ఒక యుద్ధం గెలవాలంటే..
వ్యూహం ఆలోచించాలి..
సరైన టైమ్ లో అమలు చేయాలి..
శత్రువును ఏమార్చాలి..
సీక్రెట్ ఆపరేషన్ చేపట్టాలి..
శత్రువుతో తిరుగుతూనే బోల్తా కొట్టించాలి..
ఇరాన్ ను అడ్డంగా బుక్ చేసిన ఇజ్రాయెల్
సరిగ్గా ఇజ్రాయెల్ అదే పని చేసింది. ఇరాన్ ను అడ్డంగా బుక్ చేసింది. కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇజ్రాయెల్ చేసిన ఆపరేషన్ మామూలుగా లేదు. ఒక హాలీవుడ్ మూవీకి ఏమాత్రం తీసిపోకుండా యాక్ట్ చేశారు. ఇరాన్ పై ఇప్పట్లో దాడి ఉండదు అన్న భ్రమలు కల్పించడానికి ఈ మధ్య చాలా కథలు అల్లారు. సోషల్ మీడియాలో వదిలారు. ఇక ఇజ్రాయెల్ రిలాక్స్ అయిందని ఇరాన్ సుప్రీం లీడర్ ను కంప్లీట్ గా నమ్మించారు. అలర్ట్ లెవెల్ తగ్గించారు. మొత్తంగా ఇరాన్ ను ఫూల్ చేసేసింది ఇజ్రాయెల్. కానీ ఉరుము ఉరిమినట్లుగా ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎలా అంటే ఇరాన్ కోలుకోలేనంతగా, తిరిగి దాడి చేయలేనంతగా, ఫైటర్ జెట్స్ ను అడ్డుకోలేనంతగా, నిస్సహాయ స్థితిలో ఇరాన్ ను అస్త్ర సన్యాసం చేయించింది ఇజ్రాయెల్. ఇరాన్ దగ్గర అస్త్రాలున్నా పని చేయవు. ప్రత్యర్థి అస్త్రాలను అడ్డుకోలేదు. అలా తయారైంది సిచ్యువేషన్. ఇదంతా ఇజ్రాయెల్ మాస్టర్ స్ట్రాటజీతోనే సాధ్యమైంది.
ఆపరేషన్ రైజింగ్ లయన్..
అసలు ఇరాన్ పై దాడి చేసేకంటే ముందు ఇజ్రాయెల్ మిస్ లీడింగ్ స్ట్రాటజీని అమలు చేసింది. నెతన్యాహు ఫేక్ వెకేషన్ నుంచి మొస్సాద్ డ్రోన్ ట్రాప్స్ వరకు, ఇరాన్‌ను కన్ఫ్యూజ్ చేసి, సర్‌ప్రైజ్ అటాక్‌తో బోల్తా కొట్టించారు. ఆపరేషన్ రైజింగ్ లయన్.. ఒక సూపర్ స్ట్రాటెజిక్ మిలటరీ మాస్టర్‌ప్లాన్‌లో భాగం. ఇరాన్‌ను బోల్తా కొట్టించడానికి ఇజ్రాయెల్ ఉపయోగించిన మిస్‌లీడింగ్ టాక్టిక్స్ ఎలా పనిచేశాయో పాయింట్ టూ పాయింట్ ఇప్పుడు చూద్దాం.
నెతన్యాహు ఫేక్ వెకేషన్ డ్రామా
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు జూన్ 12న ఒక బీచ్ వెకేషన్ టూర్ ప్లాన్ అనౌన్స్ చేశారు. అది కాస్తా నెతన్యాహు ఫుల్ రిలాక్స్ మోడ్‌లో ఉన్నారని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇరాన్ ఇంటెలిజెన్స్ కూడా ఈ కట్టుకథను నమ్మింది. కానీ ఇది ఒక పెద్ద డ్రామా. నెతన్యాహు ఎక్కడికీ వెళ్లలేదు. జెరూసలెంలోని సీక్రెట్ వార్ రూమ్ లో ఉండి, ఆపరేషన్ రైజింగ్ లయన్‌ను లీడ్ చేశారు. నెతన్యాహు ఆడిన ఈ ఫేక్ వెకేషన్ డ్రామా ఇరాన్‌ను స్లీప్ మోడ్‌లో ఉంచడంలో సక్సెస్ అయింది.
