Tata Group invest AP: స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై ఫోకస్ చేసింది ఏపీలో కూటమి సర్కార్. అధికారంలోకి వచ్చిన నుంచి పెట్టబడులపై వేట మొదలు పెట్టేసింది. అమరావతిలో ఉంటూ సీఎం చంద్రబాబు ఆయా వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ఈ నేపథ్యంలో 40 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు టాటాగ్రూప్ ముందుకొచ్చింది.
ఏపీకి పూర్వవైభవం తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం చంద్రబాబు. ఓ వైపు పాలనపై దృష్టిపెడుతూ, ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్ ముందుకొచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే దాదాపు 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అన్నమాట.
సోమవారం అమరావతికి వచ్చారు టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్. సీఎం చంద్రబాబు తో దాదాపు గంటపాటు భేటీ అయ్యారు. దివంగత రతన్ టాటా ఉన్నప్పుడు ఏపీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో పెట్టుబడుల ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా కీలక అంశాలపై ఇరువురు చర్చించారు.
విశాఖలో టీసీఎస్ కొత్త ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 10 వేల ఉద్యోగాలు రానున్నాయి. కొత్తగా 20 హోటళ్లు ఏర్పాటుకు టాటా గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. వీటిలో విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి ప్రాంతాలున్నాయి. వీటితోపాటు పెద్ద కన్వెన్షన్ సెంటర్‌పై దృష్టి సారించింది.
ALSO READ: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..
టాటాపవర్ సోలార్, విండ్ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చ జరిగింది. ఈ విభాగంలో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. చర్చల విషయాన్ని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా వెల్లడించారు. వీటితోపాటు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం డీప్ టెక్, ఏఐ వినియోగంపై సహకారం అందించడంపై చర్చించారు.
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఔత్సాహిక యువతకు మద్దతునిచ్చే లక్ష్యంతో పని చేయనుంది. ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త కాన్సెప్ట్‌ని తెరపైకి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఏపీలో టాటా గ్రూప్ పెట్టుబడులు ముందుకు రావడంతో మిగతా కంపెనీలు అటువైపు ఫోకస్ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే జోరు కొనసాగితే మరో మూడేళ్లు ఏపీ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉండడం ఖాయమని అంటున్నారు.