరవింద్ కేజ్రీవాల్.. రెండో పర్సన్ మమతా బెనర్జీ.. వీరిద్దరు అందితే కాళ్లు.. లేకపోతే జుట్టు.. అన్నట్టుగా వ్యవహరించారని చెప్పవచ్చు. ఢిల్లీలో ఉన్న ఏడు లోక్‌సభ స్థానాలను క్లీన్ స్వీప్‌ చేసింది బీజేపీ. అంటే కేజ్రీవాల్ మ్యానియా అస్సలు పనిచేయలేదని చెప్పవచ్చు. లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన కేజ్రీవాల్.. ఆ సింపతి ఫుల్‌గా వర్కౌట్ అవుతుందని ఆశించి భంగపడ్డారు. తన బరువు దగ్గరి నుంచి మొదలు పెడితే.. ప్రచారం మొత్తాన్ని తన చుట్టూనే తిప్పారు. కానీ ప్రజలు దాన్ని అస్సలు రీసివ్ చేసుకోలేదని క్లియర్ కట్‌గా అర్థమవుతోంది. ఈ రిజల్ట్ ఆయనకు ఓ కనువిప్పు అనే చెప్పాలి. ఎన్నికలకు ముందు వరకు కేజ్రీవాల్ తనను తాను చాలా గొప్పగా ఊహించుకున్నట్టు కనిపించింది. కూటమికి నా అవసరం ఉంది తప్ప.. నా అవసరం కూటమికి లేదు. అన్నట్టుగా ఉండేది.. బట్ ఆ అంచనా తప్పింది.

Also Read : అవమానాలకు ఎదురునిలిచి దృఢంగా నిలబడ్డావ్‌: ప్రియాంక గాంధీ ఎమోషనల్‌ పోస్ట్‌

సెకండ్.. మమతా బెనర్జీ.. బెంగాల్‌ నా గడ్డ.. అడ్డా అన్నట్టుగా వ్యవహరించారు దీదీ. అంతేకాదు.. ఇక్కడ సీట్‌ షేరింగ్‌కు అస్సలు అంగీకరించలేదు. దీంతో గట్టి దెబ్బ పడింది.. మొత్తం 42 సీట్లలో కూటమి 30 సీట్లకే పరిమితమైంది. నెక్ట్స్‌ గట్టిగా దెబ్బ పడింది. బిహార్‌లో ఈ రాష్ట్రంలో కూడా NDA కూటమి హవా కొనసాగింది. మెజార్టీ సీట్లు NDA ఎగరేసుకుపోయింది. దీంతో కూటమికి కోలుకోలేని దెబ్బ పడింది.

అనుకున్నది సాధించలేకపోయినా.. అధికారం చేపట్టకపోయినా.. ఇండియా కూటమి ఈ ఎన్నికల్లో సాధించిన సీట్లు చెప్పకనే చెబుతుంది. అదేంటంటే.. దేశంలో అంతా బీజేపీ మ్యానియా లేదు.. మోడీ మ్యాజిక్ లేదు. సో మరికాస్త కష్టపడితే.. ఇండియా కూటమి అధికారం చేపట్టే అవకాశం లేకపోలేదు. అందుకే అంటారు నిలిచిన ప్రతి బరిలో గెలవడం మాత్రమే ముఖ్యం కాదు. బరిలో ఉండటం ముఖ్యం. అందుకే పదేళ్లుగా అధికారంలో లేకపోయినా.. కాంగ్రెస్‌ ప్రజల నుంచి దూరం కాలేదు. పోరును ఆపలేదు.. దానికి రిజల్టే.. ఈ రిజల్ట్స్.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×