Brahmamudi serial today Episode: ధాన్యలక్ష్మీని అడ్డుపెట్టుకుని ఎలాగైనా ఆస్తి పంపకాలు జరిగేలా చూడాలని రుద్రాణి అనుకుంటుంది. అందుకోసం ధాన్యలక్ష్మీని మరింత రెచ్చగొడుతుంది. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆస్థి పంపకాలు జరగవని.. ఆ కావ్య అడ్డుపడి ఆస్థి పంపకాలు జరగనివ్వదని రెచ్చగొడుతుంది. దీంతో ధాన్యలక్ష్మీ ఈ సారి ఆస్థి పంపకాలు జరగకపోతే నేనేంటో చూపిస్తాను అంటూ రుద్రాణి వెళ్లిపోతుంది.
మరుసటి రోజు అందరూ హాల్లో కూర్చుని ఉండగా.. ధాన్యలక్ష్మీ వస్తుంది. మామయ్య గారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను అన్నారు. మీ మీద గౌరవంతో ఇప్పటి వరకు ఓపిక పట్టాను. మీరు ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్తారని ఎదురుచూస్తున్నాను మామయ్యగారు అని అడుగుతుంది. దీంతో సీతారామయ్య ఎమోషనల్ గా ఇది ఇంటి పెద్దగా నాకు అగ్నిపరీక్ష. నిర్ణయం తీసుకోవాలన్నా.. పరిష్కారం ఆలోచించాలన్నా.. వందేళ్ల చరిత్రను ఒక్కరోజులో మార్చలేని ధైర్యం లేని అసక్తత ఆవహిస్తుంది. కాస్త వ్యవధి కావాలని మాత్రం అడగాలనుకుంటున్నాను అని చెప్పగానే ధాన్యలక్ష్మీ ఎంత సమయం కావాలి మామయ్య గారు.. చెప్పండి ఎంత సమయం కావాలి. మీరు సమయం అడిగే లోపు ఏదైనా జరగొచ్చు. లేదంటే అంతా కలిసి నా నోరు మూయించొచ్చు అంటూ ఎదరు ప్రశ్నించడంతో ఇందిరాదేవి కోపంగా ధాన్యలక్ష్మీ ఏం కావాలి నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు. అసలు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు.
నా కొడుకు చవటలా కూర్చుంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఏరా సిగ్గు లేదా… నీకు. నీ తండ్రి నిస్సహాయంగా మాట్లాడుతుంటే.. అంటూ ఏదో అనబోతుంటే ఇంతలో ధాన్యలక్ష్మీ కూడా .నేనేం నిస్సహాయంగా.. అని అంటుండగానే ఇందిరాదేవి గట్టిగా నోరు మూయ్.. కోడలి మీద చేయి చేసుకున్న మచ్చ రాకూడదని ఊరికే ఉన్నాను. మీ తాతముత్తాల ఆస్థులు ఏమైనా పసుపు కుంకుమ కింద తీసుకొచ్చి మా ఆస్థుల్లో కలిపావా..? కోడలిగా హక్కులు అడిగే ముందు బాధ్యతలు ఏంటో తెలుసుకోవాలి అని ఇందిరాదేవి చెప్పగానే రుద్రాణి నాకు తెలసుసమ్మా.. ఇలా గట్టిగా అరిచి నోట్లో మట్టి కొట్టి.. అంటూ ఏదో చెప్పబోతుంటే స్వప్న అడ్డుపడుతుంది.
అత్తా ఇంకొక మాట మాట్లాడితే నేనే నిన్ను ఇంట్లోంచి గెంటివేస్తాను. ఈ ఇంటిని ముక్కలు చేయమన్న ఆలోచన ధాన్యలక్ష్మీ ఆంటీలో కలిగించింది నువ్వే అని నాకు తెలుసు. అయినా నీ మొగుడు సంపాదించిన ఆస్థులు ఏమైనా ఉన్నాయా..? ఇక్కడ అంటూ ప్రశ్నిస్తుంది. ఇంతలో రాజ్ వచ్చి ఇదంతా ఎందుకు అప్పును పిన్ని కోడలేగా అంగీకరిస్తే కళ్యాణ్ ఇక్కడే ఉంటాడు కదా.. అని చెప్పగానే ఇందిరాదేవి రాజ్‌ను తిడుతుంది. నువ్వు సరిగ్గా చెస్తే ఇంకొకరికి నీతులు చెప్పు రాజ్. పెళ్లాన్ని ఇంట్లోంచి వెళ్లగొట్టిన నువ్వు నీతులు చెప్పడం ఏంటి అని తిట్టి సీతారామయ్యను తీసుకుని వెళ్లిపోతుంది ఇందిరాదేవి.
రాజ్ సార్ ఫైల్ మీద సంతకం చేయడం లేదని శృతి వెళ్లి కావ్యకు చెప్తుంది. ఎందుకు చేయడం లేదని కావ్య అడిగితే మీ సీఈవోకు చెప్పుకో అన్నారు మేడం అని శృతి చెప్పగానే కావ్య కోపంగా రాజ్ చాంబర్ లోకి వెళ్తుంది. ఎందుకు ఈ ఫైల్ మీద సంతకం చేయనన్నారట అని అడుగుతుంది. దీంతో రాజ్ నా ఇష్టం నేను చేయని.. నాకు ఆ కంపెనీతో బిజినెస్ చేయడం నచ్చడం లేదు. అని తిక్క తిక్క సమాధానాలు చెప్తాడు. దీంతో కావ్య కోపంగా చూడండి మనిద్దరి మధ్య ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం. అంతే కానీ వ్యక్తిగత జీవితాన్ని, ప్రొఫెషనల్ జీవితాన్ని ఒకేలా చూడకండి అని చెప్తుంది. దీంతో రాజ్ నాకు నీతో వ్యక్తిగత జీవితం కూడా ఉందా? అంటాడు.