డమ్మీ డిప్లొమాటిక్ టాక్స్
ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ ఒక ఫేక్ మీటింగ్ అనౌన్స్ చేసింది. ఎజెండా ఏంటంటే గాజాలోని బందీల విడుదల గురించి.. అమెరికాతో డిస్కస్ చేయడం అని చెప్పింది. కానీ ఈ మీటింగ్ ఒక కవర్ అప్. రియల్ మ్యాటర్ ఏంటంటే.. ఆపరేషన్ రైజింగ్ లయన్‌కు అప్రూవల్ ఇవ్వడం. మంత్రులు సీక్రెట్ గార్డియన్ అగ్రిమెంట్‌పై సైన్ చేసి ఈ ప్లాన్ లీక్ కాకుండా లాక్ చేశారు. అమెరికాకు కూడా ఫుల్ డీటెయిల్స్ తెలియవు. ఈ డిప్లొమాటిక్ డ్రామా ఇరాన్ ను డైవర్ట్ చేసి, వారి డిఫెన్స్ అలర్ట్ ను స్లీప్ మోడ్ లో పెట్టడంలో ఉపయోగపడింది.
మొస్సాద్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ గేమ్
ఇజ్రాయెల్ గూడఛార సంస్థ మొస్సాద్ ఈ ఆపరేషన్‌లో గేమ్ చేంజర్. గత కొన్నేళ్లుగా మొస్సాద్.. ఇరాన్ లోపల సీక్రెట్ డ్రోన్ బేస్‌లు సెటప్ చేసింది. ఈ హైటెక్ డ్రోన్‌లను సామాన్య జనం వాహనాల్లో దాచి ఉంచి, ఇరాన్ రాడార్ సిస్టమ్స్ ను బైపాస్ చేశారు. జూన్ 13 అర్ధరాత్రి ఈ డ్రోన్‌లు యాక్టివేట్ అయ్యాయి. ఇరాన్ S-300, బవర్-373 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను టార్గెట్ చేసి బ్లాస్ట్ చేశాయి. ఈ స్టెల్త్ మూవ్ ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్‌కు ఫ్రీ ఎయిర్‌స్పేస్ ఓపెన్ చేసింది. ఇరాన్‌ను కంప్లీట్‌గా షాక్‌లోకి నెట్టింది.
US-ఇరాన్ అణుచర్చలతో డైవర్ట్
ఇజ్రాయెల్ ఒక అడుగు ముందుకేసి US-ఇరాన్ న్యూక్లియర్ టాక్స్ గురించి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసింది. ఇరాన్, అమెరికా మధ్య అణుఒప్పందం కోసం ఒమన్ మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్నాయని నెతన్యాహు ఆఫీస్ అనౌన్స్ చేసింది. ఓవైపు చర్చలంటూ ఇంకోవైపు ఇరాన్ ను డీవియేట్ చేసింది.
ఇరాన్ మిలటరీ లీడర్స్ ట్రాప్
ఇజ్రాయెల్ ఒక మాస్టర్‌స్ట్రోక్ ప్లే చేసింది. ఇరాన్ ఎయిర్ ఫోర్స్ టాప్ కమాండర్స్‌ను ఒక ఫేక్ మీటింగ్ కు రప్పించింది. ఇజ్రాయెల్ సెక్యూరిటీ అఫీషియల్ ప్రకారం, ఇరాన్ మిలటరీ లీడర్స్ సమాచారం కలెక్ట్ చేసి వారిని ఇన్‌ఫ్లూయెన్స్ చేశారు. ఈ ట్రాప్‌లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హొస్సేన్ సలామి, మిలటరీ కమాండర్ మొహమ్మద్ బాఘేరి, ఇద్దరు న్యూక్లియర్ సైంటిస్ట్‌లు ట్రాప్ లో ఇరుక్కున్నారు. ఈ మీటింగ్ కు వీరు రాగానే.. టార్గెట్ చేసి హతమార్చింది.
