BigTV English

India Warning To Pakistan: పాక్ తడిసిపోయినట్లే.. ఇక POK మనదే? అల్టిమేటం వార్నింగ్

India Warning To Pakistan: పాక్ తడిసిపోయినట్లే.. ఇక POK మనదే? అల్టిమేటం వార్నింగ్

డ్రామాలు ఆడే దాయాదికి ఘాటు కౌంటర్లు

కొన్ని సమస్యలకు కాలమే పరిష్కారం, సమాధానం చెబుతుంది అంటారు కదా.. ఇప్పుడు ఆ టైమ్ వచ్చేసింది. మాట మాట్లాడిదే కశ్మీర్ వివాదాస్పద ప్రాంతంగా చెప్పే పాకిస్తాన్ కు అసలు కౌంటర్ డోస్ పెంచుతోంది భారత్. కశ్మీర్ లో కొంత భాగాన్ని ఆక్రమించుకుని, దాన్ని తన అధీనంలో ఉంచుకుని పైకి ఏమీ తెలియనట్లు, సమస్య అంతా కశ్మీర్ దగ్గరే ఉన్నట్లు డ్రామాలు ఆడే దాయాదికి అసలు సిసలైన పవర్ పంచ్ చూపుతోంది భారత్. ఇన్నాళ్లూ ఏదైతే పక్కన పెట్టిందో.. దాన్నే ముందుకు తీస్తోంది భారత్. ఇక లైట్ తీసుకుంటే కుదరదంటూ వరుసగా అంతర్జాతీయంగా ఏ వేదికపైనైనా pok ఇష్యూనే ప్రస్తావిస్తోంది ఇండియా.


ఒక్క డాలర్ తో పాక్ రుపాయి 280

పాకిస్తాన్ ఒకటంటే పది డైలాగ్ లు భారత్ నుంచి వచ్చి పడుతున్నాయి. అసలే అంతర్గత సమస్యలు, ఉగ్రవాదం, ఒక్క డాలర్ తో పోలిస్తే పాక్ రూపాయి 280గా ఉంది. అధిక ద్రవ్యోల్బణం, ధరలు ఇలా ఒక్కటేమిటి అన్నీ సమస్యలే. కానీ భారత్ పై నోరు పారేసుకోవడంలో మాత్రం దాయాది ముందుంటోంది. కానీ పాక్ కు పవర్ పంచ్ ఇచ్చేలా పెద్ద స్కెచ్చే వేస్తోంది భారత్. మాట మాట్లాడితే కశ్మీర్ కు ఇచ్చిన హామీలు, అక్కడి ప్రజాస్వామ్యం, మానవ హక్కుల ఉల్లంఘనలు అంటూ మాట్లాడే దాయాదికి పీఓకే టాపిక్ తో చెక్ పెడుతోంది. కశ్మీర్ లో కొంత భాగాన్ని పాక్ ఎందుకు ఆక్రమించుకుంది.. ప్రపంచ దేశాలు దీనిపై నోరు ఎందుకు మెదపట్లేదు.. UN సహా కొన్ని దేశాల ద్వంద్వ వైఖరిపైనా గట్టిగానే నిలదీస్తోంది భారత్.

పాక్ POK ఖాళీ చేస్తే సమస్యలకు పరిష్కారం-భారత్

కశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపాలని అడుగుతున్న దాయాదికి పీఓకే గురించి క్లాస్ తీసుకుంటోంది భారత్. అది ఖాళీ చేస్తేనే ఈ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారాలు దొరుకుతాయంటున్నారు విదేశాంగ మంత్రి జైశంకర్, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. పరిస్థితి చూస్తుంటే పీఓకేపై పెద్ద స్కెచ్చే కనిపిస్తోంది. రెండు నాల్కల ధోరణితో ఉండే దేశాలకు చెక్ పెట్టడం, సరైన పరిష్కార మార్గం చూపని UN తీరును ఎండగట్టడం, దౌత్య మార్గాల్లో చర్చలకు తావు లేకుండా చేస్తున్న పరిస్థితిని దారిలోకి తేవడం ఇవన్నీ టార్గెట్ చేసుకుంటున్నారు.

