Big Stories

Indians Ditching Foreign life | ఫారిన్ వద్దు ఇండియా ముద్దు అంటున్న యువత.. విదేశాలకు ధీటుగా ఎదుగుతున్న భారత్‌!

Telugu news updates

Indians Ditching Foreign life(Telugu news updates):

- Advertisement -

Brain Drain(బ్రెయిన్ డ్రెయిన్) ఈ పదం గురించి మీరు వినే ఉంటారు. ముఖ్యంగా కాలేజీలు, యూనివర్సిటీలలో ఉన్నత చదువులు చదివే studentsకి brain drain గురించి తెలిసే ఉంటుంది.

- Advertisement -

Brain Drain అంటే మన దేశంలో ఉండే నిపుణులు, డాక్టర్లు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, మరీ ముఖ్యంగా సాఫ్ట వేర్ ఇంజినీర్లు విదేశాలకు వెళ్లి అక్కడ jobs చేస్తున్నారు. చాలా మంది ఆ దేశంలోనే స్థిరపడుతున్నారు. ఆ దేశాలలో ఉద్యోగాలు, బిజినెస్ చేస్తూ.. ఆ దేశాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు.

ఇలా భారత దేశం నుంచి గత కొన్ని దశాబ్దాలుగా చాలా మంది విదేశాలకు వలస వెళ్లారు. భారతీయ యువత.. భారత దేశ అభివృద్ధికి కాకుండా.. విదేశాల అభివృద్ధి కోసం పనిచేయడమనే విధానాన్ని Brain Drain అని అంటారు.

అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి ధనిక దేశాలలో భారత్ కంటే ఉద్యోగావకాశాలు, సాలరీలు ఎక్కువ. దీంతో ఆ దేశాలకు వెళ్లడానికి భారత యువత ఆసక్తి చూపుతోంది. కానీ ఇదంతా ఒకవైపు జరుగుతుంటే.. భారత్ కంటే ఎక్కువ రెట్లు సాలరీలు సంపాదించుకోవచ్చనే ఆశలు పెట్టుకొని వెళుతున్న వారు.. అక్కడి కష్టాలు చూసి స్వదేశానికి తిరిగి వచ్చేస్తున్నారు.

For example, బెంగుళూరుకు చెందిన ఒక software engineer సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. విదేశాల జీవితం అసలు వద్దు. ఇండియాలో సెటిల్ కావడం బెటర్. అని రాశాడు. దానికి కొన్ని కారణాలు కూడా వివరించాడు. ఇది అతనొక్కడి అభిప్రాయం మాత్రమే కాదు. విదేశాలలో ఉద్యోగాలు చేస్తూ.. అక్కడే స్థిరపడిన వారిలో చాలా మంది ఇదే మాట చెబుతున్నారు.

వీరందరూ చెబుతున్న కారణాలు ఇవే..

ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా మారిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక stable life ఆశించడం కష్టమే. ఎందుకంటే ప్రపంచంలోని చాలా ధనిక దేశాలలో ఎక్కువ సంపాదనతోపాటు తలకు మించిన ఖర్చులు కూడా ఉంటాయి. రోజురోజుకూ అక్కడ ధరల పెరుగుదల చూసి అక్కడ నివసించే వలస జీవుల జీవితాలు కష్టంగా మారుతున్నాయి.

మరోవైపు గత రెండు దశాబ్దాలుగా ప్రపంచంలో ఇండియా స్థానం క్రమంగా బలపడుతోంది. దీంతో చాలా మంది భారతీయులు తమ స్కిల్స్‌ని దేశాభివృద్ధి కోసం ఉపయోగించాలనుకుంటున్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో Inflation అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతోంది. అదే భారత్‌లో అయితే మరీ ఆ స్థాయిలో ధరల పెరుగదల లేదు. విదేశాలతో పోల్చుకుంటే మన దేశంలో కొంత వరకు స్థిరత్వం ఉందనే చెప్పాలి. ఈ కారణంగానే విదేశాలలో నివసించే యువత తిరిగి భారత్ రావాలనుకుంటోంది.

ప్రపంచదేశాలను చూస్తే.. బ్రిటన్‌ ఎకానమీ కుప్పకూలిపోయింది. ఆ దేశంలో చాలా నెలలుగా Inflation 7 శాతంగా ఉంది. G seven దేశాలలో ఇదే Highest. బ్రిటన్ దేశంలో ఇళ్ల రెంటు కట్టడానికే ఉద్యోగుల జీతంలో ఎక్కువ భాగం ఖర్చైపోతోంది. ఒకవేళ చిన్న ఇంట్లో సర్దుకుపోదామనుకుంటే.. అక్కడ పిల్లలకు స్కూల్ ఫీజులు ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి.