ట్రంప్‌తో దౌత్య వివాదం డ్రామా
ఇక్కడ ఇజ్రాయెల్ మరో లెవెల్ గేమ్ ఆడింది. నెతన్యాహు, US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మధ్య ఒక డమ్మీ వివాదాన్ని సృష్టించింది. ఇరాన్ పై దాడుల గురించి ట్రంప్‌తో విబేధాలు ఉన్నాయని నెతన్యాహు ఆఫీస్ పెద్ద సీన్ క్రియేట్ చేసింది. ట్రంప్ డిప్లొమాటిక్ డీల్ కోసం ఒత్తిడి చేస్తున్నాడని, ఇజ్రాయెల్ అటాక్‌కు అప్రూవల్ ఇవ్వడం లేదని ప్రచారం జరిగేలా చేశారు. ఈ వ్యవహారం కాస్తా.. ఇజ్రాయెల్‌ను అమెరికా కంట్రోల్ చేస్తోందని ఇరాన్ ఫీల్ అయ్యేలా చేసి వారి అలర్ట్ లెవెల్స్‌ను తగ్గించింది. స్ట్రైక్స్ ఇప్పట్లో జరగవు అన్న ఫీల్ వచ్చేలా చేసింది.
సంక్షోభంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం డ్రామా
ఇది ఇరాన్ ను రిలాక్స్ చేయడంలో కీరోల్ పోషించిన డ్రామా. ఇజ్రాయెల్ ప్రభుత్వం కూలిపోతుందని రూమర్స్ స్ప్రెడ్ చేయించారు. ఇవి ఇజ్రాయెల్ అంతర్గత సమస్యల్లో ఉందని, అటాక్ చేసే స్థితిలో లేదని ఇరాన్ నమ్మేలా చేసింది. ఈ డొమెస్టిక్ డ్రామా ఇరాన్ ఇంటెలిజెన్స్‌ను సైడ్ ట్రాక్ పట్టించడంలో సక్సెస్ అయింది.
ఇరాన్ ఇంటెలిజెన్స్‌ను సైడ్ ట్రాక్ పట్టించడంలో సక్సెస్
ఒకవైపు ఇజ్రాయెల్ లో వరుసగా ఇన్ని పరిణామాలు జరుగుతున్నా.. ఇరాన్ ఏమాత్రం గ్రహించలేకపోయింది. ఇజ్రాయెల్ గతంలో ఇలాంటి టాక్టిక్స్ ప్లే చేసింది. అయినా సరే ఇరాన్ మళ్లీ ఎలా నమ్మిందో వారికే తెలియాలి. ఈ మిస్‌లీడింగ్ టాక్టిక్స్ తో ఇజ్రాయెల్ పైచేయి సాధించింది. ఇరాన్ చేతులెత్తేసింది. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ డౌన్ అయ్యే వరకు వారికి అటాక్ గురించి క్లూ లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఇజ్రాయెలీ గూడఛార సంస్థ మొస్సాద్ రిలీజ్ చేసిన వీడియోల్లో ఏముంది?
పశ్చిమాసియాలో శత్రు దేశాలను దెబ్బతీయడంలో.. ఇజ్రాయెల్ మరోసారి తన స్పెషాలిటీని, వ్యూహాల్లో టాప్ పొజిషన్ ఉందని చాటుకుంది. ఎందుకంటే ఇరాన్ ను ఒక్క రోజులోనే 10 నిమిషాల ఆపరేషన్ తో షేక్ చేసింది. మిస్ లీడ్ చేసి, పక్కాగా బుక్ చేసింది. అసలు ఇరాన్ లోనే వారికి తెలియకుండా తిష్ట వేసి డ్రోన్లు యాక్టివేట్ చేసి టార్గెట్ లు యాక్సెస్ చేసింది. ఇజ్రాయెలీ గూడఛార సంస్థ మొస్సాద్ రిలీజ్ చేసిన వీడియోల్లో ఏముంది?