లెక్స్ ఫ్రిడ్‌మాన్‌ ఇంటర్వ్యూలో మోడీ కీ కామెంట్స్

పాకిస్తాన్ ఒక మాట మాట్లాడితే.. భారత్ నుంచి పది కౌంటర్లు పడుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన పాడ్‌కాస్టర్, AI రీసెర్చ్ పర్సన్ లెక్స్ ఫ్రిడ్‌మాన్‌ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ భారత్ పాక్ సంబంధాలపై చాలానే మాట్లాడారు. సమస్యలన్నీ సైద్ధాంతిక విబేధాల వల్ల కావని, పొరుగువారి ఉగ్రవాద మనస్తత్వమే కారణమన్నారు. పాకిస్తాన్ ప్రపంచ అశాంతికి కేంద్రంగా మారిందని, ఇది భారత్‌ను మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచాన్ని ఎఫెక్ట్ చేస్తోందని గుర్తు చేశారు.

శాంతికోసం లాహోర్ లో పర్యటించానన్న ప్రధాని

ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా, ఆ మూలాలు పాక్ లోనే బయటపడుతున్నాయని చెబుతూ సెప్టెంబర్ 11 దాడులను ప్రస్తావించారు. ఆ ఎటాక్స్ ప్రధాన సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ లో ఆశ్రయం పొందుతూ దొరికిపోయాడన్నారు. స్టేట్ స్పాన్సర్ టెర్రరిజంతో పాకిస్తాన్ కు ఏం ఉపయోగమో అర్థంకాని విషయమన్నారు. అంతే కాదు తాను శాంతి కోసం 2015లో లాహోర్ లో పర్యటించానని గుర్తు చేశారు. పాకిస్తాన్ ప్రజలు కూడా శాంతిని కోరుకుంటున్నారని, వారు కూడా సంఘర్షణ, అశాంతి, ఉగ్రవాద చర్యలతో అలసిపోయారన్నారు మోడీ.

POK గురించి మాట్లాడితే కశ్మీర్ పై పాక్ కామెంట్స్

పాకిస్తాన్ కు మంచి బుద్ధులు చెప్పే ప్రయత్నం మోడీ చేస్తే… దాయాది మాత్రం మరోసారి అక్కసు వెళ్లగక్కింది. కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారన్నది. ఒకటి మాట్లాడితే మరొకటి తెరపైకి తెచ్చి మరోసారి తన జిత్తులమారి బుద్ధి బయటపెట్టుకుంది పాకిస్తాన్. కానీ దాయాది ఒకటి మాట్లాడితే భారత్ పది కౌంటర్లు ఇస్తోంది.

పాకిస్తాన్ మారాలని మంచిగా చెబితే రివర్స్ కౌంటర్

పాకిస్తాన్ మారాలి.. అని మంచిగా ప్రధాని మోడీ చెబుతుంటే.. దాయాది మాత్రం కశ్మీర్ ఇష్యూను ప్రస్తావించి.. అదొక పరిష్కారం కాని వివాదం అంటూ మాట్లాడింది. ఐక్యరాజ్యసమితికి, పాకిస్తాన్ ప్రజలకు, కాశ్మీరీ జనానికి భారత్ హామీలు ఇచ్చి 7 దశాబ్దాలైనా.. కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా పక్కనపెట్టేశారంటోంది. అయితే దీనిపై భారత విదేశాంగ శాఖ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. సీమాంతర ఉగ్రవాదానికి స్పాన్సరర్ పాక్ అని అభివర్ణించింది. ఈ ప్రాంతంలో శాంతి, భద్రతకు అతిపెద్ద అడ్డంకి దాయాదే అన్నది. అబద్ధాలను వ్యాప్తి చేయడానికి బదులుగా, పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా, బలవంతంగా తన ఆక్రమణలో ఉంచుకున్న భారత భూభాగాన్ని ఖాళీ చేయాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ అంటోంది.

