BigTV English

Janasena vs TDP: నెల్లిమర్ల లో సీన్ రివర్స్.. షాక్‌లో పవన్,బాబు

Janasena vs TDP: నెల్లిమర్ల లో సీన్ రివర్స్.. షాక్‌లో పవన్,బాబు

Janasena vs TDP: తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉన్న నియోజకవర్గం.. తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే ఏడు సార్లు గెలుపొందిన చరిత్ర.. మొన్నటి ఎన్నికల్లో కూడా టీడీపీ అక్కడ ఈజీగానే గెలుస్తుందని భావించారు. అందుకు పార్టీ ఇన్చార్జ్ గ్రౌండ్ వర్క్ కూడా చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో పొత్తుల లెక్కలతో అది జనసేనకు దక్కింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేసిన తెలుగు తమ్ముళ్లు జనసేన కేండెట్‌ని మంచి మెజార్టీతో గెలిపించుకున్నారు. అంతా బాగుంది అనుకుంటున్న టైంలో జనసేన ఎమ్మెల్యే నియోజకవర్గంలో పట్టు పెంచుకోవడానికి వైసీపీ శ్రేణుల మీద ఆధారపడుతుండటం కూటమిలో చిచ్చు రేపుతుందంట. ఇంతకీ ఆ పరిస్థితి ఎక్కడంటారా? లెట్ వాచ్ థిస్ స్టోరీ


విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం.. 2024 కి ముందు అక్కడ 9 ఎన్నికలు జరిగితే అందులో టీడీపీ నుండి పతివాడ నారాయణ స్వామినాయుడు ఏడు సార్లు గెలిచారు. అంత పట్టుంది ఈ నియోజకవర్గంలో టీడీపీకి. ఉమ్మడి జిల్లాలోవిజయనగరం నియోజకవర్గం తరువాత టీడీపీకి కంచుకోట నెల్లిమర్ల. 2024 లో మరోసారి జయకేతనం ఎగురవేసేందుకు టీడీపీ అంతా రెడీ చేసుకుంది. ఇంచార్జ్ బంగార్రాజు తాను ఎమ్మెల్యే అయిపోయాననే భావించారు. కానీ కూటమి పొత్తుల్లో భాగంగా టికెట్ ను జనసేనకి కేటాయించాల్సి వచ్చింది. ఇంచార్జ్ గా ఉన్న బంగార్రాజు సైతం చంద్రబాబు మాట కాదనలేక జనసేన అభ్యర్థి లోకం మాధవికి మద్దతుగా నిలిచారు. కూటమి గెలిచింది. నెల్లోమర్లలోనూ జనసేన భారీ మెజారిటీతో జయకేతనం ఎగురవేసింది. ఇదంతా టీడీపీ సపోర్ట్ తోనే అనేది బహిరంగ రహస్యం.

సమస్యంతా ఇక్కడే వచ్చింది. గెలిచిన మాధవి సంతోషంగా వున్నారు. సీటు రాని బంగార్రాజు కాస్త నైరాశ్యం లోకి వెళ్ళిపోయాడు. కుర్చీలో కూర్చోకపోయినా తన మాట చెల్లుబాటు అవుతుందని తనకు తానే సర్ది చెప్పుకున్నాడు. కానీ సీన్ రివర్స్ అయింది. అనుకున్నదొక్కటి, అయ్యినదొక్కటి అనే చందంగా తయారయ్యింది బంగార్రాజు పరిస్థితి. అటు పార్టీ నుండి అనుకున్న నామినేటెడ్ పదవి కూడా దక్కలేదు. ఎమ్మెల్సీ ఆశించిన బంగార్రాజుకు మార్క్‌ఫెడ్ చైర్మన్ తో సరిపెట్టింది ప్రభుత్వం.