ఇప్పుడీ కారణాలతోనే చాలామంది ఇండియానే బెటర్ అంటున్నారు. ఇండియాలో అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలంత మరీ ఎక్కువ జీతాలు లేకున్నా.. ఒక కామన్ మ్యాన్ తనకు కావాల్సిన budgetలో ఇల్లు తీసుకోగలడు.

మరోవైపు జర్మనీలో జూలై 2023 నుంచి Inflation 6.2 శాతం కొనసాగుతోంది. అక్కడ నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రష్యా, Ukraine వార్ జరుగుతున్న నేపథ్యంలో అన్ని యూరప్ దేశాలలో పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి.

ఇదే విధంగా కెనెడలో ప్రతీ ఉద్యోగి.. సాలరీ నుంచి 60 నుంచి 70 శాతం వరకు TAX కట్టడానికే సరిపోతుంది. దీనికి తోడు కెనెడాలో 3 నెలలపాటు విపరీతమైన మంచు కురవడంతో ఆ సమయంలో చేయడానికి పనిఉండదు. అదే ఇండియాలో అయితే ఆ పరిస్థితి లేదు.


అమెరికాలో ఒక family నెల ఖర్చు కనీసం 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు

జర్మనీలో 3 నుంచి 4 లక్షల రూపాయలు

బ్రిటన్‌లో రూ.4 నంచి 6 లక్షల రూపాయలు

దుబాయ్‌లో రూ. 1 లక్ష నుంచి రూ.3 లక్షలు

ఆస్ట్రేలియాలో రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలు


ఇండియాలో కూడా Inflation ఉంది. ఇక్కడ కూడా నిత్యావసరాల ధరలు పెరుతున్నాయి. కానీ మన దేశంలో cost of living మిగతా దేశాల కంటే చాలా చాలా తక్కువనే చెప్పాలి.

అంటే New York, London, Berlin, Dubai, లాంటి విదేశీ నగరాల్లో ఉద్యోగం చేస్తే High Salaries పొందవచ్చు.. కానీ ఈ High Salariesతో పాటు అక్కడ తడిసిమోపెడయ్యే ఖర్చులు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఏమైనా health emergency వస్తే.. అమెరికా లాంటి దేశాల్లో top notch medical facilities ఉన్నాయి. కానీ వాటి కయ్యే ఖర్చు అంతా ఇంతా కాదు. అందుకే విదేశాల్లో నివసించే భారతీయులు medical treatment కోసం ఇండియాకే వస్తారు. ఇక్కడ కూడా మంచి hospitals ఉన్నాయి. పైగా ఇక్కడ అదే treatment చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది. కేవలం భారతీయులే కాదు.. third world countriesలో నివసించే చాలామంది health emergency వస్తే ఇండియాకు వస్తున్నారు.

ఇవన్నీ ఒకెత్తైతే.. అమెరికా లాంటి దేశాల్లో గన్ కల్చర్ ఒక ప్రధాన సమస్యగా మారిపోయంది. అమెరికాలో దాదాపు అందరికీ తుపాకులు అందుబాటులో ఉంటాయి. దీంతో కొంత మంది ఉన్మాదులు.. తుపాకీ చేతిలో ఉంది కదా అని.. స్కూళ్లు, ఆఫీసులని తేడా లేకుండా అమాయక ప్రజల కాల్పులు చేస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో ఎక్కువగా చిన్నపిల్లలు చదువుకునే స్కూళ్లలోనే జరుగుతుండడం చాలా బాధాకరం. 2023లో 135 కు పైగా– గన్ ఫైర్ ఘటనలు జరిగాయి.

ఈ ఉన్మాదులు ముఖ్యంగా జత్యాహంకారంతోనే ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని Psychologists చెబుతున్నారు. వీరంతా ఎక్కువగా టార్గెట్ చేస్తున్నది ఇండియన్స్‌నే. పైగా అమెరికాలో ఇప్పుడు H 1 B VISA రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయి.

2022 తరువాత ఇండియాలో ఒక software boom start అయింది. ఇప్పుడు Young students కూడా చదువులు పూర్తిచేసుకొని India లోనే మంచి కెరీర్ opportunities ఉండడంతో విదేశాలకు వెళ్లడానికి Interest చూపించడం లేదు. ఇండియాలనే చాలా multinational కంపెనీలు, కొత్త కొత్త startups మంచి ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి. ఇండియన్ కంపనీలైన TCS, Infosys, Wipro and the tech Mahindra ప్రపంచవ్యాప్తంగా success సాధించి మంచి brandsగా మారాయి.