రైజింగ్ లయన్ కోసం చాలా రోజుల నుంచే గేమ్ ప్లాన్
తమ ఆపరేషన్స్ గురించి చాలా అరుదుగా ఇలాంటి వీడియోలను రిలీజ్ చేస్తుంది మొస్సాద్. ఇరాన్ కు చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-300 ను ఎలా పేల్చేస్తున్నారో.. శత్రువు మిసైల్స్ ను అడ్డుకునే ఎయిర్ డిఫెన్స్ సిస్టమే డ్యామేజ్ అయితే ఇక చేసేదేముంటుంది. అందుకే ఇజ్రాయెల్ డ్రోన్లు, ఫైటర్ జెట్లను ఇరాన్ అడ్డుకోలేకపోయింది. ఫ్రీ హ్యాండ్ లభించినట్లైంది.
ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ దృష్టిలో పెట్టుకుని స్ట్రాటజీ
ఇరాన్‌పై లేటెస్ట్ గా చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ కోసం చాలా రోజుల నుంచే ఇజ్రాయెల్ గేమ్ ప్లాన్ రెడీ చేసింది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, సైనిక బలాన్ని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ స్ట్రాటజీతో ముందుకెళ్లింది. ఆవేశం కాదు.. ఆలోచనకు పదును పెట్టింది. బలం, బలగం కాదు.. ఇంటెలిజెన్స్ ను నమ్ముకుంది.
రహస్య మార్గాల్లో ఇరాన్ కు డ్రోన్ల తరలింపు
ఇందుకోసం అవసరమైన ఆయుధ వ్యవస్థలు, పరికరాలు, కమాండోలను రహస్య మార్గాల్లో ఇరాన్‌లోకి తరలించడంలో ఇజ్రాయెల్ గూఢచార విభాగం మొస్సాద్ కీ రోల్ పోషించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు అత్యంత సమీపంలోనే వారికి తెలియకుండానే డ్రోన్ బేస్ ను ఏర్పాటు చేసుకుందంటే ఇజ్రాయెల్ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అత్యంత కచ్చితత్వంతో పనిచేసే వెపన్స్ ను అక్కడికే చేర్చింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ మొదలుకాగానే ఇక్కడి నుంచి డ్రోన్లను రిమోట్ తోనే ప్రయోగించి.. ఇరాన్ మిసైల్ బేస్ లను డ్యామేజ్ చేసింది. మధ్య ఇరాన్‌లోని ఎయిర్ బేస్ దగ్గర ఇజ్రాయెల్ కమాండోలు దాడులు చేశారు. ఆ తర్వాత ఫైటర్ జెట్స్, మిసైల్స్ తో ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలు, సైనిక స్థావరాలు, మిలటరీ బేస్ లపై విరుచుకుపడింది. మొత్తం ఐదు దశల్లో దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైనిక వర్గాలు చెబుతున్నాయి.
S-300, బవర్-373 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ధ్వంసం
ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలైన S-300, బవర్-373 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ధ్వంసం కావడంతో ఆ దేశ అణు శుద్ధి కేంద్రాలపై నిరాటంకంగా ఇజ్రాయెల్ జెట్లు దాడులు చేయగలిగాయి. ఇరాన్ న్యూక్లియర్ సిస్టమ్ అంతా భూగర్భంలోనే మెయింటేన్ చేస్తోంది. శాంతియుత అవసరాలకే వాడుకుంటామని ఇరాన్ అంటుంటే.. అణుబాంబు తయారీ కోసమే ఇరాన్ వాటిని అభివృద్ధిచేసుకుందని ఇజ్రాయెల్, అమెరికా వాదిస్తున్నాయి. సో అక్కడ కూడా బాంబులు వేసింది ఇజ్రాయెల్. అయితే ఇరాన్ అణుకేంద్రాలు ఈ ఎటాక్స్ లో దెబ్బతినలేదంటున్నారు. ఆపరేషన్ రైజింగ్ లయన్‌లో భాగంగా ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ నుంచి భారీఎత్తున ఫైటర్ జెట్స్ వెళ్లాయి. 200 యుద్ధ విమానాలు, 100 లక్ష్యాలపై దాడులు చేశాయి. 330 బాంబులు, మిసైల్స్ వాడింది ఇజ్రాయెల్.