దానిపై కూడా బంగార్రాజు అసంతృప్తి వ్యక్తం చేయలేదు. పార్టీ నిర్ణయమే శిరోధార్యం అన్నట్లు ఇచ్చిన పదవిని స్వీకరించారు. బంగార్రాజుకు పదవి రావడం ఇష్టం లేదో, లేక ఇతరత్రా కారణాలో అనేది పక్కనపెడితే.. చైర్మన్ పదవి వచ్చాక బంగార్రాజు నిర్వహించిన అభినందన సభకి జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ హాజరైనా.. అదే నియోజకవర్గంలో ఉన్న లోకం మాధవి మాత్రం హాజరుకాలేదు. దీంతో అంతవరకూ స్తబ్దుగా ఉన్న విభేదాల టాపిక్ తెరమీదకి వచ్చింది.

Also Read: వైసీపీ భక్తులుగా అధికారులు? బయటపడ్డ షాకింగ్ నిజాలు

నెల్లిమర్ల నగరపంచాయతీ వేదికగా విభేదాలు భగ్గుమన్నాయి. కూటమి నేతల మధ్య ఉన్న గొడవలు రచ్చకెక్కి జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారాయి. బంగార్రాజు నియోజకవర్గం టీడీపీవిస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తే.. టీడీపీ నాయకులంతా తమకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయిందని తమ ఆవేదనను వెళ్లగక్కారంట. అది తెలిసి బాగా ఖాళీగా ఉన్న వైసీపీ నేతలు కూటమి బీటలు వారిందని ప్రచారం మొదలుపెట్టారు. దాంతో జనసేన, టీడీపీ ముఖ్య నేతలు అలర్ట్ అయ్యారు. ఎమ్మెల్యే మాధవి, బంగార్రాజులను విజయవాడకి పిలిపించుకుని పంచాయతీ పెట్టాల్సి వచ్చింది.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జనసేన నాయకుడు, ఎమ్మెల్సీ హరిప్రసాద్‌లు ఆ ఇద్దరికీ క్లాస్ పీకారంట. కలిసి పని చేయాలని హితవు పలికి, విభేదాలకు చెప్పిన కారణాలు విని కాస్త గట్టిగానే హెచ్చరించి పంపించారంట. కాంట్రక్ వర్కులు ఉంటే 60:30:10 నిష్పత్తిలో కూటమి పార్టీలకు కేటాయించాలని మాధవికి సూచించారట. వైసీపీ ట్రాప్ లో పడొద్దని, బంగార్రాజుకు కూడా పాలన వ్యవహారాల్లో జోక్యం వద్దని తేల్చి చెప్పారంట.

మరి అక్కడ తలూపి వచ్చిన లోకం, కర్రోతు మధ్య సయోధ్య కుదిరిందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయ విశ్లేషకులు మాత్రం అది జరిగే పని కాదని తేల్చేస్తున్నారు. ఇద్దరూ వ్యక్తిగతంగా తమ హవా చూపించాలనుకుంటున్న పరిస్థితుల్లో కలిసి పని చేసే అవకాశం లేదంటున్నారు. బంగార్రాజుకు స్థానికంగా పెద్ద ఎత్తున ఉంది. అయితే మాధవికి ఆ స్థాయిలో ఫాలోయింగ్ లేకపోవడం ఇబ్బందిగా మారిందంటున్నారు. దాంతో మాధవి వైసీపీ నుండి వలసల్ని ప్రోత్సహించి, టీడీపీ ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇద్దరి మధ్య విభేదాలకు కారణం కూడా అదేనన్న చర్చ నడుస్తోంది. ఆ క్రమంలో మాధవి దూకుడు విమర్శల పాలవుతుంది. ఎన్నికల ప్రచారంలో కూటమి నేతల్ని తీవ్రంగా టార్గెట్ చేసి, అంతకు ముందు వేధింపులకు గురిచేసిన వైసీపీ నాయకులను జనసేనలో చేర్చుకోవడం, వారికి ప్రాధాన్యత నివ్వడం, కాంట్రాక్టులు అప్పగించడం అటు తెలుగు తమ్ముళ్లతో పాటు, జనసైనికులకు కూడా మింగుడు పడటం లేదంటున్నారు. ఇలంటి పరిస్థితుల్లో లోకం, కర్రోతుల మధ్య సఖ్యత ఏలా కుదురుతుందో చూడాలి.

 

Related News

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

Big Stories

×