BigTV English

CM Chandrababu VS Jagan: చక్రం తిప్పబోతున్న చంద్రబాబు.. జగన్ పై అనర్హత వేటు

CM Chandrababu VS Jagan: చక్రం తిప్పబోతున్న చంద్రబాబు.. జగన్ పై అనర్హత వేటు

మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 135, జనసేనకి 21 , వైఎస్సార్సీపీకి 11, బీజేపీకి 8 సీట్లు చొప్పున దక్కాయి. సో ఇందులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఉన్నదొక్కటే ప్రతిపక్షం. అదే వైసీపీ. సో ప్రజల పక్షాన సభలో వాయిస్ వినిపించే అవకాశం వైసీపీకే ఉంది. మిగితా పక్షాలన్నీ తమ వాదనను సమర్థించుకుంటాయి. నిజానికి వైసీపీకి 11 సీట్లే వచ్చినప్పటికీ మొత్తం ఓట్లలో 40 శాతం ఓట్లు ఆ పార్టీకే పడ్డాయి. అంటే జనబలం బాగానే ఉంది. ప్రతిపక్ష హోదా రావాలంటే 10 శాతం సీట్లు రావాలి.

వైసీపీకి అది రాలేదు. కాబట్టి మైక్ ఇవ్వరు.. ప్రతిపక్ష హోదా విషయాలను పక్కన పెట్టి.. ఆ 40 శాతం మంది ప్రజలకు ప్రతినిధిగానైనా సభలో ధైర్యంగా అడుగుపెట్టాలన్న వాదన వినిపిస్తోంది. అడుగడుగునా కాన్ఫిడెన్స్‌ ఉండాలి. తర్వాత తిరిగి కచ్చితంగా అధికారంలోకి వచ్చేది తామే అన్న ధీమాతో ఉండాలి. అలాగే ప్రస్తుత ప్రభుత్వం తీరును ప్రశ్నించేలా ఉండాలి. తనకు ఓటు వేసి వారి పక్షాన అసెంబ్లీలో తాను ఉన్నానని జగన్ ధైర్యంగా నిలబడాలి. అది మానేసి.. ఇలా తనకేమీ సంబంధం లేనట్లు వ్యవహరించడం.. ప్రజల్లో పార్టీ పట్ల నెగెటివిటీ మరింతగా పెంచుతుందన్న టాక్ వినిపిస్తోంది.


ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో గొంతు వినిపించడం, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడడంలో ముందుండాలి. కానీ జగన్ రూటు మాత్రం డిఫరెంట్ గా మారుతోంది. ఇదివరకు జగన్ సీఎంగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబుని మాట్లాడనివ్వకుండా చేశారు. కాబట్టి ఆ లెక్కలు సెట్ చేస్తారన్న భయమా.. లేదంటే గత ఐదేళ్లలో జరిగిన వ్యవహారాలపై సభలో నిలదీస్తారని అనుకుంటున్నారా అన్నది కీలకంగా మారింది. ఇప్పుడు ఏదో జరిగిపోతుందని భయపడడం ఎందుకన్న ప్రశ్నలూ వస్తున్నాయి. సో ఏ లెక్కన చూసినా అసెంబ్లీకి వెళ్లాల్సిన బాధ్యత జగన్‌కి ఉంటుందని చాలా మంది గుర్తు చేస్తున్నారు. మైక్ ఇచ్చినా, ఇవ్వకపోయినా, సభకు వెళ్లాలని, ప్రజా సమస్యలపై గళమెత్తాలని, మైక్ ఇవ్వకపోతే నిరసన తెలిపైనా సరే సభలో ఉండాలన్న సలహాలు వెళ్తున్నాయి. అప్పుడే ప్రజల పక్షాన వైసీపీ ఉందన్న విషయం జనంలోకి వెళ్తుందని సలహాలూ ఇస్తున్నారు. అయితే ఆ సలహాలను పాటించేదెవరు?

Also Read: నెల్లిమర్ల లో సీన్ రివర్స్.. షాక్‌లో పవన్,బాబు

సీఎం చంద్రబాబును చూసి జగన్ చాలా నేర్చుకోవాలి అంటున్నారు పొలిటికల్ ఎక్స్ పర్ట్స్. ఎందుకంటే 2019లో టీడీపీ 23 సీట్లకే పరిమితమైంది. అయినప్పటికీ చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లారు. మైక్ ఇవ్వకపోయినా ఆ వయసులోనూ పోరాడారు. పాలక పక్షం ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. బలంగా నిలబడ్డారని గుర్తు చేస్తున్నారు. ఇక టీడీపీ పని అయిపోయింది అని ఎన్నోసార్లు వైసీపీ నిండు సభలోనే సెటైర్లు వేసినా.. పట్టుదలతో ముందుకెళ్లారంటున్నారు. అసలు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలని షర్మిల డైరెక్ట్ గానే డిమాండ్ చేస్తున్నారు.

ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి హోదాలో కొనసాగిన జగన్మోహన్ రెడ్డి 2014-19 మధ్య ప్రధాన ప్రతిపక్ష నేతగానూ ఉన్నారు. అప్పట్లో ఆయన పార్టీకి 67 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. కానీ తాజా ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితం కావడంతో జగన్‌కి ప్రతిపక్ష హోదా కట్ అయింది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 168 నుంచి 221 వరకూ రాష్ట్రాల శాసనసభలు, కౌన్సిల్ నిర్వహణ, విధుల గురించి ప్రస్తావించారు. ఏదైనా చట్ట సభలో అధికార పార్టీ తర్వాత పెద్ద పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కాలంటే సభలో ఆ పార్టీకి కనీసం 10 శాతం సభ్యులుండాలి. ఆ లెక్కన లోక్‌సభలో అయితే 55 ఎంపీ సీట్లు, ఏపీ అసెంబ్లీలో 18 ఎమ్మెల్యే సీట్లు దక్కిన పార్టీలకే ప్రధాన ప్రతిపక్ష హోదా హోదా లభిస్తుంది. నిర్ణీత సంఖ్యలో సీట్లు దక్కిన పార్టీ నాయకుడిని ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ ప్రకటిస్తారు. కానీ ఏపీలో వైసీపీ 11 సీట్లతో ఏ లెక్కన ప్రధాన ప్రతిపక్ష హోదా అడుగుతోందో ఎవరికీ అంతుబట్టని విషయం.

సరే ఇప్పుడు మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి వెళ్లొద్దని గట్టిగా డిసైడ్ అయ్యారు. మరి వరుసగా ఎన్ని రోజులు సభకు గైర్హాజరైతే సభ్యుడిగా అనర్హత వేటు పడుతుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 190 ప్రకారం 60 రోజుల పాటు ఒక రాష్ట్ర శాసన సభ సభ్యుడు సభ అనుమతి లేకుండా అన్ని సమావేశాలకు గైర్హాజరైతే, సభ అతని స్థానాన్ని ఖాళీగా ప్రకటించవచ్చని చెబుతోంది. అయితే 60 రోజుల వ్యవధిని లెక్కించడంలో, సభను ప్రోరోగ్ చేసిన లేదా వరుసగా నాలుగు రోజుల కంటే ఎక్కువ కాలం వాయిదా వేసిన కాలానికి లెక్కలోకి తీసుకోవద్దన్న నిబంధన ఉంది. సో వేటు పడకుండా సభకు వచ్చి టెక్నికల్ గా సంతకం చేసి వెళ్తారా లేక.. వేటు వేయించుకుంటారా అన్నది కూడా ఇంట్రెస్టింగ్ గా మారుతోంది.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×