Intinti Ramayanam Today Episode june 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ ఇంట్లోంచి వెళ్ళపోవడంతో ఆ విషయం తెలుసుకున్న అవని రాజేంద్రప్రసాద్, భరత్, అందరూ కలిసి బయటకు వచ్చి వీధులు వెతుకుతారు.. కానీ వాళ్ళు కనిపించరు. అవనిని చూసిన శ్రీకర్ కమల్ అక్కడికి వెళ్తారు.. అమ్మ వాళ్ళు ఎక్కడ కనిపించలేదు అని అందరూ అనుకుంటారు.. అయితే అక్షయ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని అవని అడుగుతుంది. కచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్లి ఉంటారని అనుకుంటారు.. ఆ తర్వాత కమల్, అవని, శ్రీకర్ అక్షయ్ ఫ్రెండ్ భాస్కర్ ఇంటికి వెళ్ళారేమో చూడాలని వెళ్తారు. అయితే అందరు అనుకున్నట్లుగానే అక్షయ్ వాళ్లు అక్కడే ఉంటారు. అవని వెళ్ళగానే భాస్కర్ వాళ్ళ భార్య వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారా ఇది ఏమైనా హోటల్ అని మాట్లాడుతుంది.. మాటలు వినగానే అవని అత్తయ్య గారు మన ఇల్లు ఉండగా మీరు అక్కడే ఉండమని చెప్పిన కూడా ఎందుకు ఇలా వచ్చారు అని అంటుంది. అయినా అక్షయ్ వాళ్లు వినకుండా మమ్మల్ని ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా అని అవని పై అక్షయ్ సీరియస్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. అక్షయ్ పార్వతి అవని వాళ్ళని వెతుక్కుంటూ భాస్కర్ ఇంటికి రావడంతో వాళ్లు చాలా ఫీల్ అయిపోతారు. మమ్మల్ని ఇక్కడికి వచ్చిన వదలట్లేదా.. మేము ఎక్కడున్నామో మీకు తెలిసిపోకుండా ఉండడానికి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాం అయినా కూడా వదలవా అని పార్వతి అవనిని అందరి ముందర దారుణంగా అవమానిస్తుంది. అక్షయ్ కూడా పరాయి ఇల్లు అని సంగతి మర్చిపోయి అవనిపై సీరియస్ అవుతాడు.. అవని అది మీ ఇంట్లో మీ ఇంట్లో ఉండాల్సిన హక్కు మీకుంది అని ఎంత చెప్పినా కూడా వాళ్ళు అవని మాట వినకుండా తిడతారు. శ్రీకర్ పదండి వదిన వెళ్ళిపోదామని బయటికి వచ్చేస్తారు.
బయటికి రాగానే కమల్ ఏమైంది వదిన అన్నయ్య పరాయి ఇంట్లో ఉన్నామన్న సంగతి కూడా మర్చిపోయి భార్యను ఇంత దారుణంగా తిడతాడని అస్సలు ఊహించలేదు అని ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు మన ఫీల్ అవ్వాల్సింది వాళ్ళు ఏదో నన్ను అన్నారని కాదు కన్నయ్య వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా అదే మనకు సంతోషం అని అవని అంటుంది. శ్రీకర్ మాత్రం ఇదంతా చేసింది ఎవరో తెలుసుకోవాలని అవని చెప్పినట్లు పల్లవిని ఫాలోవుతాడు. అవని పల్లవి గురించి తెలుసుకునేటప్పుడు కన్నయ్యకు తెలియకుండానే ఇదంతా చేయాలని చెబుతుంది. శ్రీకర్ నేను చూసుకుంటాను వదిన కమల్ కి ఈ విషయం అసలు తెలియకుండా చేస్తాను అని అంటాడు.
