BigTV English

Gundeninda GudiGantalu Today episode: వామ్మో.. ప్రభావతి ఇలా మారిందేంటి..? రోహిణికి చుక్కలు చూపించేసిందిగా..

Gundeninda GudiGantalu Today episode: వామ్మో.. ప్రభావతి ఇలా మారిందేంటి..? రోహిణికి చుక్కలు చూపించేసిందిగా..

Gundeninda GudiGantalu Today episode june 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనాను డబ్బుల గురించి గట్టిగానే అడుగుతుంది ప్రభావతి. కానీ అది మీనా డబ్బులు మీకు అవసరం లేదు అని అనగానే ప్రభావతి సైలెంట్ అవుతుంది. సత్యం మీనా పొదుపు గల అమ్మాయి ఎప్పుడూ డబ్బులని వృధా చేయదు ఇది గుర్తుపెట్టుకుంటే నీకే మంచిది అని ప్రభావతికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మనోజ్ ఇంటికి రాగానే హడావిడిగా అందరిని పిలుస్తాడు. ప్రభావతి సత్యం ఏమైంది అని అడుగుతారు.. మీకో గుడ్ న్యూస్ అంటాడు. అందర్నీ పిలుస్తాడు..బాలు సెటైర్స్ వేస్తుంటాడు. నువ్వు చెప్పురా అంటుంది ప్రభావతి. రోహిణి ఏం చేసిందో తెలుసా అని మనోజ్ అంటే నువ్వు నాన్న డబ్బు కొట్టేసినట్టు పార్లలమ్మ నీ డబ్బు కొట్టేసిందా అని అడుగుతాడు.. నేను చెప్పేది వినరా అని మనోజ్ అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. మనసు ఎక్కడ పార్లర్ అమ్మేసిన విషయాన్ని ప్రభావతితో చెప్తాడు అని రోహిణి మనోజ్ వెనకాలే పరుగులు పెడుతూ ఇంటికి వచ్చేస్తుంది. మనోజ్ అప్పటికే పార్లర్ గురించి ఇంట్లో లీక్ చేస్తాడు.రోహిణి మన పార్లర్ ని ఫ్రాంచైజీకి ఇచ్చింది , క్వీన్ బ్యూటీ పార్లర్ తో మన పార్లర్ కలిపేసింది. ఆ పార్లర్ కి అమ్మపేరు తీసేశారు ఇప్పుడు అంటాడు. అంతే షాక్ అవుతుంది ప్రభావతి. ఇదిగో రోహిణి వచ్చింది కదా తాను చేసిన గొప్ప పని ఏంటో తన నోటితోనే చెబుతుందని మనోజ్ రోహిణి అడ్డంగా ఇరికిచ్చేస్తాడు. బాలు అమ్మయ్య ఈ విషయాన్ని నేను ఎలా చెప్పాలో అనుకున్నాను మొత్తానికైతే ఇలా దొరికిపోయింది అనమాట అని సంతోషంగా ఫీల్ అవుతాడు.

రోహిణి నువ్వు చేసిన మంచి పని ఏంటో నువ్వే అందరితో చెప్పు అని మనోజ్ అనగానే రోహిణి ముందుగా ప్రభావతికి క్షమాపణ చెప్తుంది. పార్లర్ పేరు మార్చిన విషయాన్ని మీకు ముందు నేను చెబుదామని అనుకున్నాను.. మన బ్రాండ్ ని ఇంకా బిల్డ్ చేసుకున్న తర్వాత మళ్లీ మన పేరుని మనం పెట్టుకోవచ్చు అని రోహిణి చెప్తుంది.. అయితే రోహిణి చెప్పిన మాటని ప్రభావతి మొదటగా విన్నట్లే అనుకుంటుంది. అయితే మలేషియా కోడలు ముందు పరువు పోతుందని మేనేజ్ చేస్తుంది ప్రభావతి. ఎవరైనా తనకు చెప్పకుండా ఏదైనా చేస్తే చిందులు తొక్కే ప్రభావతి మాత్రం తన పేరుని పార్లర్కి తీసేసారు అన్న విషయం తెలిసి కూడా సైలెంట్ గా ఉండడంతో అందరూ షాక్ అవుతారు.