గతంలోనూ మొస్సాద్ కోవర్ట్ ఆపరేషన్లు
గతేడాది ఏప్రిల్, అక్టోబర్‌లలో ఇరాన్‌పై దాడులకు ముందు కూడా ఇజ్రాయెల్ గూఢచారి విభాగం.. మొస్సాద్ కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించింది. 2018లో ఇరాన్ అణు రహస్యాలను ఈ నిఘా సంస్థ సీక్రెట్ గా సేకరించింది. దీంతోనే టెహ్రాన్ అణు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ప్రపంచానికి చూపించింది. 2022లో నిర్వహించిన మిలిటరీ ఆపరేషన్‌లో ఇరాన్‌కు చెందిన 100 డ్రోన్లను ధ్వంసం చేసింది. 2023లో కూడా మొస్సాద్ తమ దేశంలో ఇలాంటి ఆపరేషన్ నిర్వహించినట్లు ఇరాన్ ఆరోపించింది. 2020లో ఇరాన్ అణుశాస్త్రవేత్తను మొస్సాద్ టీం హతమార్చిందంటున్నారు.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఇంటి సమీపంలోనూ ఎయిర్ స్ట్రైక్స్
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నివాస సమీపంలోనూ ఎయిర్ స్ట్రైక్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలు వైరల్ గా మారాయి. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరి హతమవడంతో, ఇరాన్ మిలిటరీ చీఫ్‌గా అమీర్ హతామీని నియమించినట్లు ఖమేనీ చెప్పారు. 2013 నుంచి 2023 వరకు హతామీ ఇరాన్ రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
అణు ఒప్పందం చేసుకోవాలని ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌ను మరోసారి హెచ్చరించారు. తమతో అణుఒప్పందం చేసుకోకపోతే.. ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రమవుతాయన్నారు. పరిస్థితి చేయి దాటకముందే దీనిపై నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇజ్రాయెల్ దాడుల గురించి తమకు ముందే తెలుసన్నారు ట్రంప్. అయితే ఈ దాడుల్లో తమ ప్రమేయం లేదని అమెరికా వివరణ ఇచ్చుకుంది.
ఐరన్ డోమ్ తో ఇరాన్ మిసైల్స్ ను ఎదుర్కొన్న ఇజ్రాయెల్
ఇరాన్ ఏదైనా ప్రతీకార దాడులకు పాల్పడితే దాన్ని ఎదుర్కొనేందుకు తమ సైన్యంలోని సెంట్రల్ కమాండ్ సిద్ధంగా ఉందని, అమెరికా తనను తాను కాపాడుకోవడంతో పాటు ఇజ్రాయెల్‌ను కూడా రక్షించేందుకు రెడీ అన్నారు ట్రంప్. సో ఇజ్రాయెల్ చేపట్టిన తాజా ఆపరేషన్, మిస్‌లీడింగ్ టాక్టిక్స్ వల్ల ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ రెండుమూడేళ్లు వెనక్కి వెళ్లినట్లైంది. ఇరాన్ తిరిగి 100 డ్రోన్‌లు, మిసైల్‌లు లాంచ్ చేసినా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్ సిస్టమ్స్ 99 శాతం వాటిని న్యూట్రలైజ్ చేశాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్రంగా వార్నింగ్స్ ఇచ్చినా రెస్పాన్స్ పెద్దగా లేకుండా పోయింది. అదీ ఇజ్రాయెల్ దెబ్బ.
-Story By vidya sagar, Bigtv Live