BigTV English

NTR: ఎన్టీఆర్.. కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..

NTR: ఎన్టీఆర్.. కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..
ntr

NTR: పుట్టి పెరిగింది హైదారాబాద్. చిన్నప్పుడు బాగా అలర్లి చేసేవాడు. క్రికెట్‌ అంటే చాలా ఇష్టం.
–మొదటి పేరు తారక్‌. అది మార్చి తారక రామారావు అని పేరుపెట్టారు సీనియర్ ఎన్టీఆర్.
–తండ్రి హరికృష్ణ, తల్లి షాలిని, భార్య ప్రణతి, సోదరుడు కల్యాణ్ రామ్ అంటే ఎన్టీఆర్‌కు ప్రాణం. పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్. కూతురు లేదనే లోటు ఉందని చెబుతారు.


–హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్‌లో చదివారు. సెయింట్‌ మేరీ కాలేజీలో ఇంటర్మీడియెట్‌ చేశారు. జాగ్రఫీ ఫేవరేట్ సబ్జెక్ట్.
–‘కూచిపూడి’ డ్యాన్స్‌లో శిక్షణ పొంది.. 12 ఏళ్ల పాటు సాధన చేశారు. దేశవ్యాప్తంగా వందకిపైగా ప్రదర్శనలు ఇచ్చారు.
–తారక్ స్కూల్‌ ఫ్రెండ్స్‌ స్నేహల్‌, లవ్‌రాజ్‌. సినిమాల్లో రాజీవ్‌ కనకాల. రామ్‌చరణ్‌, మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌లు బాగా క్లోజ్.

–‘రామాయణం’లో బాల్య నటుడిగా నటించారు. 2001లో ‘నిన్ను చూడాలని’ హీరోగా ఫస్ట్ మూవీ.
–‘స్టూడెంట్‌ నెం. 1’తో సూపర్ హిట్. ‘ఆది’తో స్టార్‌డమ్‌. కెరీర్‌లో రెండు నంది అవార్డులు. హీరోగా 22 ఏళ్ల ప్రస్థానం. ప్రస్తుతం 30వ సినిమాగా ‘దేవర’.
–‘రాఖీ’ తర్వాత సన్నబడాలని ఫిక్స్ అయ్యారు. జక్కన్న చెక్కడంతో ‘యమదొంగ’గా మారారు.


–ఎన్టీఆర్‌లో మంచి గాయకుడు కూడా. బిర్యానీ భలే చేస్తారు. పలు భాషలు మాట్లాడుతారు.
–తారక్‌ లక్కీ నెంబర్ ‘9’. తన వాహనాలన్నిటికీ 9999 నెంబరే. ట్విటర్‌ ఖాతాకు కూడా.
–తారక్ ఫేవరెట్‌ మూవీ: ‘దాన వీర శూర కర్ణ’. ఫేవరెట్‌ సాంగ్‌: మాతృదేవోభవలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’.


–జపాన్‌లో ఫుల్ క్రేజ్‌ ఉన్న ఏకైక తెలుగు నటుడు ఎన్టీఆర్‌.
–‘ఫోర్బ్స్‌ ఇండియా’ సెలబ్రిటీ లిస్ట్‌లో రెండు సార్లు నిలిచాడు.
–ఎన్టీఆర్‌ 20 ఏళ్ల క్రితం నటించిన ‘సింహాద్రి’.. ఆయన పుట్టినరోజు సందర్భంగా 1000 స్క్రీన్లలో రీ రిలీజ్‌. ఓ సినిమా ఇన్ని స్క్రీన్లలో రీ రిలీజ్‌ అవడమూ రికార్డే.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×