రాజన్న ప్రసాద్ అవని కోసం బయట వెతుకు వెయిట్ చేస్తూ ఉంటాడు.. ఏమైందమ్మా ఎక్కడైనా కనిపించారని అడుగుతాడు. కంగారు పడకండి మావయ్య వాళ్ళు కనిపించారు లేండి అని అంటుంది. అయితే అవని మీకు వల్లంటే ఇష్టం లేదు అంటారు కానీ మీరు ఎందుకు మావయ్య ఇంత టెన్షన్ పడుతున్నారు అని అడుగుతుంది. నేను టెన్షన్ పడుతుంది బాధపడుతుంది వాళ్ల గురించి కాదు నీ గురించి. నిన్ను వద్దనుకొని వెళ్లిపోయిన సరే నువ్వు వాళ్ళని చూసుకోవాలని అనుకుంటున్నావు. వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలని ఎంత ఆరాటపడి తెలుసుకున్నావు. నీకు విలువ ఇచ్చారా అని అరుస్తాడు. వాళ్ళ నన్ను గౌరవిస్తారని కాదు మావయ్య వాళ్ళ ఇంట్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత ఎలాంటి కష్టాలు పడుతున్నారో తెలుసుకోవాలని నేను వెళ్ళాను అని అవని క్లారిటీగా చెప్తుంది.
అవని మంచి మనసు చూసి రాజేంద్రప్రసాద్ సంతోష పడతాడు. ఇంట్లోకి రాగానే అవని నగలను శ్రేయ పల్లవి పంచుకుంటారు.. అది వినగానే శ్రీకర్ కమల్ ఇద్దరూ షాక్ అవుతారు.. కమల్ మా వదిన కూడా వస్తుంది. కాళ్లు చెయ్యి ఒకరు పంచుకోండి సరిపోతుంది అని అంటాడు. అవని అక్క ఇప్పట్లో మీ ఇంటికి వచ్చేలా లేదు అందుకే నగలను మేము వేసుకోవాలి అనుకున్నం అందులో తప్పేముంది అని పల్లవి అంటుంది. ఇంట్లో ఎవరూ లేరు. ఇల్లు ఊడవలేదు.. కిచెన్లో గిన్నెలు కిచెన్ లోనే ఉన్నాయి. ఎక్కడివి అక్కడే ఉన్నాయి అవి పట్టించుకోకుండా మీరిద్దరూ నగలను పంచుకుంటున్నారు. అమ్మ వదిన ఉన్నప్పుడు ఇంట్లో దేవుడి గదిలో ఎప్పుడు దీపం వెలిగేది.
ఇప్పుడు మీరిద్దరూ ఉండడంవల్ల ప్రయోజనం ఏంటి అని కమల్ సీరియస్ అవుతాడు. ముందు వెళ్లి అర్జెంట్గా దీపం పెట్టి దేవుడి దగ్గర దండం పెట్టుకోండి అని కమలంటాడు. కమల్ మాట విని ఇద్దరు కోడలు లోపలికి వెళ్తారు. వీళ్ళని ఇలా అయితేనే కంట్రోల్లో పెట్టొచ్చు అన్నయ్యని శ్రీకర్ తో కమలంటాడు. ఆ తర్వాత శ్రీకర్ పల్లవిని ఫాలో అవుతూ వెళ్తాడు. పల్లవి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లడం గమనించిన శ్రీకర్ అక్కడికి వెళ్తాడు. పల్లవి చక్రధర్లు ఆస్తిని ఏం చేయాలనీ మాట్లాడుకోవడం శ్రీకర్ కిటికీలోంచి వింటాడు. ఆ ఇంటిని కూడా మెల్లగా స్వాధీనం చేసుకుంటే ఆ ఇంటికి నేనే మహారాణిని అని పల్లవి అంటుంది.. ఇది కూడా త్వరలోనే జరుగుతుందని చక్రధర్ అంటాడు.. మనము ఆస్తిని కొట్టేసిన విషయం వాళ్లకి ఎప్పటికీ తెలియదు డాడ్. శ్రీకర్ శ్రీయాల మధ్య కూడా గొడవ పెట్టేసి వాళ్ళిద్దరిని విడగొడితే ఆ ఇంటికి నేనే మహారాణి అని పల్లవి అంటుంది. ఆ మాట విన్న శ్రీకర్ షాక్ అవుతాడు. మరి పల్లవి గురించి అవనికి ఈ విషయాన్ని చెప్తాడా? పల్లవి చేసిన తప్పులను సోమవారం ఎపిసోడ్లో అందరి ముందు బయట పెడతాడా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే కచ్చితంగా సోమవారం ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..