రోహిణి ఏమైనా అంటే అలిగి వెళ్లిపోతుందేమో అని ప్రభావతి అదేంటమ్మా అలా చేశావు నాకు ఒక మాట ముందే చెప్పాల్సింది కదా.. అయినా మరేం పర్లేదు నువ్వు డబ్బులు ని పెంచేలా బిజినెస్ తెలివితేటలతోనే ఇలా చేశావు కదా అని మెచ్చుకుంటుంది. అయితే రోహిణి ఎక్కడ ప్రభావతి తిడుతుందోనని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ మాట అనగానే రోహిణి రిలాక్స్ అవుతుంది. ఈవిడ పేరు పార్లర్కి తీసేసామన్న విషయం తెలిస్తే ఎక్కడ గొడవ చేస్తుందని నేను చాలా కంగారు పడిపోయాను. కానీ ఏమీ అనకుండా మౌనంగా ఉంది అంటే నేను సేఫ్ అయినట్లే అని రోహిణి అనుకుంటుంది..

అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోతారు.. మీనా ఇదేంటండి చిన్న తప్పు చేసిన అత్తయ్య అందరిని కడిగి పడేస్తుంది కదా.. ఇప్పుడేంటి రోహిణి తన పేరు మీద ఉన్న పార్లర్ పేరుని తీసేసింది కదా.. ఒక్క మాట కూడా అనలేదు ఏంటి అని అంటుంది. దానికి బాలు అప్పుడే ఏమైంది మీనా సునామీ వచ్చే ముందర వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కదా ఇలానే. మా అమ్మ సంగతి నాకు బాగా తెలుసు కచ్చితంగా ఇది పెద్ద రచ్చ చేస్తుంది అని అనగానే రూమ్ లోంచి కేకలు వినిపిస్తాయి.

ప్రభావతి దగ్గరికి వెళ్లిన రోహిణి క్షమించండి అత్తయ్య మీకు చెప్పకుండా ఇలాంటి పని చేయడం నాదే తప్పు. నీకు చెబుదామనుకున్నాను కానీ మర్చిపోయాను అని రోహిణి ఏదో కుంటి సాకు చెప్తుంది. నా పేరు మీద ఉన్న పార్లర్ ని తీయాల్సిన అవసరం నీకేంటి అసలు నీకు ఎవరిచ్చారు అధికారం అని రోహిణి పై సీరియస్గా అరుస్తుంది. పైనుంచి కేకలు వినడంతో కింద ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. అయితే రోహిణి గొంతు పట్టుకుంటుంది ప్రభావతి. నీకెంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తావు అని రోహిణికి గుక్క తిప్పుకొని ఇవ్వకుండా అరుస్తుంది ప్రభావతి.

ప్రభావతి గొంతు పట్టుకోవడంతో రోహిణి షాక్ అవుతుంది. పార్లర్కి నా పేరు పెట్టుకున్నామని నేను ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాను. కానీ నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అని సీరియస్ అవుతుంది. రోహిణి ఎంత చెప్తున్నా సరే ప్రభావతి మాత్రం తన మాటే నెగ్గాలని అరుస్తుంది. మలేషియా తెలివితేటలు నా దగ్గర చూపించకు అని ప్రభావతి అంటుంది. ఇదొక్కటే దాచావా ఇంకేదైనా దాచావా అని ప్రభావతి రోహిణిని అడుగుతుంది. ఇంకేదైనా దాచావంటే ముందే చెప్పు ఇంకొకసారి ఇలాంటివి నా దగ్గరకు వస్తే నేను అస్సలు సహించను ఏం చేస్తానో నా సంగతి తెలుసు కదా అని వార్నింగ్ ఇస్తుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో రోహిణి మలేషియా గుడ్డుని బయటపడుతుందేమో చూడాలి..

Related News

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Stories

×