Indore Crime News: ఈ మధ్యకాలంలో ప్రేమ.. బ్రేకప్.. మ్యారేజ్ తర్వాత ఊహించని ఘటనలు జరుగుతున్నాయి. కారణాలు ఏమైనా కావచ్చు. ఒకరి కొకరు అర్థం చేసుకోలేక ఆవేశాలకు లోనవుతున్నారు. ఫలితంగా దాడులు, హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తాజాగా బ్రేకప్ చెప్పిందన్న కారణంతో ప్రియురాల్ని బైక్‌తో హిట్ కొట్టాడు ఓ యువకుడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సిటీలో షాకింగ్ ఘటన జరిగింది. కల్పనా నగర్ ప్రాంతంలో టూవీలర్‌పై వస్తున్న ఓ యువకుడు ఉద్దేశ పూర్వకంగా యువతిని తన బైక్‌తో ఢీకొట్టాడు. లైవ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధిత యువతి తలకు తీవ్ర గాయమైంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలో సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యువకుడు పేరు రాజేంద్ర, చాన్నాళ్లుగా ఆ యువతితో గొడవపడుతున్నాడు. ఘటన జరిగిన రోజు యువకుడు-యువతి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగినట్టు కనిపిస్తోంది. పట్టరాని కోపంతో ఆ యువతి, యువకుడిపై రాయి విసిరింది. దీంతో ఆగ్రహానికి గురయ్యాడు యువకుడు.
తన బైక్‌ను వేగంగా నడుపుతూ మహిళను ఢీ కొట్టాడు. వెంటనే యువతి నేలపై పడిపోయింది. గట్టిగా కేకలు పెట్టడంతో ఇరుగుపొరుగువారు వచ్చి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సీసీటీవీ ఫుటేజ్‌లో యువకుడు ఉద్దేశ పూర్వకంగా యువతిని ఢీ కొట్టినట్టు కనిపిస్తోంది.
ALSO READ: బ్యాట్‌తో కుర్రవాళ్లు.. లోకల్ ట్రైన్‌లో ఆడాళ్లు
వీడియో బయటకు రావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీడియో ఆధారంగా పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరి మధ్య చాలాకాలంగా గొడవలు జరుగుతున్నాయి, ఈ ఘటనకు అదే కారణమైందని తేలింది.
ఈ ఘటనకు సంబంధించి ప్రతి అంశాన్ని లోతుగా దర్యాప్తు చేస్తున్నామని హిరానగర్ పోలీసులు తెలిపారు. యువకుడిపై దాడి, గాయపరచడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఇండోర్ సిటీలో సంచలనం రేపింది. ఇలాంటి హింసాత్మక ఘటనలు సమాజానికి ముప్పు కలిగిస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి ఘటనలను నివారించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. యువతికి త్వరగా న్యాయం జరగాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు. ఈ ఘటనపై వేగంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో తనకు బ్రేక్ అప్ చెప్పిందని యువతిని బైక్ తో ఢీకొట్టి పరారైన యువకుడు pic.twitter.com/MuInnBNpEt
— BIG TV Breaking News (@bigtvtelugu) September 26, 2025