BigTV English
Advertisement

NTR: ‘మార్వెల్’ మూవీస్ లో తారక్!?.. హాలీవుడ్ లో సంచలనం

NTR: ‘మార్వెల్’ మూవీస్ లో తారక్!?.. హాలీవుడ్ లో సంచలనం

NTR: ఎన్టీఆర్. పవర్ ఫుల్ నేమ్. పవర్ ఫుల్ క్యారెక్టర్స్ చేయడంలో ఎక్స్ పర్ట్. తారక్ నటించిన సినిమాలన్నీ ఓ రేంజ్ లో ఉంటాయి. ఫ్యాక్షన్, యాక్షన్, యాక్టింగ్, డైలాగ్స్, డ్యాన్స్.. ఏదైనా ఇరగదీసేస్తుంటాడు. తొడగొట్టడాలు గట్రా కూడా చేస్తుంటాడు. ఇక RRR మూవీలో కొమురం భీం రోల్ లో యాక్టింగ్ చించేశాడు. అమిత్ షా లాంటి వారినే ఆకట్టుకున్నారు. RRR మూవీతో మన తారక్ కు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అమెరికా, జపాన్ లోనూ మూవీ హిట్ కావడంతో అక్కడ కూడా సెలబ్రిటీగా మారిపోయారు జూనియర్ ఎన్టీఆర్.


ఇక, RRRలోని నాటు నాటు సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో అమెరికాలో సందడి చేస్తోంది మూవీ టీమ్. వరుసబెట్టి హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా తారక్.. తన మనసులో మాట బయటపెట్టారు. తనకు మార్వెల్ మూవీస్ లో చేయాలనే కోరిక ఉందంటూ చెప్పారు ఎన్టీఆర్.

మార్వెల్ స్టూడియోస్.. సూపర్ హీరోస్ సినిమాలకు కేరాఫ్. ఐరన్ మ్యాన్ నుంచి అవేంజర్స్ వరకూ అనేక యాక్షన్ ఓరియెంటెడ్ ఫాంటసీ చిత్రాలను నిర్మించింది. దాదాపు అన్నీ బ్లాక్ బస్టర్లే. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, హల్క్.. ఇలా ఎన్నో సూపర్ హీరో క్యారెక్టర్లను క్రియేట్ చేసింది మార్వెల్ స్టూడియోస్. అలాంటి మార్వెల్ మూవీస్ లో నటించాలని ఉందంటూ తారక్ తన కోరికను బయటపెట్టాడు. RRRతో వాల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించిన తారక్ కనుక మార్వెల్ సినిమాలో నటిస్తే? ఆ ఆలోచనే ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది.


ఇక, అమెరికా పర్యటనలో ఉన్న తారక్.. తన పెద్ద మనసును చాటుకున్నాడు. RRRలోని నాటు నాటు (Naatu Naatu) సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు (Golden Globe Award) వచ్చిన శుభతరుణంలో.. ఓ హాలీవుడ్ మీడియా రిపోర్టర్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి అతన్ని అవాక్కయ్యేలా చేశాడు.

నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంపై తారక్ స్పందన అడిగాడు అమెరికాకు చెందిన ‘వెరైటీ’ కల్చరల్ అండ్ ఈవెంట్ ఎడిటర్ మార్క్. ఆ రిపోర్టర్ ప్రశ్నకు బదులిస్తూ.. అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నాడు తారక్. “మా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ట్రాక్ రికార్డుని బట్టి ఈ సినిమా విజయం సాధిస్తుందని మాకు తెలుసు. కానీ ఇది అంతకుమించి. జపాన్, అమెరికా ఇంత సక్సెస్ వస్తుందని ఊహించలేదు” అని అన్నాడు. అలాగే మార్వెల్ మూవీస్ చేయాలని ఉందని కూడా ఇదే ఇంటర్వ్యూలో చెప్పాడు ఎన్టీఆర్.

అయితే, తనను ఇంటర్వ్యూ చేసిన ‘మార్క్’ బర్త్ డే అని తెలిసి.. అప్పటికప్పుడు ఆ రిపోర్టర్ కు ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు తారక్. హ్యాపీ బర్త్ డే అంటూ.. ఓ గిఫ్ట్ ప్యాక్ అతని చేతిలో పెట్టాడు. అది చూసి మార్క్ చాలా సంతోషం వ్యక్తం చేశాడు. అక్కడే ఆ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేస్తే.. అందులో అందమైన ‘టై’ ఉంది. ఎన్టీఆర్ కి థ్యాంక్స్ చెప్పాడు మార్క్. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Related News

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Proddatur: ప్రొద్దుటూరు క్యాసినో వార్

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Big Stories

×