POK ఇష్యూనే హైలెట్ చేస్తున్న విదేశాంగమంత్రి జైశంకర్

అంతకు ముందు కేంద్రవిదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా POK విషయాన్నే హైలెట్ చేశారు. మార్చి 18న జరిగిన రైసినా డైలాగ్ సమ్మిట్ లో కశ్మీర్ అంశంపై, POKపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్య సమితిపైనా ఆగ్రహం వ్యక్తంచేశారు. కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్య సమితిని ఆశ్రయిస్తే.. అప్పుడు వారు పాక్‌ దురాక్రమణను రెండు దేశాల వివాదంగా మార్చేశారన్నారు. అందులో పలు విదేశాల పాత్ర కూడా ఉందన్నారు. కశ్మీర్ ఇష్యూను యూకే, కెనడా, బెల్జియం, ఆస్ట్రేలియా, యూఎస్‌ఏ డైవర్ట్ చేయడంలో కీలకంగా పని చేశాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో భారత్‌ ఈ సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకోవడం క్లిష్టంగా మారిందన్న విషయాన్ని ప్రస్తావించారు.

ఆర్టికల్ 370 రద్దు, సామాజిక న్యాయం పునరుద్ధరణ

వాస్తవానికి కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించడం ముఖ్యమైన ముందడుగుగా చెబుతూనే.. కాశ్మీర్‌లో ఆర్థిక కార్యకలాపాలు, సామాజిక న్యాయాన్ని పునరుద్ధరించడం, ఎన్నికలు నిర్వహించడం .. ఇందులో ఎక్కువ ఓటింగ్ నమోదవడం ఇవన్నీ కీలకంగా మారాయి. ఇంకోవైపు కశ్మీర్ లో పాక్ ఆక్రమించిన భాగాన్ని తిరిగి ఇస్తేనే ఈ సమస్యలన్నిటికీ సంపూర్ణ పరిష్కారం దొరుకుతుందన్నారు. అంతకు ముందు లండన్ లో జరిగిన ఓ సమ్మిట్ లోనూ జైశంకర్ ఇదే మాట మాట్లాడారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమన్నారు. దేశంలోని ప్రతి పొలిటికల్ పార్టీ POK భారత్ కు తిరిగి వచ్చేలా చూసుకోవడానికి కట్టుబడి ఉండాలన్నారు.

పాక్ టెర్రర్ క్యాంప్స్ నిర్వహిస్తోందంటూ ఫైర్

ఆర్టికల్ 370 పై సరైన నిర్ణయం తీసుకోవడంతోనే POK సమస్య జనం ముందుకు వచ్చిందని గుర్తు చేస్తున్నారు. లేకపోతే POK అన్న దాన్ని పూర్తిగా మర్చిపోయేలా చేశారన్నారు. POK భారత్ లో చాలా వరకు భాగమని భారత పార్లమెంట్ తీర్మానం ఉందన్నారు జైశంకర్. స్వాతంత్ర్య వచ్చిన తొలినాళ్లలో ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని పాక్ కు భారత్ చెప్పకపోవడంతోనే ఈ పరిస్థితి కంటిన్యూ అయిందన్నారు. కానీ ఇకపై సీన్ అలాగే ఉండబోదని కూడా చెప్పేస్తున్నారు.

పాకిస్తాన్ కు టన్నుల కొద్దీ భయం చూపించబోతున్నారా?

సో ఇప్పుడు జైశంకర్ అయినా కేంద్ర ప్రభుత్వమైనా చెబుతున్నదేంటంటే.. కాశ్మీర్‌లో ఎక్కువ భాగాన్ని పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిందన్న విషయాన్ని ప్రపంచదేశాలకు గుర్తు చేస్తున్నారు. మాట మాట్లాడితే కశ్మీర్ గురించి మాట్లాడుతున్న పాక్ తీరును ఎండగడుతున్నారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ లేకుండా జమ్మూకశ్మీర్‌ అసంపూర్ణమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా ఇటీవలి కాలంలో టోన్ పెంచుతూ మాట్లాడుతున్నారు. దాయాది అక్కడ టెర్రర్ క్యాంప్స్ నడిపిస్తోందన్నారు. పాకిస్థాన్‌కు పీవోకే విదేశీ భూభాగం అవుతుందే తప్ప మరొకటి కాదని గుర్తు చేస్తున్నారు. సో మ్యాటర్ ఖుల్లం ఖుల్లాగా ఉంది. పాకిస్తాన్ కు టన్నుల కొద్దీ భయాన్ని, ముందు ముందు అసలు సీన్ చూపించబోతున్నారా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారుతోంది.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×