BigTV English

CSK: ప్లే ఆఫ్స్‌కు చెన్నై.. ఢిల్లీపై గ్రాండ్ విక్టరీ..

CSK: ప్లే ఆఫ్స్‌కు చెన్నై.. ఢిల్లీపై గ్రాండ్ విక్టరీ..
csk vs dc

CSK: చెన్నై దూకుడు మామూలుగా లేదు. సూపర్ కింగ్స్ మళ్లీ అదరగొట్టారు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 77 రన్స్ తేడాతో ఘన విజయం సాధించారు. క్యాపిటల్స్‌పై నెగ్గి.. ప్లే ఆఫ్స్‌కి చేరారు.


CSK విసిరిన 224 పరుగుల భారీ టార్గెట్‌ను కొట్టలేక ఢిల్లీ చేతులెత్తేసింది. 146 పరుగులకే ఔట్ అయింది. ఢిల్లీ టీమ్‌లో డేవిడ్ వార్నర్ (86; 58 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) మాత్రం అదరగొట్టాడు. యశ్‌ ధుల్ (13), అక్షర్ పటేల్ (15) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు సాధించారు. పృథ్వీ షా (5) మళ్లీ తుస్సుమనిపించాడు. ఫిలిప్‌ సాల్ట్‌ (3), రొసో (0), అమన్ ఖాన్ (7), లలిత్ యాదవ్ (6), నోకియా (0), కుల్‌దీప్‌ యాదవ్‌ (0) అంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. చెత్త బ్యాటింగ్‌తో చిత్తుగా ఓడిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్.

చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్‌ 3 వికెట్లు తీశాడు. పతిరణ 2, మహీశ్‌ తీక్షణ 2, రవీంద్ర జడేజా, తుషార్‌ దేశ్‌పాండే తలా ఒక్కో వికెట్ పడగొట్టారు.


ఫస్ట్ బ్యాటింగ్‌ చేసిన చెన్నై ఓపెనర్లు చెలరేగిపోయారు. ఢిల్లీ బౌలింగ్‌ను ఆటాడుకున్నారు. రుతురాజ్‌ గైక్వాడ్ (79; 50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు), డేవాన్‌ కాన్వే (87; 52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) లు రబ్బర్ బాల్‌తో ఆడినట్టు ఆటాడుకున్నారు. చివర్లో శివమ్‌ దూబె (22; 9 బంతుల్లో 3 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (20*; 7 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) సైతం భారీ షాట్లు కొట్టడంతో.. 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి.. 223 రన్స్ చేసింది సీఎస్కే.

ఢిల్లీ బౌలర్లంతా భారీగా పరుగులు ఇచ్చారు. ఖలీల్ అహ్మద్‌, నోకియా, చేతన్‌ సకారియా ఒక్కో వికెట్ తీశారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×