ఇండియాలో next financial year కల్లా సాఫ్టవేర్ technology industry 24 బిలియన్ డాలర్స్ కు చేరుకోనుంది. ఇదే trend కొనసాగిస్తే.. 2030 కల్లా ఇండియా software Industry 500 బిలియన్ డాలర్స్‌కు చేరుకునే అవకాశం ఉందని NasCom report చెబుతోంది.

software రంగంలో ప్రభుత్వ, private పెట్టుబడులు పెరుగుతుండడంతో ఇండియాలో IT sector వేగంగా అభివృద్ధి చెందుతోంది.

ఇటీవలే మనం చూశాం Google, Microsoft, Amazon, Meta, IBM లాంటి దిగ్గజ కంపెనీలు చాలా మంది ఉద్యోగులను తొలగించాయి. కానీ తాజాగా ఈ కంపెనీలు మళ్లీ hiring మొదలుపెట్టాయి.

ఇండియాలో దాదాపు 50 లక్షల మంది Software Industryలో పనిచేస్తున్నారు. ఇండియా GDPలో దాదాపు 10 శాతం IT Industry నుంచే వస్తోంది. Artificial intelligence, machine learning లాంటి cutting edge technologiesపై ఇండియాలో వర్క్ జరుగుతోంది.

Flipkart, Ola, Paytm, Zomato, Swiggy, Oyo లాంటి Indian startups చాలా successfulగా రన్ అవుతున్నాయి. దేశంలో గత 13 ఏళ్లలో ధరల పెరుగుదల, Inflation సమస్యలున్నపటికీ ఈ కంపెనీలు ఆ pressureని తట్టుకొని నిలబడ్డాయి. వీటితో పాటు ఎక్కువ సంఖ్యలో కొత్త startups success సాధిస్తుండడంతో అమెరికా సిలికాన్ వ్యాలీతో పోటీగా ఇండియా కూడా ఒక Global innovation powerhouseగా ఆవిర్భవిస్తోంది.

ఇప్పుడు ఈ factors కారణంగానే పై చదువుల కోసం విదేశాలకు వెళ్లే ఇండియన్ students దేశంలోనే చదువుపూర్తి చేసుకొని ఇక్కడే STARTUPS పెడదామనే ఆలోచనలో ఉన్నారు. దీనికోసం PARENTS కూడా తమ పిల్లలకు విదేశాల కంటే ఇక్కడే మంచి FUTURE ఉందని భావిస్తున్నారు. పైగా Indiaలో ఉంటే familyతో కలిసి ఉండొచ్చు. చక్కగా తల్లిదండ్రులను చూసుకుంటూ.. పిల్లలను భారతీయ సంస్కృతి అంటే తెలియజేయొచ్చు.

ఇవన్నీ గమనిస్తే.. ఇండియాలో కూడా quality of life improve అవుతోంది. అందుకే విదేశాలకు వెళ్లి సెటిల్ అవ్వాలనుకునే వారు ఆయా దేశాల్లో high salaries ఉన్నా మితిమీరిన ఖర్చులు, అక్కడ కఠిన వీసా నిబంధనలు, సమస్యలతో పోలిస్తే.. ఇండియాలో పెరుగుతున్న job opportunities, ఇండియాలో ఉంటే కుటంబానికి అందుబాటులో ఉండడం వంటి కారణాలతో foreign వద్దు Indiaనే ముద్దు అని అంటున్నారు.

ఇది ఒకరకంగా ఇండియాకు మంచిదే. ఎందుకంటే మన దేశ యువత.. స్వదేశంలో ఉంటే వారి నైపుణ్యం.. మన దేశా అభివృద్ధికే ఉపయోగపడుతోంది.

సినిమాల్లో చూపించినట్లు foreign countriesలో అంతా Hi fi life ఉంటుంది. అక్కడ అందరూ enjoy చేస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ real lifeలో ఇదంతా ఈజీ కాదు. అక్కడ quality of life ఇండియా కంటే బాగుందని అందరూ చెబుతుంటారు.. కానీ ఇప్పుడు ఇండియాలో కూడా standard of living(జీవన ప్రమాణాలు) పెరుగుతోంది. అందుకే నేటి యువత Indiaలో ఉంటూ కూడా కలలను సాకారం చేసుకోవచ్చని నిరూపిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News