ఉందో లేదో భూత్ బంగ్లాను అడగండి చెప్తుంది అని కావ్య అనగానే రాజ్ ఇరిటేటింగ్ కుర్చీలోంచి లేచి కావ్యు తిడతాడు. నేను సంతకం పెట్టను అని కరాకండిగా చెప్పేస్తాడు. దీంతో కావ్య సీఈవోగా మిమ్మల్ని డిస్మిస్ చేస్తాను అని చెప్తుంది. దీంతో రాజ్ అసలు నేను ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కితే నీ సీఈవో జాబ్ కొట్టుకుపోతుందే అని ఫైల్ తీసుకుని తాతయ్య దగ్గరకు వెళ్తాను అని చెప్తాడు. దీంతో కావ్య మీరు ఏమైనా చేసుకోండి కానీ ముందు ఫైల్ మీద సంతకం చేయండి అని చెప్పి వెళ్లిపోతుంది. రాజ్ ఆ ఫైల్ తీసుకుని ఇంటికి వెళ్తున్నానని మీ సీఈవో మేడంకు చెప్పుకో అని శృతికి చెప్పి వెళ్లిపోతాడు.
గార్డెన్ లో కూర్చున్న సీతారామయ్య దగ్గరకు వెళ్లిన రాజ్. తాతయ్య ఇంట్లో ఇన్ని గొడవలకు కారణం ఏంటో తెలుసా..? మీరు ఆ కళావతిని సీఈవో చేయడమే.. పరాయి మనిషిని వచ్చి మన కంపెనీలో పెత్తనం చేస్తుంటే ఈ ఇంటి వారసుడు కళ్యణ్ ఆటో నడపడం చూసి తట్టుకోలేకే పిన్ని ఇంత రాదాంతం చేస్తుంది. అందుకే ముందు కళావతిని సీఈవోగా తీసేయండి అని చెప్తాడు రాజ్. దీంతో సీతారామయ్య రాజ్‌ను తిడతాడు. పిన్నికి ఎలా బుద్ది చెప్పాలో నాకు తెలుసు కానీ ఇదంతా జరగడానికి నువ్వే కారణం అంటూ పెళ్లాన్ని ఇంట్లోంచి వెళ్లగొట్టిన నువ్వా నాకు చెప్పేది అంటూ నిలదీయడంతో రాజ్ అక్కడి నుంచి కామ్‌గా వెళ్లిపోతాడు.
ఇంత కష్టపడి ప్లాన్ చేసి ధాన్యలక్ష్మీని రెచ్చగొట్టి ముందుకు తోస్తే ఆ ముసలోడు ఆస్తిని ముక్కలు చేస్తాడనుకున్నాను. కానీ సింపుల్ గా తప్పించుకున్నాడు కదార అంటూ రాహుల్ తో బాధపడతుంది రుద్రాణి. ఎక్కడ తప్పించుకున్నాడు మమ్మీ. జస్ట్ టైం కావాలన్నాడు. చిన్న అత్తయ్య వదిలేస్తుందా..? ఏంటి.. ? అని రాహుల్ చెప్పగానే ఇన్ని జరుగుతున్నా మీ తాతయ్య గురించి నీకింకా అర్థం కాలేదా..? ఇంత ప్లాన్ చేసి కావ్యను ఇంట్లోంచి వెళ్లగొడితే కావ్యను కంపెనీ సీఈవోను చేశాడు. అని చెప్పగానే అవును మమ్మీ నువ్వు చెప్పింది కూడా నిజమే. పేరుకే తాతయ్య ఔట్ డేటెడ్ అయ్యాడు. కానీ ఆలోచనల్లో మన కన్నా చాలా ముందే ఉన్నాడు అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటుండగా స్వప్న వస్తుంది.
ఆస్థిని ముక్కలు చేయాలని మీరు ప్రయత్నిస్తే నేను అడ్డుకుంటాను అని చెప్తుంది. దీంతో రుద్రాణి ఆ ఆస్థి నీ మొగుడికే వస్తుంది కదే.. అప్పుడు నీకు వచ్చినట్టే కదా..? అంటుంది. ఆ ఆస్తి మీచేతికి వస్తే మూడు రోజుల్లో చిల్లిగవ్వ లేకుండా చేస్తారు. తర్వాత నేను అడుక్కుతినే పరిస్థితి వస్తుంది. అదే ఉమ్మడిగాఉంటే ఇక్కడే హ్యాపీగా మహరాణిలా బతకొచ్చు అంటుంది. ఏంటి వాళ్ల మోచేతి నీళ్లు తాగుతూ మహారాణిలా బతుకుతావా…? అంటూ రుద్రాణి ప్రశ్నించగానే అవునని చెప్పి స్వప్న వెళ్లిపోతుంది. కోపంగా రాహుల్ ముందు దీన్ని లేపేయాలి మమ్మీ అంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.